Saturday, November 17, 2018

కరెంటు అఫైర్స్ ఆక్టోబర్ 2018 - స్పోర్ట్స్

                     కరెంటు అఫైర్స్ ఆక్టోబర్ 2018 - స్పోర్ట్స్ 



  • హర్యానాలోని గురుగ్రామ్‌లో బధిరుల టి20 ప్రపంచకప్‌ను నిర్వహించనున్నారు. బధిరుల అంతర్జాతీయ క్రికెట్ మండలి (డెఫ్ ఐసీసీ) ఆధ్వర్యంలో డెఫ్ క్రికెట్ సొసైటీ (డీసీఎస్) ఈ టోర్నమెంట్‌ను నిర్వహించనుంది.
  • 14వ ఆసియా కప్ వన్డే టోర్నీ-2018 విజేత -  భారత్
  • ఫైనల్లో భారత్ 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. దీంతో భారత్ ఏడోసారి ఆసియా కప్‌ను సొంతం చేసుకున్నట్లయింది.( దుబాయ్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్)
  • రష్యా గ్రాండ్‌ప్రి టైటిల్ విజేత - లూయిస్ హామిల్టన్ ,( సోచి, రష్యా )
  • సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వచ్చింది. ఈ మేరకు కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) అక్టోబర్ 1న ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై ప్రజలు సమాచార హక్కు చట్టం కింద ఏదైనా సమాచారం కోరితే బీసీసీఐ తప్పనిసరిగా దానిని వెల్లడించాల్సి ఉంటుంది.
  • భారత స్ప్రింటర్ హిమదాస్‌కు ప్రభుత్వ చమురు కంపెనీ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఉద్యోగం ఇచ్చింది. హిమదాస్ సాధించిన విజయాలకు ప్రోత్సాహంగా తమ సంస్థ మానవ వనరుల (హెచ్‌ఆర్) విభాగంలో గ్రేడ్ ‘ఎ’ ఆఫీసర్ ఉద్యోగం ఇచ్చినట్లు ఐఓసీ చీఫ్ జనరల్ మేనేజర్ ఉత్తియ భట్టాచార్య అక్టోబర్ 1న తెలిపారు.
  • హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు - మహ్మద్ ముస్తాక్ అహ్మద్ 
  • ఆసియా పారా క్రీడల్లో భారత పతాకధారిగా రియో పారాలింపిక్స్ చాంపియన్ తంగవేలు మరియప్పన్ వ్యవహరించనున్నాడు. ఇండోనేసియా రాజధాని జకార్తాలో అక్టోబర్ 6 నుంచి 13 వరకు ఈ పోటీలు జరుగనున్నాయి. ఈ కీడల్లో దాదాపు 300 మంది క్రీడాకారులతో కూడిన భారత బృందం పాల్గొననుంది.
  • మహిళల 24వ జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్ - మణిపూర్ , (బారాబతి స్టేడియం, కటక్, ఒడిశా.)



No comments:

Post a Comment