ఖాళీలు 700
జిల్లాల వారీగా ఖాళీలు
జిల్లా ఖాళీలు
నల్లగొండ 83
హైదరాబాద్ 7
రంగారెడ్డి 90
ఖమ్మం 19
వరంగల్ 49
నిజామాబాద్ 50
ఆదిలాబాద్ 107
కరీంనగర్ 90
మెదక్ 50
మహబూబ్‌నగర్ 155
అర్హత: ఇంటర్మీడియెట్ / తత్సమానం
వయసు: 18 - 44 ఏళ్లు (జూలై 1, 2018 నాటికి).
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. రాత పరీక్షను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ (ఓఎంఆర్) విధానంలో నిర్వహిస్తారు.
వీఆర్వో పోస్టులు అధిక సంఖ్యలో ఉన్నాయి. దీంతో పోటీ కూడా తీవ్రంగానే ఉండొచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వీఆర్వో పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు దాదాపుగా 12 లక్షల మందికిపైగా హాజరయ్యారు. ఈ సారి కూడా ఆరు-పది లక్షల మందికి వీఆర్వో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి పోటీని దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ సాగించాలి. అర్హత ఇంటర్మీడియెట్‌గా పేర్కొన్నప్పటికీ ప్రశ్నల క్లిష్టత అంత కంటే ఎక్కువ ఉండొచ్చనే అంచనాతో ప్రిపేర్ కావాలి. అప్పుడే అంతటి పోటీలో విజయం సాధ్యమవుతుంది.
జనరల్ స్టడీస్‌లో వీఆర్వో పోస్టులకు అదనంగా ఉన్న అంశం నైతిక విలువలు, మహిళలు, బలహీన వర్గాల సమస్యలు. వీఆర్వో ఎంపికయిన వారు గ్రామీణ ప్రాంతాల్లో వివిధ పథకాల అమల్లో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని చేర్చారు. ఈ నేపథ్యంలో వీఆర్వో అభ్యర్థులు బలహీన వర్గాల సమస్యలు, వారితో గౌరవంగా, వ్యవహరించే ధోరణులు, వారి కోసం అమలు చేస్తున్న పథకాలు వంటి అంశాలపై అవగాహనతో ఉండాలి. అంతేకాకుండా గ్రామీణాభివృద్ధి గురించి కూడా ప్రశ్నలు రావచ్చు. కాబట్టి ఈ అంశంపై కూడా దృష్టి సారించడం మంచిది.
రాత పరీక్ష విధానం
రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో 150 మార్కులకు ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో జనరల్ నాలెడ్జ్ నుంచి 75 ప్రశ్నలు, సెక్రటేరియల్ ఎబిలిటీస్ నుంచి 75 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం కేటాయించిన మార్కులు 150. ప్రశ్నపత్రం ఇంగ్లీష్, తెలుగు మాధ్యమంలో ఉంటుంది. సమాధానాలను గుర్తించడానికి ప్రతి 150 నిమిషాల (రెండున్నర గంటలు) సమయం ఇస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు: జూన్ 8 - జూలై 2, 2018.
రాత పరీక్ష తేదీ: సెప్టెంబరు 16, 2018.
No comments:
Post a Comment