Wednesday, November 7, 2018

ఖాకీ కొలువు కావాలా? , ఏపీలో 3137 ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులు AP POLICE RECRUITMENT

ఖాకీ కొలువు కావాలా?

* ఏపీలో 3137 ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులు
పోలీసు కొలువులంటే యువతకు క్రేజ్‌! నేరాలను నియంత్రించి ‘హీరో’ మాదిరి పౌరులకు రక్షణ కల్పించే పోలీస్‌ శాఖలో పనిచేయాలని ఎందరో అభిలషిస్తుంటారు. ఈ శాఖలో 334 కీలకమైన సివిల్‌ ఎస్‌ఐ, ఆర్‌ ఎస్‌ఐ, డిప్యూటీ జైలర్‌, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టుల నియామకాలకు ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖ ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ అర్హతతో వీటికి పోటీపడవచ్చు. మరోపక్క 2803 కానిస్టేబుళ్ల పోస్టులకు నవంబరు 12న వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదలవుతోంది. మొత్తం 3,137 పోస్టుల భర్తీ జరగబోతోంది. రాతపరీక్షల్లో, దేహదార్ధ్య పరీక్షల్లో సత్తా చూపితే పోలీసు కొలువులను చేజిక్కించుకున్నట్టే!
సంఘ విద్రోహ చర్యలను కట్టడి చేయటంతోపాటు ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండటానికి ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌’ నినాదంతో ముందుకు వెళ్తోంది పోలీసు శాఖ. తాజా నోటిఫికేషన్‌ ద్వారా సివిల్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌, జైలర్‌, ఫైర్‌ డిపార్ట్‌మెంట్లలోని పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎస్‌ఐ ఉద్యోగులకు సుమారు రూ.45,000 - రూ.50,000 నెల జీతం వస్తుంది. ఉన్నతస్థాయి శాఖలోని పోస్టులు కాబట్టి, సంఘంలో మంచి పేరు కూడా లభిస్తుంది. బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయఃపరిమితి మినహాయింపు ఉంది. ప్రిలిమినరీ రాతపరీక్షలో రెండు పేపర్లుంటాయి. ప్రతి పేపర్‌కూ 3 గంటల సమయం ఉంటుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఇంగ్లిష్‌, ఖాకీ కొలువు కావాలా?తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంటాయి. ఓఎంఆర్‌ షీట్‌పై సమాధానాలను బ్లూ లేదా బ్లాక్‌ పెన్‌తో మార్క్‌ చేయాలి. ప్రిలిమినరీ రాతపరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి, నెగ్గినవారికి మెయిన్స్‌ నిర్వహిస్తారు. మెయిన్స్‌లో పేపర్‌-3, పేపర్‌-4ల్లో వచ్చే మార్కుల్లో మెరిట్‌ ఆధారంగా పోస్టులు భర్తీ చేస్తారు.
ఎస్‌ఐ ఎంపిక ప్రక్రియ 
1. ప్రిలిమినరీ రాత పరీక్ష
2. దేహదారుఢ్య పరీక్ష
3. ఫైనల్‌ రాత పరీక్షలుగా ఉంటుంది.
ఫైనల్‌ రాతపరీక్షలో 
పేపర్‌ 1: ఇంగ్లిష్‌ (క్వాలిఫయింగ్‌);
పేపర్‌ 2: తెలుగు (క్వాలిఫయింగ్‌);
పేపర్‌ 3: రీజనింగ్‌, అరిథ్‌మెటిక్‌;
పేపర్‌ 4: జనరల్‌ స్టడీస్‌.
ఇంటర్మీడియట్‌ అర్హత ఉన్నవారు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు పోటీపడవచ్చు. ఎంపికైతే వీరికి రూ.25,000 - 30,000 నెల జీతం వస్తుంది. ఈ పోస్టులకు ఎస్‌ఐ ప్రిపరేషన్‌ అంశాల నుంచే ప్రశ్నలు వస్తాయి. సబ్జెక్టులూ, చాప్టర్లూ మారవు. ఎస్‌ఐ పరీక్షలో ప్రశ్నల స్థాయి కొంచెం కఠినంగా ఉంటుంది. కానిస్టేబుల్‌ పరీక్షలో ప్రశ్నలు పదోతరగతి స్థాయిలో ఉంటాయి. అర్హతలున్నవారు ఒకే ప్రిపరేషన్‌తో రెండు పరీక్షలకూ పోటీపడవచ్చు!
ఆ మూడూ ముఖ్యం
ఎస్‌ఐ నియామక ప్రక్రియలో... ప్రిలిమినరీ, మెయిన్స్‌ల్లో ఉమ్మడిగా ఉండే రీజనింగ్‌, అరిథ్‌మెటిక్‌, జనరల్‌ స్టడీస్‌లపై అభ్యర్థులు ఎక్కువ శ్రద్ధ చూపాలి. ఈ విభాగాల నుంచే మెయిన్స్‌ రాతపరీక్షలో పేపర్‌-3, పేపర్‌-4 ప్రశ్నలుంటాయి. పైగా ఈ పేపర్లలో వచ్చే మార్కులను మాత్రమే తుది మెరిట్‌ మార్కుల్లో పరిగణిస్తారు.
అరిథ్‌మెటిక్‌ విభాగంలో వ్యాపార గణిత అంశాలను మాత్రమే నోటిఫికేషన్‌లో చేర్చినప్పటికీ, గతంలో జరిగిన (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌) పరీక్షల దృష్ట§్య మ్యాథమేటిక్స్‌ అంశాలకు కూడా సిద్ధ్దమవడం మంచిది.
ఇంగ్లిష్‌: వృత్తిరీత్యా పైఅధికారులకు సమాచారాన్ని చేరవేసే క్రమంలో మెయిల్స్‌, లెటర్లు (లేదా) వివిధ అప్లికేషన్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి అభ్యర్థి ఇంగ్లిష్‌ పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నలు వస్తాయి. గ్రామర్‌, సెంటెన్స్‌ అరేంజ్‌మెంట్‌, ఆర్టికల్స్‌, ప్రిపొజిషన్స్‌, హెల్పింగ్‌ వెర్బ్స్‌, ఇంగ్లిష్‌ నుంచి తెలుగుకు; తెలుగు నుంచి ఇంగ్లిష్‌కు మార్చడం, ఒకాబులరీ వంటి వాటిపై ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్‌ వార్తలు విని, వాటిని అర్థం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.
తెలుగు: పేపరు - 2లోని ప్రశ్నలు తెలుగు భాషకు సంబంధించినవి. ఎఫ్‌ఐఆర్‌, ఫిర్యాదు రాయడం, పంచనామా, పై అధికారులకు వివిధ కేసులకు సంబంధించిన నివేదికలను అందించడం పోలీసు వృత్తిలో భాగం కాబట్టి తెలుగు భాషపై అభ్యర్థుల కనీస అవగాహన పరీక్షించేలా ప్రశ్నలుంటాయి.
ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉండే ప్రశ్నలు సంధులు, సమాసాలు, ప్రతిపదార్థాలు, తాత్పర్యాలు, ఖాళీలు పూరించడం, తప్పు పదాలను గుర్తించి, సరిచేయడం వంటివి వస్తాయి.
ఇంగ్లిషు (పేపరు - 1), తెలుగు (పేపరు - 2) పరీక్షల్లో డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలు కూడా వస్తాయి. ఈ రెండు విభాగాల్లో క్వాలిఫై మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఈ మార్కులను తుది మెరిట్‌ మార్కుల్లో పరిగణించరు. క్వాలిఫయింగ్‌ మార్కులు: ఓసీ వారికి: 40%, ఓబీసీవారికి: 35%, ఎస్‌సీ, ఎస్‌టీ వారికి: 30% మార్కులు రావాలి.
అరిథ్‌మెటిక్‌: వ్యాపార గణిత అంశాలైన శాతాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, చక్రవడ్డీ, బారువడ్డీ, కాలం- పని, కాలం- దూరం, వ్యాపార భాగస్వామ్యం, వైశాల్యాలు, చుట్టుకొలత, ఘనపరిమాణం, క.సా.గు., గ.సా.భా. వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.ఈ అంశాలను గ్రూపులుగా విభజించి సన్నద్ధమైతే సులభంగా నేర్చుకోవచ్చు. డేటా అనాలిసిస్‌, డేటా సఫిషియన్సీ నుంచి 5 ప్రశ్నలు ఒకే పట్టిక లేదా వెన్‌చిత్రాలు, బార్‌చార్ట్‌, గ్రాఫ్‌ల మీద వస్తాయి. ఇచ్చిన, అందుబాటులో ఉన్న సమాచారం నుంచి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. సింప్లిఫికేషన్‌ తక్కువ సమయంలో పూర్తిచేసేలా షార్ట్‌కట్స్‌, మైండ్‌ కాల్‌క్యులేషన్‌ వాడాలి. మేథమేటిక్స్‌ అంశాల్లో మాత్రికలు, త్రికోణమితి, ఎత్తులు- దూరాలు, సర్డ్స్‌, ఇండిసెస్‌, ఆల్జీబ్రా అంశాలను చదవాలి. గత రెండేళ్లలో ఎక్కువ ప్రశ్నలు ఇవ్వనప్పటికీ అంతకుముందు జరిగిన పరీక్షల్లో 50 ప్రశ్నల వరకు ఈ అంశాల నుంచి ప్రశ్నలు వచ్చాయి.
రీజనింగ్‌: పోలీసుశాఖ ఉద్యోగులు విధి నిర్వహణలో కేసులను విచారించే సమయంలో లాజికల్‌గా ఆలోచించాల్సి ఉంటుంది. నంబర్లు, లెటర్ల ఆధారంగా వచ్చే ప్రశ్నలను లాజికల్‌ రీజనింగ్‌గా పరిగణిస్తారు. సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, రక్తసంబంధాలు, దిక్కులు, పజిల్స్‌ వంటి అంశాలను అనలిటికల్‌ రీజనింగ్‌ అంశాలుగా పరిగణిస్తారు.బొమ్మల ఆధారంగా ప్రశ్నలు ఇస్తే నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌. సిరీస్‌ ప్రశ్నల్లో బొమ్మల మధ్య ఉండే సంబంధాన్ని బట్టి అదే తర్కం వాడుతూ సమాధానం గుర్తించాలి. సిలాజిజమ్‌, అసంప్షన్స్‌, ఇన్ఫరెన్సెస్‌, కోర్సెస్‌ ఆఫ్‌ యాక్షన్‌, ఆర్గ్యుమెంట్స్‌, కన్‌క్లూజన్స్‌, కాజ్‌-ఎఫెక్ట్‌, అసర్షన్‌-రీజన్‌, డెసిషన్‌ మేకింగ్‌ వంటివి హైలెవల్‌ రీజనింగ్‌ అంశాల కిందకి వస్తాయి.
జనరల్‌ స్టడీస్‌ సంగతేమిటి?
దీనిలో సోషల్‌, సైన్స్‌లతోపాటు కరెంట్‌ అఫైర్స్‌ సంబంధిత ప్రశ్నలు కూడా వస్తాయి. ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షల్లో జనరల్‌ స్టడీస్‌ ఒక పేపర్‌గా ఉంటుంది. సివిల్‌ ఎస్సై, డిప్యూటీ జైలర్‌ (పురుషులు/ మహిళలు), స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టులకు 200 మార్కులు; ఏఆర్‌/ఏపీఎస్పీ ఎస్సై పోస్టులకు 100 మార్కులు జనరల్‌ స్టడీస్‌ విభాగం నుంచి వస్తాయి. ఈ విభాగంలో ఎక్కువ సమాచారం చదివి, గుర్తుంచుకోవాలి. కాబట్టి వేటిపై శ్రద్ధ చూపాలి, చేసే తప్పులు ఏమిటనేవి గుర్తించాలి; సరిచేసుకోవాలి.
జాగ్రఫీ: 
1) శీతోష్ణస్థితి
2) నదీ వ్యవస్థ
3) భౌగోళిక స్వరూపం
4) ఖనిజాలు, పరిశ్రమలు
5) విపత్తు నిర్వహణ
6) పర్యావరణ అధ్యయనంలపై శ్రద్ధ చూపాలి. ‌
* నదీ వ్యవస్థలో. నది మీద ఏ ప్రాజెక్టులు, ఆనకట్టలు ఉన్నాయి, అవి ఏ రాష్ట్రాల నుంచి వెళ్తున్నాయి అనే అంశాలపైనా శ్రద్ధ చూపాలి. ‌
* జనాభా సంబంధిత అంశాల్లో గణాంకాలపైనే కాకుండా అక్షరాస్యత, తలసరి ఆదాయం వంటివీ ముఖ్యం. ‌
* విపత్తు నిర్వహణ అంశాలపై విపత్తులు ఎక్కడ, ఎప్పుడు వచ్చాయనే విషయాలపై కాకుండా అవి రావడానికి గల కారణాలపై దృష్టిపెట్టాలి.
చరిత్ర: ఆధునిక భారతదేశ అంశాలపై శ్రద్ధ చూపాలి. బ్రిటిష్‌ వారు భారతదేశానికి రావటానికి, ఆక్రమించుకోవటానికి ఆనాడు ఏర్పడిన పరిస్థితులు, కారణాలను గుర్తించాలి. విద్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో బ్రిటిష్‌ వారి విధానాలు, వాటి ఫలితాలు తెలుసుకోవాలి. స్వాతంత్య్ర సమర నినాదాలు, ఆనాటి పత్రికల వివరాలు, మహాత్మాగాంధీ ఉద్యమాలు అధ్యయనం చేయాలి.
పాలిటీ: దీనిలో అంశాలను కరెంట్‌ అఫైర్స్‌కు అనుసంధిస్తూ సమాచారం సేకరించాలి. రాజ్యాంగం చదివేటప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయాలకు ప్రామాణికంగా సమాధానాలు గుర్తించాలి. బీ భారత రాజ్యాంగ వనరులు, రాజ్యాంగ నిర్మాణం బీ షెడ్యూళ్లు, భాగాలు, సవరణలు బీ సుప్రీంకోర్టు కేసులు (అతి ముఖ్యమైనవి) బీ పార్లమెంటు బీ జ్యుడీషరీ మొదలైనవాటిపై దృష్టిపెట్టాలి.
ఎకానమీ: స్థిర సమాచారంపైకంటే ప్రస్తుత ఎకానమీకి సంబంధించి ప్రశ్నలు వస్తాయి.కేంద్ర, ఏపీ బడ్జెట్‌, ఏపీ సామాజికార్థిక సర్వే, పంచవర్ష ప్రణాళికలు, జాతీయ ఆదాయం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అంశాలను చదవాలి.
సైన్స్‌: ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యముంది. అంతరిక్ష ప్రయోగాలు, డిఫెన్స్‌ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, నానో మెడిసిన్‌, టెలి మెడిసిన్‌, సైబర్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ టెక్నాలజీ అంశాలకు ప్రాధాన్యమివ్వాలి. బయాలజీలో విటమిన్లు ఉండే ఆహార పదార్థాలు, విటమిన్ల లోపం వల్ల కలిగే వ్యాధులు వంటి వాటిపై దృష్టిపెట్టాలి. గాలి, నీటి ద్వారా వ్యాపించే, వైరస్‌, బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు చదవాలి. కెమిస్ట్రీలో మూలకాలు, వాటి అధ్యయనం, మీథేన్‌, ఇథేన్‌, ఇథలీన్‌, హైడ్రోజన్‌, హీలియం, కార్బన్‌డైఆక్సైడ్‌, వాటి అప్లికేషన్లు చదవాలి. ఫిజిక్స్‌లో ఎలక్ట్రిసిటీ, లైట్‌ఎనర్జీ, సౌండ్‌ ఎనర్జీ, మెగ్నీషియమ్‌, న్యూక్లియర్‌ ఎనర్జీ, సోలార్‌ ఎనర్జీ విషయాలు అధ్యయనం చేయాలి.
కరెంట్‌ అఫైర్స్‌ నుంచి వార్తల్లో వ్యక్తులు, ముఖ్యమైన తేదీలు, జాతీయ, అంతర్జాతీయ అంశాలు, క్రీడల అవార్డులు, యునెస్కో గుర్తించిన ప్రదేశాలు, అపాయింట్‌మెంట్స్‌, రాష్ట్రాలు - రాజధానులు, దేశాలు - రాజధానులు, కరెన్సీ సంబంధిత అంశాలు చదవాలి.
సబ్‌ ఇన్‌స్పెక్టర్‌
దరఖాస్తు పూర్తి చేయడానికి చివరి తేది: 05-11-2018 నుంచి 24-11-2018 వరకు
వయఃపరిమితులు: సివిల్‌/ఏఆర్‌/ఏపీఎస్పీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, మహిళా డిప్యూటీ జైలర్‌ పోస్టులకు 21 - 25 సంవత్సరాలు; పురుషులు (డిప్యూటీ జైలర్‌) 21 - 30 సంవత్సరాలు; ఫైర్‌స్టేషన్‌ ఆఫీసర్‌ 18 - 30 సంవత్సరాలు
విద్యార్హతలు: గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసివుండాలి. సివిల్‌/ఏఆర్‌/ఏపీఎస్పీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు, ఫైర్‌స్టేషన్‌ ఆఫీసర్‌ పోస్టుకు అప్లై చేసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇంటర్మీడియట్‌ పూర్తిచేసి ఉండాలి.
ప్రిలిమినరీ రాత పరీక్ష: 16-12-2018 ఉదయం- పేపర్‌ 1, మధ్యాహ్నం- పేపర్‌ -2
పరీక్ష ఫీజు: ఓసీ/ఓబీసీ: రూ.600, ఎస్సీ/ఎస్టీ: రూ.300
వెబ్‌సైట్‌: http://slprb.ap.gov.in

No comments:

Post a Comment