ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీల్లో 10,190 ఖాళీలు దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్, ఆఫీసు అసిస్టెంట్ల పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 10,190 పోస్టులుండగా, తెలుగు రాష్ట్రాల్లో 1470 ఖాళీలున్నాయి. నియామకాల సమయానికి వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. బ్యాంకుల్లో, సొంత ప్రాంతంలో కొలువు సంపాదించాలనుకునేవారికి ఇదో మంచి అవకాశం. పోటీ ఎక్కువే ఉంటుంది. అందుకే పకడ్బందీ ప్రణాళికతో, సన్నద్ధతలో ముందుకు దూసుకువెళ్లాలి!
బ్యాంకింగ్ కార్యకలాపాలు, సదుపాయాలు గ్రామీణ ప్రాంతవాసులకు అందించే ముఖ్య ఉద్దేశంతో ఏర్పడినవే గ్రామీణ బ్యాంకులు (రీజనల్ రూరల్ బ్యాంకులు). గ్రామాల్లో సేవలు అందించే ఆలోచన, తమ ప్రాంతాల్లోనే బ్యాంకు ఉద్యోగం చేయాలనుకునేవారికి గ్రామీణ బ్యాంకుల్లో తాజా నియామక ప్రకటన ఆ అవకాశాన్ని కలుగజేస్తుంది.
ప్రభుత్వరంగ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్ ఉమ్మడి రాతపరీక్ష కోసం ఏటా విడుదల చేసే నోటిఫికేషన్లలో ఇది మొదటిది. ఈ అన్ని రాతపరీక్షల్లోని సబ్జెక్టులు దాదాపుగా ఒకటే. కాబట్టి ఈ ఆర్‌ఆర్‌బీ పరీక్షలకు (స్కేల్-1, ఆఫీసర్ అసిస్టెంట్) సరిగా సన్నద్ధమైతే ఆ తరువాత నిర్వహించే పీఓ, క్లర్క్, స్పెషలిస్ట్ ఆఫీసర్ల పరీక్షలను కూడా బాగా రాసే అవకాశం ఉంటుంది.
ఉన్నత అవకాశాలు
ఆఫీస్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరినా పదోన్నతుల ద్వారా ఉన్నతస్థానానికి చేరుకునే అవకాశముంది. ముందుగా ఆఫీసర్ స్థాయికి ఆపై అంచెలంచెలుగా మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్/ రీజనల్ మేనేజర్, జనరల్ మేనేజర్ స్థాయులకు చేరుకోవచ్చు. ఆఫీసర్‌గా చేరిన అభ్యర్థి బ్యాంకులోని అత్యున్నత స్థాయి అయిన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ స్థానానికి చేరుకునే అవకాశముంది.
ఎంపిక విధానం
ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించే రెండంచెల రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీనిలో మొదటి అంచెలో నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష కేవలం అర్హత పరీక్ష కాగా రెండో అంచెలో నిర్వహించే ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
స్కేల్-1 ఆఫీసర్ పోస్టులకు రెండంచెల రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక ఉంటుంది. అభ్యర్థులకు ప్రధాన పరీక్ష, ఇంటర్వ్యూల్లో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తారు. స్కేల్-2, 3 పోస్టులకు ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించే ఒకే రాతపరీక్ష, ఇంటర్వ్యూల్లో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఒకే రకమైన సబ్జెక్టులు
ఈ పరీక్షలన్నింటిలో దాదాపుగా ఒకేవిధమైన సబ్జెక్టులు ఉన్నాయి. అసిస్టెంట్, ఆఫీసర్ పరీక్షల స్థాయిలో మాత్రం భేదముంటుంది. అసిస్టెంట్ పరీక్షలో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్/ హిందీ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్ సబ్జెక్టులు ఉండగా, స్కేల్-1 పరీక్షలో మాత్రం న్యూమరికల్ ఎబిలిటీ బదులుగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంది. మిగిలినవాటిలో మార్పు లేదు.
ఆఫీసర్ స్కేల్-2 (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్), స్కేల్-3 పరీక్షల్లో రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఫైనాన్షియల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్/ హిందీ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్‌లు ఉండగా, స్పెషలిస్ట్ ఆఫీసర్ (స్కేల్-2) పరీక్షలో వీటికి అదనంగా ప్రొఫెషనల్ నాలెడ్జ్ సబ్జెక్టు ఉంది. అభ్యర్థులు ఈ పరీక్షలన్నింటిలో ఇంగ్లిష్ లేదా హిందీ లాంగ్వేజ్ సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్/న్యూమరికల్ ఎబిలిటీ:
మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్ అనే భేదం లేకుండా అభ్యర్థులందరూ ఇబ్బందిపడే సబ్జెక్టు- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్/ న్యూమరికల్ ఎబిలిటీ. అందుకు కారణం దీనికి ఎక్కువ సమయం పట్టడమే. సాధ్యమైనంత మేరకు నేరుగా జవాబును రాబట్టే షార్ట్‌కట్ మెథడ్స్ ప్రాక్టీస్ చేయాలి.
కొన్ని ప్రశ్నలను సాధించాల్సిన అవసరం లేకుండా ఆప్షన్లను జాగ్రత్తగా గమనించి సరైన జవాబును గుర్తించవచ్చు. అదేవిధంగా మరికొన్ని ప్రశ్నలను ఇచ్చిన ఆప్షన్లలో జవాబు వచ్చే అవకాశం లేనివాటిని వదిలేస్తూపోతే చివరికి జవాబు మాత్రమే మిగిలేలా కూడా సాధించవచ్చు. అయితే ఇలాంటి పద్ధతులకు అంశాల పట్ల అవగాహన, మంచి సాధన ఉండాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్/ న్యూమరికల్ ఎబిలిటీలో సింప్లిఫికేషన్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలుంటాయి. అసిస్టెంట్ పరీక్షలో దాదాపు 15-20 ప్రశ్నలు, ఆఫీసర్ పరీక్షలో దాదాపు 10 ప్రశ్నలు వీటి నుంచే ఉంటాయి. సాధారణంగా వీటికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల కాల్‌క్యులేషన్స్ వేగంగా చేయగలిగేలా సాధన చేయాలి. వీటికి ఎక్కాలు (25-30 వరకు) బాగా ఉపయోగపడతాయి. అలాగే కాల్‌క్యులేషన్స్ వేగంగా చేయడానికి వేదగణిత, స్పీడ్ మ్యాథ్స్ పద్ధతులు ఉపయోగపడతాయి. వీలైతే వాటిని నేర్చుకుని బాగా సాధన చేయాలి.
అంకగణితంలో గణనకు ఎక్కువ సమయం తీసుకునే చక్రవడ్డీ లాంటి ప్రశ్నలను అదనపు సమయం అందుబాటులో ఉంటేనే చేయాలి. లేదంటే వదిలేయడం ఉత్తమం. అదేవిధంగా నంబర్ సిరీస్ ప్రశ్నల్లో సంఖ్యలమధ్య సంబంధం వెంటనే తెలిస్తే ప్రశ్నను సాధించాలి. లేదంటే కాలయాపన లేకుండా ఆ ప్రశ్నను వదిలేయడం మంచిది.

జనరల్ అవేర్‌నెస్:జనరల్ అవేర్‌నెస్‌లో బ్యాంకింగ్, ఆర్థికాంశాలకు ప్రాధాన్యమిస్తూ వర్తమానాంశాల నుంచి ప్రశ్నలుంటాయి. కాబట్టి అభ్యర్థులు పరీక్షకు 5, 6 నెలల ముందు వరకూ ఉన్న ఈ అంశాలను నోట్ చేసుకోవాలి. అయితే వీటన్నింటినీ యథాతథంగా కాకుండా విభాగాలవారీగా (బ్యాంకింగ్, ఎకానమీ, ప్రభుత్వ అధికారాలు, క్రీడలు, జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలు మొదలైనవి) విభజించుకుని ఒకచోట రాసుకోవాలి. వాటిని ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా చూసుకోవాలి.
రీజనింగ్: రీజనింగ్‌ను సులువైనదిగా భావించి చాలామంది తేలికగా తీసుకుంటున్నారు. దీంతో కొందరు ఇందులో ఉత్తీర్ణులు కాలేకపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఇది తేలికగా కనిపించే సబ్జెక్టు అయినప్పటికీ సరైన అవగాహన, సాధన లేకపోతే తప్పు చేయడానికి అవకాశముంది. మానసికంగా చురుకుదనం, తార్కికమైన ఆలోచనా విధానం చాలా అవసరం. ఆసక్తికరమైనదీ, నాన్-మ్యాథ్స్ అభ్యర్థులు కూడా బాగా చేయగలిగే సబ్జెక్టు కాబట్టి చక్కని సాధనతో మంచి మార్కులు సాధించవచ్చు.
ఇంగ్లిష్: గ్రామీణ అభ్యర్థులు ఎక్కువగా భయపడే విభాగం- ఇంగ్లిష్.కానీ భయం అవసరం లేదు. అభ్యర్థుల స్థాయిని దృష్టిలో పెట్టుకొని ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు. ప్రతిసారీ కొత్త తరహాలో ప్రశ్నలను ఇస్తున్నారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్‌లో పదాలకు బదులుగా వాక్యాలను ఇవ్వడం, అయిదు ఆప్షన్లలో వాక్యాలను ఇచ్చి వాటిలో ఏయే ఆప్షన్ల ద్వారా అర్థవంతమైన వ్యాసం తయారవుతుందో కనుక్కోవడం మొదలైన తరహా ప్రశ్నలను ఇటీవలి పరీక్షల్లో గమనించొచ్చు. అందువల్ల పూర్వ ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నల సరళి గమనించి సిద్ధమవ్వాలి.
స్థాయి పెరిగింది
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో డేటా ఇంటర్‌ప్రిటేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డేటా సఫిషియన్సీల్లో ప్రశ్నల స్థాయి బాగా పెరిగింది. రీజనింగ్‌లో సీటింగ్ అరేంజ్‌మెంట్, పజిల్ టెస్ట్‌ల స్థాయి కూడా పెరిగింది. చాలా సందర్భాల్లో ఈ రెండింటినీ కలిపి ప్రశ్నలను ఇస్తారు. కాబట్టి అభ్యర్థులు ఇవి బాగా గమనించాలి.
స్కేల్-1 ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ల ప్రిలిమినరీ పరీక్షకు 60-75 రోజుల సమయం, మెయిన్స్‌కు దాదాపుగా మూడున్నర నెలలకుపైగా సమయం ఉంది. అయితే అభ్యర్థులు మెయిన్స్‌కు సిద్ధమైతే సహజంగానే ప్రిలిమినరీ పరీక్షకూ సన్నద్ధత పూర్తవుతుంది. ప్రిలిమ్స్‌లో కేవలం రెండు సబ్జెక్టులే ఉన్నాయి. కాబట్టి కొద్దిగా కష్టపడితే తేలికగానే దీనిలో ఉత్తీర్ణత సాధించొచ్చు.

మరికొన్ని ముఖ్యాంశాలు
* అన్ని పరీక్షల్లోని అన్ని విభాగాల్లో కనీస మార్కులతో అభ్యర్థులు విడివిడిగా ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు గుర్తించే ప్రతి తప్పు సమాధానానికీ ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో నాలుగోవంతు మార్కులు తీసివేస్తారు.
* ఆఫీస్ అసిస్టెంట్‌కు మెయిన్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మాత్రమే ఎంపిక జరుగుతుంది. ప్రిలిమ్స్ మార్కులను మెరిట్‌లోకి తీసుకోరు.
* ఆఫీసర్ స్కేల్-1కి మెయిన్ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. స్కేల్-2, 3 ఉద్యోగాలకు ఒక పరీక్ష మాత్రమే ఉంటుంది. అందులో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
* ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, పీడబ్ల్యుబీడీ వర్గాల అభ్యర్థులకు ఆయా ఆర్‌ఆర్‌బీల పరిధిలోని నిర్ణీత సెంటర్లలో ప్రీ-ఎగ్జామినేషన్ ట్రెయినింగ్ ఇస్తారు. భోజనం, వసతి సౌకర్యాల ఖర్చులను అభ్యర్థులే భరించాల్సి ఉంటుంది. ఈ ప్రీ-ఎగ్జామినేషన్ ట్రెయినింగ్‌ను తెలంగాణలో హైదరాబాద్, వరంగల్‌ల్లోనూ, ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, అనంతపురాల్లో అందిస్తారు.
* ఆఫీసర్ ఉద్యోగాలకు జరిగే ఇంటర్వ్యూకు 100 మార్కులు కేటాయించారు. అభ్యర్థులు నిర్ణీత క్వాలిఫైయింగ్ మార్కులను పొందాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 2 జులై, 2018; ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: ఆఫీసర్ స్కేల్-1 ప్రిలిమ్స్: 11 ఆగస్టు, 2018; ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమ్స్: 19 ఆగస్టు, 2018; ఆఫీసర్ (స్కేల్ 1, 2, 3) మెయిన్/సింగిల్ పరీక్ష: 30 సెప్టెంబరు, 2018;
ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ పరీక్ష: 7 అక్టోబరు, 2018.

ప్రిలిమ్స్‌లోగా మెయిన్స్ సన్నద్ధత!
ప్రిలిమినరీ పరీక్ష తేదీలోగా మెయిన్స్ సన్నద్ధత పూర్తయ్యేలా ప్రణాళిక వేసుకోవాలి. ఆ ప్రకారం సాధన చేయాలి. రోజుకు ఎన్ని గంటలు చదివారన్నదానికంటే ఎంత నేర్చుకున్నారు, ఎంత వేగంగా ప్రశ్నను సాధించగలుగుతున్నారనేది ముఖ్యం. ప్రతిరోజూ ఒక పూర్తిస్థాయి మోడల్ పేపర్‌ను సాధిస్తూ నిర్దేశిత సమయంలో ఎన్ని ప్రశ్నలు సాధించగలుగుతున్నారో తప్పనిసరిగా గమనించాలి.
ముఖ్యంగా అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిందేమిటంటే.. బ్యాంకు పరీక్షల్లోని ప్రశ్నలన్నింటినీ అందరూ సాధించగలుగుతారు. నిర్దేశిత సమయంలో ఎక్కువ సాధించినవారే విజేతలుగా నిలుస్తారు!

No comments:
Post a Comment