Monday, May 7, 2018

పోస్టల్‌ శాఖలో ఉద్యోగాలు 2018

భారత తపాలా శాఖ ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో 1126 గ్రామీణ డాక్‌ సేవక్‌ ఉద్యోగాల భర్తీకోసం గతంలో విడుదల చేసిన ప్రకటనను రద్దు చేసింది. మరిన్ని ఉద్యోగాలు జతచేసి మొత్తం 2286 జీడీఎస్‌ ఖాళీలకుగాను కొత్త ప్రకటనను జారీ చేసింది. గతంలో దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు అప్పటి రిజిస్ర్టేషన్‌ సంఖ్యతో ఆన్‌లైన్‌లో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
 
ఖాళీలు: జనరల్‌ అభ్యర్థులకు 1221, ఓబీసీలకు 536, ఎస్సీలకు 42, ఎస్టీలకు 187, దివ్యాంగులకు 100 ఖాళీలను కేటాయించారు.
 
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి. కనీసం 60 రోజుల బేసిక్‌ కంప్యూటర్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.
 
వయసు: ఏప్రిల్‌ 25 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
 
ఎంపిక: అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా
 
దరఖాస్తు ఫీజు: రూ.100
 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 24
 
వెబ్‌సైట్‌: appost.in/gdsonline/

No comments:

Post a Comment