కరెంటు అఫైర్స్ - అక్టోబర్ 2018- జాతీయం,అంతర్జాతీయం
అక్టోబర్ 2018- జాతీయం,అంతర్జాతీయం
- భర్తకు
మహిళ వ్యక్తిగత ఆస్తి కాదని పేర్కొంటూ
వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ సెక్షన్ 497ను
కొట్టేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్,
జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్
డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రా సభ్యులుగా
గల ధర్మాసనం సెప్టెంబర్ 27న తీర్పు వెలువరించింది.
- అన్ని
వయసుల స్త్రీలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
- టైమ్స్ హయ్యర్
వరల్డ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ర్యాకింగ్‌స-2019లో భువనేశ్వర్‌లోని కళింగ ఇనిస్టిట్యూట్
ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ(కేఐఐటీ)కి తొలిసారి చోటు లభించింది.
- ‘పరాక్రమ్
పర్వ్-2018’ ఎగ్జిబిషన్ను రాజస్థాన్లోని
జోధ్పూర్లో ప్రధానమంత్రి
నరేంద్రమోదీ సెప్టెంబర్ 28న ప్రారంభించారు. నియంత్రణ
రేఖ (ఎల్ఓసీ) ఆవల
భారత సైన్యం నిర్వహించిన మెరుపుదాడుల (సర్జికల్ స్ట్రైక్స్) రెండో వార్షికోత్సవం సందర్భంగా
ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నారు
- ‘అకడమిక్ లీడర్షిప్ ఆన్ ఎడ్యుకేషన్ ఫర్ రీసర్జెన్స్’ పేరుతో కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ(హెచ్ఆర్డీ) న్యూఢిల్లీలో సెప్టెంబర్ 29న నిర్వహించిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
- ఐక్యరాజ్య
సమితి సాధారణ అసెంబ్లీ సర్వసభ్య సమావేశంలో భారత విదేశాంగ మంత్రి
సుష్మా స్వరాజ్ సెప్టెంబర్ 29న ప్రసంగించారు.
- ఇన్‌ప్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెసె
(ఐఎల్ అండ్ ఎఫ్ఎస్)ను కేంద్ర ప్రభుత్వం
తన ఆదీనంలోకి తీసుకుంది. ఈ మేరకు నేషనల్
కంపెనీ లా ట్రిబ్యునల్లో
(ఎన్సీఎల్టీ) నుంచి
అక్టోబర్ 1న అనుమతించింది.
- ప్రపంచవ్యాప్తంగా
ఉన్నటువంటి 250 ఉత్తమ కంపెనీలతో ఫోర్బ్స్
2018 ఏడాదికి రూపొందించిన జాబితాలో 12 భారత కంపెనీలు చోటు
సంపాందించుకున్నాయి. ఈ జాబితాలో ఐటీ
సేవల సంస్థ ఇన్ఫోసిస్ 31 వ
స్థానంలో నిలవగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
35 వ స్థానం పొందింది.
- మొదటి
స్థానంలో అమెరికాకు చెందిన వాల్ట్ డిస్నీ నిలిచింది. ఈ జాబితాలో 61 కంపెనీలతో
అమెరికా మొదటి స్థానంలో ఉండగా
తర్వాతి స్థానాల్లో 32 కంపెనీలతో జపాన్, 19 కంపెనీలతో చైనా, ఫ్రాన్స్ (13), జర్మనీ
(11) ఉన్నాయి.
- అంతర్జాతీయ సౌర కూటమి సభ్యుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. న్యూఢిల్లీలో అక్టోబర్ 2న నిర్వహించిన ఈ సమావేశానికి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్‌తో సహా పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.
- అమెరికాలోని న్యూయార్క్‌లో సార్క్ విదేశాంగ మంత్రుల సదస్సు-2018 ను సెప్టెంబర్ 28న నిర్వహించారు. ఈ సదస్సులో భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment