Monday, October 8, 2018

Telangana Elections Overview - ఎవరి బలం ఎంత ???

2014 లో తెలంగాణ సెంటిమెంట్ రాజకీయం చేసి గెలిచిన కెసిఆర్ కు ప్రస్తుత ఎలక్షన్స్ నిజమైన సవాల్ విసురుతున్నాయ్ అని చెప్పవచ్చు .
తెరాస: 
బలాలు :
1. కెసిఆర్
2. తెలంగాణ సెంటిమెంట్
3. రైతుబంధు లాంటి సంక్షేమ పథకాలు
4. కేంద్ర ప్రభుత్వ సహకారం
5. మెజార్టీ ఎలక్ట్రానిక్ మీడియా తన కంట్రోల్ లో ఉండడం .
6. ఉత్తర తెలంగాణ
7. ప్రతిపక్షము నుండి సీఎం అభ్యర్థి లేకపోవడం .

బలహీనతలు:
1. పార్టీ అభ్యర్థుల మితిమీరిన అవినీతి ,ప్రజల్లో  వ్యతికేరకత .
2. రైతుబంధు ఫలాలు కౌలు రైతులకి అందకపోవడం .
3. తనకి ఇచ్చిన పదవిలో  పూర్తికాలం ఉండకుండా ముందస్తుకు వెళ్ళడంతో
4. తెలంగాణ ఉద్యమకారులకి న్యాయం చేయకపోవడం .
5. బీజేపీతో కలుస్తారు అనే వార్తలు రావడం .
6. నాలుగు సంవత్సరాలు చేసిన అభివృద్ధి గురించి చెప్పడం మానేసి ప్రత్యర్థులను బూతులు తిట్టడం.
7. ktr హరీష్ మధ్య ఉన్న కోల్డ్ వార్ .
8. ఓయు,నిరుద్యోగులు మరియు ప్రజాస్వామివాదులు కెసిఆర్ నియంతృవం మీద  ఉన్న వ్యతికేకత
9. ముఖ్యమైన డబుల్ bedroom ఇల్లులు దళితులకు మూడు ఎకరాల భూమి లాంటి హామీలు నెరవేరక పోవడం


మహాకూటమి(కాంగ్రెస్+టీడీపీ+సిపిఐ+టీజెస్+....)
బలాలు :
1. కాంగ్రెస్ టీడీపీ ల బలమైన క్యాడర్
2. కోదండరాం కూటమిలో చేరడం.
3. తటస్థ ఉద్యమ నాయకుల సపోర్ట్ .
4.నిరుద్యోగులు + ఓయూ స్టూడెంట్స్  సపోర్ట్.
5. కెసిఆర్ సెక్రెటేరియేట్ కి వెళ్లకుండా farmhouse పాలిటిక్స్ మీద జనాల్లో ఉన్న వ్యతికేరకత .
6.పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు  మోడీ మీద ఉన్న కోపంతో కూటమికి అన్ని విధాలా దన్నుగా నిలవడం .
7. దక్షిణ తెలంగాణ ( హైదరాబాద్,రంగారెడ్డి,మహబూబ్నగర్,ఖమ్మం,నల్గొండ ) లో ఉన్న సెటిలర్స్ + కాంగ్రెస్ లో బలమైన నాయకులు .
8. సిసిల మీడియా + స్టార్ campaigners
9. జాతీయ స్థాయిలో మోడీ మీద ఉన్న వ్యతిరేకత
బలహీనతలు:
1. కాంగ్రెస్ టీడీపీ క్యాడర్ మధ్య ఉన్న సుదీర్ఘ శత్రుత్వం , నాయకులు కలిసి పని చేసినట్టు supporters కలుస్తారా అన్న అనుమానం
2. కూటమిలో సీట్ల పంపకం
3. ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించక పోవడం
4. పూర్తిస్థాయి మీడియా సపోర్ట్ లేకపోవడం
5. కాంగ్రెస్ నేతల మీద ఉన్న కేసులు ( ఒకవేళ సానుభూతి కూడా రావచ్చు అప్పుడు అది కూడా బలం అవుతుంది)
6. BLF కూటమి విడిగా పోటీ చేయడం వల్ల  ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీలిపోవడం .

BLF
బలాలు
1. ప్రజాసంఘాల నాయకులూ Tmas లాంటి ngo లు సపోర్ట్ చేయడం .
2. కూటమి నుండి బీసీలకు సsc  st లకు యువకులకు సీట్స్ ఇవ్వడం .
బలహీనతలు :
1మహాకూటమిలో చేరకపోవడం
2. కూటమి ఒకాటికూడా పెద్ద పార్టీ లేకపోవడం

బీజేపీ :
బలాలు
1. హిందుత్వవాదం
2. కొన్ని స్థానాల్లో బలమైనభ్యర్థులు క్యాడర్ ఉండడం
బలహీనతలు
1కెసిఆర్ మోడీ కి ఉన్న సన్నిహిత సంబంధాలు
2. కెసిఆర్ ను పూర్తిస్థాయిలో విమర్శించకపోవడం
3. జాతీయ నాయకుల మోడీ అమిత్ షా తెలంగాణ ఎన్నికలను seroius గా తీసుకోకపోవడం


మొత్తంగా చూస్తే తెరాస మహాకూటమి మధ్య మాత్రమే పోటీ ఉండబోతుంది . కెసిఆర్ రాజీనామా చేసిన తరువాత  పరిస్థితులు కొంచెం మహాకూటమికి అనుకూలంగా మారడం . ఇప్పుడు blf bjp చీల్చే ఓట్లను బట్టే కెసిఆర్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయ్ .  మొత్తానికి తెలంగాణ ఎలక్షన్స్ ఏకపక్షం అయ్యే ఛాన్స్ లేదు . కెసిఆర్ మహాకూటమి రెండు చాల కష్టపడాల్సిన పరిస్థితులు ఉన్నాయ్ . చూద్దాం ఏది మనుసులో దాచుకొని తెలంగాణ ప్రజలు ఎటువంటి తీర్పుని ఇస్తారో చూడాలి.





No comments:

Post a Comment