వేల కొలువులకు పచ్చ జెండా!
* దాదాపు 13 వేల జూనియర్ ఇంజినీర్ పోస్టులు* బీటెక్, డిప్లొమా హోల్డర్లకు సదవకాశం
రైల్వేలో కొలువులంటే ఎంతో మంది యువతీయువకులకు ఆసక్తి. ఈ శాఖలో ఇప్పుడు భారీ సంఖ్యలో జూనియర్ ఇంజినీర్‌లకు ఉద్యోగావకాశాలు వచ్చాయి. మరో రెండు రకాల పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు మొత్తం 13,487 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా జూనియర్ ఇంజినీర్, జూనియర్ ఇంజినీర్ (ఐటీ), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఆసక్తి ఉన్నవారి కర్తవ్యం- వెంటనే దరఖాస్తు చేసుకోవటం, సన్నద్ధతకు సిద్ధమైపోవటమే!
ప్రకటించిన పోస్టులు:
జూనియర్ ఇంజినీర్- 12,844
జూనియర్ ఇంజినీర్ (ఐటీ)- 29
డిపో మెటీరియల్ సూపరింటెండెంట్- 227
కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్- 387
వీటికి 18 నుంచి 33 సంవత్సరాల లోపు ఉన్నవారు (01.01.2019 నాటికి) అర్హులు. రాతపరీక్ష తేదీలు ఇంకా విడుదల కాలేదు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ జనవరి 2న మొదలై జనవరి 31కు ముగుస్తుంది.

* డిప్లొమా/ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేసినవారు జూనియర్ ఇంజినీర్ పోస్టులకు అర్హులు.
* బీఎస్‌సీ (కంప్యూటర్ సైన్స్), బీసీఏ, బీటెక్ (సీఎస్‌ఈ/ఐటీ) అభ్యర్థులు జూనియర్ ఇంజినీర్ (ఐటీ) పోస్టులకు అర్హులు.
* ఏదైనా డిప్లొమా/ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేసినవారు డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులకు అర్హులు
* బ్యాచిలర్ డిగ్రీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు ఉన్నవారు కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులు.
సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్‌మెంట్, మిలటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్, వివిధ ప్రాజెక్టులు, డైరెక్టర్ జనరల్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ వంటి సంస్థల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టులో విధులు నిర్వర్తించాలి. రోజువారీ పనుల్లో కిందిస్థాయి ఉద్యోగుల పనితీరును గమనించాలి. వాటిని ప్రతిరోజూ రికార్డు చేసుకుని, తరువాతి పనిదినాల్లో చేయాల్సిన పనులను ఆయా సిబ్బందికి కేటాయించి, పనిలో పురోగతి ఉండేలా చూసుకోవాలి. కొత్త ప్రాజెక్టులు మొదలవుతుంటే వాటి ప్లానింగ్ లేదా ప్రస్తుతం ఉన్నవాటి రిపేర్లు, పునరుద్ధరణ వంటివి జూనియర్ ఇంజినీర్ల కార్యకలాపాలు.

జూనియర్ ఇంజినీర్ పోస్టులో చేరిన తరువాత పదోన్నతి ద్వారా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టు ఆ తరువాత సీనియర్ సెక్షన్ ఇంజినీర్ పోస్టులకు చేరవచ్చు. జూనియర్ ఇంజినీరు పోస్టులో చేరినవారికి నెలకు రూ.35,000 జీతంతోపాటు అలవెన్సులు, అనేక సౌకర్యాలు లభిస్తాయి.
ఎంపిక ప్రక్రియ
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)- 1, 2 పరీక్షలు రాయాలి. మొదటి పరీక్షలో అర్హత మార్కులు పొందినవారికి రెండో పరీక్ష నిర్వహిస్తారు. సీబీటీ-1 పరీక్ష అర్హత (క్వాలిఫైయింగ్) కోసం మాత్రమే. ఈ పరీక్షలో వచ్చే మార్కులు సీబీటీ-2కు అర్హత సాధించేందుకు అవసరం. ఫైనల్ మెరిట్ మార్కుల్లో సీబీటీ-1 మార్కులను పరిగణనలోకి తీసుకోరు.
సీబీటీ-2లోని మార్కుల ఆధారంగా మెడికల్ పరీక్షను కూడా విజయవంతంగా పూర్తిచేసినవారికి పోస్టులు కేటాయిస్తారు.

ఏ విభాగం ఎలా చదవాలి?
జనరల్ ఇంటెలిజెన్స్: విభాగంలోని ప్రశ్నలు సులువుగా ఉంటాయి. సీటింగ్ అరేంజ్‌మెంట్, ఇన్‌పుట్-అవుట్‌పుట్, కోడింగ్-డీకోడింగ్, సిలాజిజం విభాగాల్లోని ప్రశ్నలకు సమాధానం గుర్తించాలంటే ఇంగ్లిష్ భాష మీద పట్టుండాలి. మిగిలిన అంశాలైన నంబర్లు, లెటర్లు, క్యాలెండర్, క్లాక్, నాన్‌వెర్బల్ సిరీస్, డైరెక్షన్స్ అంశాలు సులువుగా సమాధానాలు గుర్తించేలా ఉంటాయి. ఎక్కువ ప్రశ్నలు సాధన చేస్తే సమాధానాలను తక్కువ సమయంలో గుర్తించవచ్చు. ఈ విభాగంలోని ప్రశ్నలు నేరుగా అడిగేలా ఉంటాయి. కాబట్టి అందుబాటులో ఉన్న మెటీరియల్ నుంచి వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి.
అరిథ్‌మెటిక్: బీటెక్ అభ్యర్థులు కొంతమేరకు సులువుగా చేయవచ్చు. డిప్లొమా వారు ఎక్కువ సమయం సన్నద్ధతకు కేటాయించాల్సి ఉంటుంది. సాధన చేస్తే కచ్చితమైన సమాధానాన్ని గుర్తించి మార్కులను పొందొచ్చు. ఆల్జీబ్రా, పాలినామియర్స్, వైశాల్యాలు, ఘనపరిమాణాలు ఫార్ములాలతో ముడిపడి ఉంటాయి. కాబట్టి, ఫార్ములాలను పట్టిక రూపంలో తయారు చేసుకుని, మననం చేయాలి. మిగిలిన అంశాలను రోజువారీ పనులతో ముడిపెట్టుకుంటూ సాధన చేయాలి. శాతాలు, నిష్పత్తి, వ్యాపార భాగస్వామ్యం, లాభనష్టాలు, చక్రవడ్డీ, బారువడ్డీ, కాలం-దూరం, కాలం-పని నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. పైచార్ట్, బార్ డయాగ్రమ్, లైన్‌గ్రాఫ్‌ల నుంచి 5 ప్రశ్నలు వస్తాయి.
జనరల్ అవేర్‌నెస్: మంచి మార్కులు పొందాలంటే మెటీరియల్ తప్పనిసరి. కాబట్టి, తగిన దానిని ఎంచుకోవాలి. రైల్వే బడ్జెట్, నూతన రైలు మార్గాలు, ప్రాజెక్టులు, టెక్నాలజీ (రైల్వే), రైల్వే ఆవిష్కరణలు, ప్రమాదాలు-జాగ్రత్తలు మొదలైన వాటిపై శ్రద్ధపెట్టాలి. రైల్వే జోన్లు, స్కీమ్‌లు, రైల్వే-ఎకానమీ వంటి వాటినీ పరిగణనలోకి తీసుకోవాలి. కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లు, క్రీడలు, కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
జనరల్ సైన్స్: ఇంటర్‌లో చదువుకున్న అంశాల నుంచే ప్రశ్నలుంటాయి. ప్రశ్నల స్థాయి సాధారణంగా ఉంటుంది. రోజువారీ చర్యల్లో ఉండే సైన్స్‌ని పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

పరీక్షకు తగ్గట్టుగా మెటీరియల్ సిద్ధం చేసుకుని, ఎక్కువ మాదిరి ప్రశ్నపత్రాలను సాధన చేస్తే మెరుగైన ఫలితాలను పొందొచ్చు.
టెక్నికల్ ఎబిలిటీ ప్రశ్నలు ఇంజినీరింగ్‌లోని ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్స్, సివిల్, ఐటీ, కెమికల్, మెకానికల్, ఎన్విరాన్‌మెంట్, ఇంజినీరింగ్ డ్రాయింగ్, గ్రాఫిక్స్ నుంచి ఉంటాయి.
వైర్‌లెస్ కమ్యూనికేషన్, సిగ్నల్ సిస్టం, కంట్రోల్ సిస్టం, జంక్షన్స్, డయోడ్స్, అనలాగ్, డిజిటల్ సర్క్యూట్స్, ఎనర్జీ బ్యాండ్స్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో ముఖ్యమైన ప్రశ్నలు.
కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ ఆఫీస్ షార్ట్‌కట్స్, డీబీఎంఎస్, ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ నెట్‌వర్క్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, సిస్టమ్ ప్రోగ్రామింగ్ విభాగాలు కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో ముఖ్యమైనవి.
సబ్జెక్టు మీద కనీసావగాహన ఉండి, ప్రాథమిక అంశాలపై పట్టుంటే సమాధానాలను గుర్తించవచ్చు. పుస్తకాల ద్వారా నేర్చుకున్న పరిజ్ఞానానికి ప్రాక్టికల్ వినియోగం తెలిసుండాలి. సుమారు 14,000 పోస్టులున్న నోటిఫికేషన్ కాబట్టి, అభ్యర్థులు ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంశాలపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. ఆ విధంగా పరీక్షకు గరిష్ఠస్థాయిలో సన్నద్ధమైతే రైల్వే జూనియర్ ఇంజినీర్ పోస్టులను చేజిక్కించుకోవచ్చు.

No comments:
Post a Comment