www.ssconline.nic.in
కేంద్రప్రభుత్వ ఉద్యోగం చేయాలని చాలామంది కలలు కంటుంటారు. ఈ కొలువుల్లో రెండో అత్యుత్తమమైనవి... గ్రూప్-బీ, గ్రూప్ సీ పోస్టులు. వీటి భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ‘కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్’ పరీక్ష ప్రకటనను తాజాగా విడుదల చేసింది. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారు ఈ సీజీఎల్ పరీక్షకు పోటీపడవచ్చు. మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) లేని ఈ కలల పోస్టులను గెల్చుకోవటానికి ఏ ప్రణాళికను ఎలా అమలు చేయాలి?
గ్రూప్-బీ పోస్టుల్లో రెండు గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులుంటాయి (అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్). అలాగే సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, ఇంటెలిజన్స్ బ్యూరో, రైల్వే మినిస్టరీ, విదేశాంగ శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇన్‌కమ్ టాక్స్, పోస్టల్ డిపార్ట్‌మెంట్, రెవిన్యూ డిపార్ట్‌మెంట్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, కస్టమ్స్ డిపార్ట్‌మెంట్లలో గ్రూప్-బీ, గ్రూప్-సీ పోస్టులుంటాయి.
కేంద్రప్రభుత్వ శాఖల్లోని గ్రూప్-ఏ అధికారుల ఆధ్వర్యంలో వీరు పనిచేయాలి. ఫీల్డ్ జాబ్, డెస్క్ జాబ్‌లుంటాయి. ఫీల్డ్ ఉద్యోగంలో భాగంగా వివిధ కంపెనీలు, పరిశ్రమలు, కర్మాగారాలు సందర్శించి వారి నుంచి సమాచారం సేకరించడం, ప్రభుత్వ అనుమతుల, నిబంధనల ప్రకారం నడుపుతున్నారా లేదా పరిశీలించాలి. టాక్సులు సక్రమంగా చెల్లిస్తున్నారో లేదో లాంటివాటిపై శ్రద్ధ చూపాలి. వారు తీసుకున్న సమాచారం ఆధారంగా డెస్క్‌జాబ్ పోస్టుల విధులుంటాయి.
ఎంపిక ఎలా?
4 అంచెలుగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. మొదటి రెండు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మూడోది డిస్క్రిప్టివ్ పరీక్ష. నాలుగోది కంప్యూటర్ స్కిల్ టెస్ట్ (టైపింగ్). గతంలో నిర్వహిస్తుండే మౌఖిక పరీక్షను తొలగించి, ఆ స్థానంలో చివరి రెండు అంచెలను ప్రవేశపెట్టారు. ప్రతి పరీక్షలో కనీస అర్హత మార్కులు పొందినవారిని మాత్రమే తర్వాత జరగబోయే పరీక్షకు అర్హులుగా ప్రకటిస్తారు. ఆన్‌లైన్ రాతపరీక్షలో రుణాత్మక మార్కులు (1/4వ వంతు) ఉన్నాయి.
టైర్-1 పరీక్ష: దీనిలో 100 ప్రశ్నలను 60 నిమిషాలలో పూర్తి చేయాలి. నాలుగు విభాగాలుగా విభజించి ప్రతి విభాగం నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకూ 2 మార్కులు..
టైర్-2 పరీక్ష: దీనిలో కనీస అర్హత మార్కులు పొందిన అభ్యర్థులందరూ వారు దరఖాస్తు చేసిన పోస్టులకు అతీతంగా పేపర్-1, పేపర్-2 పరీక్షలు రాయాలి.
* పేపర్-1లో మేథమేటిక్స్, అరిథ్‌మెటిక్ అంశాల నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. 200 మార్కులకు జరిగే ఈ పరీక్షను 2 గంటల సమయంలో పూర్తిచేయాలి.
* పేపర్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజి ప్రశ్నలు 200 వస్తాయి. 200 మార్కులకు జరిగే ఈ పరీక్షకు కూడా 2 గంటల సమయం.
* జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసినవారు పేపర్-3 పరీక్ష రాయాలి. స్టాటిస్టిక్స్ విభాగం నుంచి 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. 2 గంటల సమయంలో పూర్తిచేయాలి.
* గ్రూప్-బీ గెజిటెడ్ పోస్టుకు దరఖాస్తు చేసినవారు పేపర్-4 పరీక్ష రాయాలి. ఎకనామిక్స్, ఫైనాన్స్ అంశాల నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. 200 మార్కులకు జరిగే పరీక్ష వ్యవధి 2 గంటలు.

టైర్-3 పరీక్ష: ఇంగ్లిష్ (లేదా) హిందీ మాధ్యమాల్లో ఏదైనా ఎంచుకుని పెన్, పేపర్ విధానంలో డిస్క్రిప్టివ్ పరీక్ష రాయాలి. ఎస్సే, ప్రెస్సీ, లెటర్, అప్లికేషన్ రైటింగ్ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. 100 మార్కులకు జరిగే పేపర్-3 పరీక్షను 60 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాలి.
టైర్-4 పరీక్ష: కంప్యూటర్ స్కిల్ టెస్ట్ (లేదా) కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్షలో అభ్యర్థుల టైపింగ్‌ను పరీక్షిస్తారు.
నాలుగు పరీక్షల్లో ప్రతి దానిలో అర్హత మార్కులు పొంది, అన్ని పరీక్షల్లో కలిపి వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేస్తారు.
నాలుగు పరీక్షల్లో ప్రతి దానిలో అర్హత మార్కులు పొంది, అన్ని పరీక్షల్లో కలిపి వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేస్తారు.
దేనిలో ఎన్ని మార్కులు?
టైర్-1, టైర్-2 పరీక్షల్లో పేపర్-3, పేపర్-4 మినహా మొత్తం 600 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఇందులో- జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 50 మార్కులు, జనరల్ ఎవేర్‌నెస్ నుంచి 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 250 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్‌ల నుంచి 250 మార్కులు.
కాబట్టి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌ల నుంచి అత్యధిక మార్కులు తెచ్చుకున్నవారికి అవకాశాలు ఎక్కువ!
జనరల్ ఇంటెలిజెన్స్: నంబర్లు, లెటర్లు, బొమ్మల మీద ప్రశ్నలు వస్తాయి. బొమ్మలమీద వచ్చే ప్రశ్నలలో ఒక చిన్న లాజిక్ ఆధారంగా ప్రశ్నకు సమాధానం సులువుగా రాబట్టవచ్చు. బొమ్మ పూర్తిచేసినప్పుడు దానిలో వృత్తం కానీ, చతురస్రం (లేదా) దీర్ఘచతురస్రం వంటి ఏదైనా ఒకటి కనపడే అవకాశాలు ఉంటాయి. వాటి ఆధారంగా సమాధానాలు గుర్తించవచ్చు.
నంబర్ సిరీస్, అనాలజీ, కోడింగ్-డీకోడింగ్ అంశాలలో ప్రశ్నలో ఉన్న నంబర్‌ను చూసే పద్ధతిని బట్టి సమాధానం గుర్తించవచ్చు. ఒక లాజిక్ ఆధారంగా సమాధానం రాకపోతే, సమయం వృథా చేయకుండా లాజిక్ మార్చి.. వేరేవిధంగా ప్రయత్నించాలి.అడ్రస్ మ్యాచింగ్ ప్రశ్నల్లో నంబర్ ‘0’కు లెటర్ ‘్న’కు తేడా గుర్తించాలి. హైలెవల్ రీజనింగ్‌తో సిల్లాజిజమ్స్ ప్రశ్నలు వెన్-డయాగ్రామ్ ఆధారంగా నేర్చుకోవాలి. ఇంగ్లిష్‌పై పట్టుంటే హైలెవెల్ రీజనింగ్ ప్రశ్నలు సులువుగా చేయవచ్చు.

జనరల్ ఎవేర్‌నెస్: నోటిఫికేషన్ సమయం దగ్గర నుంచి టైర్-1 పరీక్ష మధ్య ప్రతిరోజూ ఆంగ్ల దినపత్రిక చదవాలి. దానిలో కరంట్ అఫైర్స్ అంశాల్లోని ముఖ్యమైనవాటిపై నోట్స్ తయారుచేసుకోవాలి. ఆయా అంశాల నుంచి ఏ విధంగా ప్రశ్న అడగటానికి అవకాశం ఉంటుందో ఆలోచిస్తూ సొంతంగా ప్రశ్నలు తయారుచేసుకోవడం అలవాటు చేసుకోవాలి. 8, 9, 10 తరగతుల పాఠ్యాంశాల్లోని జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ అంశాలు చదువుకోవాలి. నోట్స్ రాసుకోవాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: అభ్యర్థులు మొదటిగా షార్ట్‌కట్ విధానంలో గుణకారం, భాగహారం, కూడిక, తీసివేతలు చేయడం నేర్చుకోవాలి. సాంప్రదాయిక పద్ధతి నుంచి బయటకు వచ్చి, పెన్ ఉపయోగించకుండా సింప్లిఫికేషన్ చేయటం అలవాటు చేసుకోవాలి. అభ్యర్థుల దృష్టి సమాధానం మీద కాకుండా ఏ విధానంలో చేస్తే తక్కువ సమయం పడుతుందో తెలుసుకోవడంపై ఉండాలి. చాప్టర్ వేరైనప్పటికీ లాజిక్ ఒకటే ఉంటుంది. అలా చాప్టర్ల మధ్య పోలికలు, తేడాలు గుర్తిస్తూ సిద్ధమవ్వాలి.
అరిథ్‌మెటిక్ ప్రశ్నలను రోజువారీ దినచర్యలో భాగంగా ఉండే అంశాలతో ముడిపెడుతూ ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఫార్ములాల అవసరం లేకుండా సమాధానాలు గుర్తించవచ్చు. అన్ని అంశాలకు సంబంధించిన ఫార్ములాల పట్టిక తయారు చేసుకోవాలి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్: గ్రామర్ కోసం రేమండ్ మర్ఫీ రచించిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పుస్తకాలు ఉపయోగపడతాయి. పదాలకు అర్థాలు తెలుసుకోవాలి. రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలంటే ప్రశ్నల్లో ఇచ్చిన పూర్తి సమాచారం తక్కువ సమయంలో చదివి అర్థం చేసుకోవాలి. అంటే చదివే నైపుణ్యం పెంపొందించుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
* గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారు సీజీఎల్ పరీక్షకు అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 1.8.2018నాటికి వారు సర్టిఫికెట్లు పొందగలిగివుండాలి.
* జూనియర్ స్టాటిస్టికల్ అధికారి పోస్టులకు దరఖాస్తు చేయాలంటే 10+2లో మేథమేటిక్స్‌లో 60 శాతం మార్కులు పొందివుండాలి. లేదా గ్రాడ్యుయేషన్లో స్టాటిస్టిక్స్‌ను ఒక సబ్జెక్టుగా చదివివుండాలి.
దరఖాస్తులను www.ssconline.nic.in వెబ్‌సైట్లో పూర్తిచేసి, వంద రూపాయిల పరీక్ష ఫీజు చెల్లించాలి. (ఎస్‌సీ, ఎస్‌టీ కేటగిరీ, మహిళా అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు).
దరఖాస్తులకు ఆఖరితేదీ: 4.6.2018
టైర్-1 ఆన్‌లైన్ రాతపరీక్ష: 25.7.2018 నుంచి 20.8.2018 వరకూ.

ఈ జాగ్రత్తలు అవసరం
* 200కి 200 ప్రశ్నలను (లేదా) 100కి 100 ప్రశ్నలను సమాధానాలు గుర్తించలేం. అందుకే ఏ ప్రశ్నలను ముందు వరుసలో సమాధానాలు గుర్తించగలమో వాటినే ఎంచుకోవాలి.
* ప్రశ్నకి సమాధానం గుర్తించలేకపోయినా, వచ్చిన ఆన్సర్ ఆప్షన్లలో లేకపోయినా, ప్రశ్న చదివినప్పుడు అర్థం కాకపోయినా, ఆయా ప్రశ్నలను విడిచి వేరే ప్రశ్నను ఎంచుకోవాలి.
* ఒకే ప్రశ్నకు ఎక్కువ సమయం వృథా చేయకూడదు.
* అభ్యర్థికి పట్టున్న అంశాల సంబంధిత ప్రశ్నలను ముందు ఎంచుకోవాలి.
* ఏ అంశాల్లో మార్కులు రావడం లేదో గమనించి, ఆ చాప్టర్లలోని ప్రశ్నలు ఎక్కువ సాధన చేయటం మేలు.
* అంశాల వారీగా షార్ట్‌కట్స్, ఫార్ములాల్లో ముఖ్యమైనవాటిపై పాయింట్ల రూపంలో నోట్స్ రాసుకోవాలి.
* ప్రతిరోజూ ఒక మాదిరి ప్రశ్నపత్రం చేయడం అలవాటు చేసుకోవాలి.
* తప్పులు పోయిన ప్రశ్నలపై ప్రత్యేక శ్రద్ధ చూపి, మరలా ఆ తప్పులు చేయకుండా ఉండాలి.
* పరీక్షలో వస్తున్న మార్కులను అంశాల వారీగా విభజించి పట్టిక రూపంలో రాసుకుంటూ, పురోగతి చూసుకోవాలి.
* అభ్యర్థులు తాము బలహీనంగా ఉన్న అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు సాధన చేస్తూ మెరుగుపర్చుకోవాలి.

No comments:
Post a Comment