Sunday, June 5, 2016

Inspired and Proud : మాది రాయలసీమ,...

మాది రాయలసీమ,...
రాగిసంగటి మాది.. రాళ్ల సేద్యం మాది..
సజ్జ.. జొన్న.. కొర్ర.... ఏదైన సంగటని..
ఎరిగినోడికే తెలుసు.. యెర్రోడికేం తెలుసు..
తాత తండ్రుల నుంచి తరతరాల నుంచి..
సీమకే ఎరుక మరి.. సిటీయోడికి ఏమెరుక..
ఆవు.. గేదెలేవైన మనుషులే మా ఇంట..
వేరులేదు మూగజీవాలకూ మాకు..
పశుభాషతో మేమూ పలకరించుతాము..
పాడియావునైన.. సేద్యపు ఎద్దునైనా..
మీసాలు మెలిదిప్పె రోషమే ఆభరణం..
పసిడి ఉంగరపేలైన... పేడనెత్తుట మా నైజం..
రాయలేలాడో లేదో ఎరుక లేదు కాని..
రాజసం మా నడక.. రామచంద్రుడి లెక్క..
కాపోడు కాడెత్తు.. కూలోడు పనిబట్టు..
కలిసి తినడం తప్ప... కులము పట్టింపులేదు..
వావి వరసల మసులు ధనికుడైన పేద దళితుడైనా..
అయ్య.. మామ.. అనుచు.. అత్త.. పెద్దమ్మనుచూ..
నోరార పిలుచుకొనే పల్లె గడపలు మావి..
అన్నమని అడిగితే లేదనదు మా గడప..
గొడ్డు కారమైన ముద్దపైనేసి...
కడుపు నింపుట తెలుసు కల్మషము లేకుండ.
ఇది మా రాయలసీమ... రతనాల కరువుసీమ.
మా రాయలసీమ

No comments:

Post a Comment