Thursday, May 24, 2018

NOTIFICATION RRB-RPF రైల్వే నుంచి 9739 పోస్టులతో భారీ నోటిఫికేషన్

వెబ్‌సైట్‌: http://constable.rpfonlinereg.org/ https://si.rpfonlinereg.org/

భారతీయ రైల్వే ఉద్యోగాల జోరును కొనసాగిస్తోంది. అసిస్టెంట్‌ లోకోపైలట్‌, టెక్నీషియన్‌, గ్రూప్‌ - డి వంటి దాదాపు లక్ష పోస్టుల భర్తీ దిశగా అడుగులు వేస్తోన్న రైల్వే.. తాజాగా మరో 10 వేల పోస్టుల రిక్రూట్‌మెంట్‌ కోసం నోటిఫికేషన్‌ వెలువరించింది. దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌లలో ఖాళీగా ఉన్న 8619 కానిస్టేబుల్‌, 1120 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను ప్రస్తుత ప్రకటన ద్వారా భర్తీ చేయనుంది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఏ జోన్‌కు దరఖాస్తు చేయాలనుకున్నారో ‘పోస్ట్‌ ప్రిఫరెన్స్‌’లో వివరాలు నమోదు చేయాలి. ఖాళీలను అనుసరించి తమకు నచ్చిన ఏ జోన్‌కైనా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన అర్హత, ఎంపిక ప్రక్రియ, తదితర వివరాలను చూద్దాం..
కానిస్టేబుల్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు సిలబస్‌ ఒకటే. కాబట్టి ఏక కాలంలో రెండు పోస్టులకు సిద్ధం కావచ్చు. కాకపోతే ఆయా పోస్టులను బట్టి ప్రశ్నల క్లిష్టతలో తేడాలు ఉంటాయి. ఇటీవల యూపీఎస్సీ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ - అసిస్టెంట్‌ కమాండెంట్‌, ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌, ఎస్‌బీఐ పీఓ పరీక్షలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అదేవిధంగా తెలుగు అభ్యర్థులు చాలా మంది పోలీస్‌ కానిస్టేబుల్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ప్రిపరేషన్‌ సాగిస్తున్నారు. వీరందరూ కూడా ఈ పోస్టుల కోసం పోటీ పడొచ్చు. వారు సాగిస్తున్న ప్రిపరేషన్‌ ఈ ఉద్యోగాలకు కూడా ఉపయోగపడుతుంది.
జనరల్‌ అవేర్‌నెస్‌: తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకునే వీలున్న విభాగమిది. కాబట్టి ఇందులో ఎక్కువ మార్కులు సాధించడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా అత్యధిక వెయిటేజీ ఈ విభాగానికే ఉంది (50 మార్కులు).
ప్రపంచవ్యాప్తంగా సామాజికంగా, రాజకీయంగా, శాస్త్ర - సాంకేతిక తదితర రంగాల్లో చోటు చేసుకుంటున్న పరిమాణాలపై అభ్యర్థుల అవగాహనను ఈ విభాగంలో పరీక్షిస్తారు. ఈ విభాగం కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో చోటు చేసుకుంటున్న పరిమాణాలను నిశితంగా గమనించాలి. ముఖ్యంగా ఇతర దేశాలతో భారత్‌ చేసుకుంటున్న ఒప్పందాలు, ప్రధాని పర్యటనలు, అవార్డులు, క్రీడలు, శాస్త్ర - సాంకేతిక పరిశోధనలు, ఎన్నికలు, ప్రభుత్వ విధానాల్లో మార్పులు, చట్టాలు, వార్తల్లో వ్యక్తులు, నియామకాలను సమగ్రంగా ఫాలో కావాలి. భారతదేశ చరిత్ర, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కరెంట్‌ అఫైర్స్‌పై పట్టు సాధిస్తే కనీసం 50 శాతం ప్రశ్నలకు సమాధానాలను రాబట్టవచ్చు. పదో తరగతిలోని సాంఘిక, సామాన్యశాస్త్ర పాఠ్యాంశాలను చదువుకోవాలి. కరెంట్‌ అఫైర్స్‌ కోసం రోజూ దినపత్రికలను చదువుకోవాలి. పరీక్ష తేదీకి ముందు ఏడాది కాలంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు, భారతీయ రైల్వేల్లో జరిగిన మార్పులు, సమావేశాలు, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, క్రీడా పతకాల గురించి తెలుసుకోవాలి.
జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌: అభ్యర్థుల తార్కిక శక్తిని పరీక్షించే విభాగం. ఇందులో 15 - 20 ప్రశ్నలు సులువుగా చేసేలా ఉంటాయి. ఈ విభాగంలో ఎక్కువ స్కోర్‌ చేయాలంటే వేగంతోపాటు కచ్చితత్వం కూడా అవసరం. కాబట్టి సమయాన్ని నిర్దేశించుకొని సమస్యలను సాధించడం నేర్చుకోవాలి. ప్రశ్నలో ఉన్న సమాచారం మొత్తం వినియోగిస్తూ సమాధానాన్ని తీసుకురావాలి. వెర్బల్‌, నాన్‌ వెర్బల్‌, క్రిటికల్‌ థింకింగ్‌, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ సంబంధిత అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అనాలజీ, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, బ్లడ్‌ రిలేషన్స్‌, రీజనింగ్‌, నెంబర్‌ సిరీస్‌, కోడింగ్‌ - డికోడింగ్‌, డేటా సఫిషియెన్సీ, డైరెక్షన్‌ సెన్స్‌, ర్యాంకింగ్స్‌, సీట్‌ ఆరేంజ్‌మెంట్స్‌, వర్డ్‌ బిల్డింగ్‌, వెన్‌ డయాగ్రామ్స్‌, స్పేస్‌ విజువలైజేషన్‌, మ్యాచింగ్‌ వంటి టాపిక్స్‌పై దృష్టి సారించాలి. ఈ విభాగం కోసం బేసిక్‌ మ్యాథమెటిక్స్‌, అల్ఫాబెట్‌ టెస్ట్‌ అంశాలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి. ప్రిపరేషన్‌లో ఒక టాపిక్‌ను తీసుకుంటే.. దానికి సంబంధించి ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో ముందే ఊహించుకొని ప్రాక్టీస్‌ చేయాలి.
అర్థమెటిక్‌: ఈ విభాగాన్ని అభ్యర్థులు క్లిష్టమైనదిగా భావిస్తారు. ఇందులో అర్థమెటిక్‌, మేథమేటిక్స్‌, డేటా అనాలిసిస్‌ / డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ ప్రశ్నలు కూడా అడుగుతారు. ఇందులో భిన్నాలు, దశాంశాలు, శాతాలు, లాభ - నష్టాలు, నిష్పత్తి, డిస్కౌంట్‌, పార్ట్‌నర్‌షిప్‌, వ్యాపార గణితం (వడ్డీ), కాలం - దూరం, కాలం-పని, గ్రాఫ్స్‌, త్రిభుజాలు, సర్కిల్స్‌, స్తూపాలు, చతు రస్రం, ధీర్ఘచతురస్రం, పిరమిడ్‌, ఎత్తు - దూరం, కోణాలు, బార్‌ - చార్ట్‌ డయాగ్రామ్‌ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలో ఎక్కువ స్కోరింగ్‌ చేయాలంటే టేబుల్స్‌, స్క్వేర్స్‌, క్యూబ్స్‌, స్క్వేర్‌ రూట్స్‌ వంటి గణితంలోని ప్రాధమిక భావనలను అవగాహన చేసుకోవాలి. తద్వారా కాలిక్యులేషన్స్‌ చేయడం సులభమవుతుంది. అన్ని టాపిక్స్‌కు సంబంధించిన ఫార్ములాలను పట్టిక రూపంలో రాసుకుని, వీలైనన్ని ఎక్కువసార్లు చదువుకోవాలి.
చివరగా
సీబీటీ, పీఈటీ - పీఎంటీలలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. ఈ దశకు హాజరు కాని వారిని తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. ఈ దశలో విద్యార్హతను సూచించే సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. చివరిగా మెడికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారిని శిక్షణకు పంపిస్తారు. దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తే పోస్టింగ్‌ ఇస్తారు.
సబ్‌ ఇన్‌స్పెక్టర్‌
ఖాళీలు: 1120 
ఈ ఉద్యోగాలకు పురుషులు, మహిళలు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికయిన వారికి ఆరు, ఏడో వేతన కమిషన్‌ ప్రతిపాదనల మేరకు వేతనాలు అందుతాయి. కెరీర్‌ ప్రారంభంలో నెలకు రూ. 35 వేల వరకు జీతం లభిస్తుంది. ఇతర భత్యాలు దీనికి అదనం.
పురుషులకు 819, మహిళలకు 301 పోస్టులను కేటాయించారు.
జోన్ల వారీగా ఖాళీలు
జోన్‌                                                                         ఖాళీలు
ఎస్‌ఆర్‌, ఎస్‌డబ్ల్యూఆర్‌, ఎస్‌సీఆర్‌ 178
సీఆర్‌, డబ్ల్యూఆర్‌, డబ్ల్యూసీఆర్‌ - ఎస్‌ఈసీఆర్‌ 200
ఈఆర్‌, ఈసీఆర్‌, ఎస్‌ఈఆర్‌ - ఈసీఓఆర్‌ 399
ఎన్‌ఆర్‌, ఎన్‌ఈఆర్‌, ఎన్‌డబ్ల్యూఆర్‌ - ఎన్‌సీఆర్‌ 242
ఎన్‌ఎఫ్‌ఆర్‌ 42
ఆర్‌పీఎస్‌ఎఫ్‌ 59
ఆర్‌పీఎస్‌ఎఫ్‌లో పోస్టులను పురుషులకు మాత్రమే కేటాయించారు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు / ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారు దరఖాస్తుకు అనర్హులు.
వయసు: 20 - 25 ఏళ్లు (జూలై 1, 2018 నాటికి). రిజర్వ్‌డ్‌ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఎంపిక ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి. అవి.. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ), ఫిజికల్‌ ఎఫీషియెన్సీ టెస్ట్‌ (పీఈటీ) అండ్‌ ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌ (పీఎంటీ), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ (డీవీ).
మొదటి దశ సీబీటీ: సీబీటీ రాత పరీక్ష. ఇది అబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుంది. 15 భాషల్లో ఈ ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు. ఆ జాబితాలో తెలుగు కూడా ఉంది. కాబట్టి మన అభ్యర్థులు పరీక్ష మాధ్యమంగా తెలుగు భాషను ఎంచుకోవచ్చు. ప్రశ్నల క్లిష్టత డిగ్రీ స్థాయిలో ఉంటుంది. ఈ పరీక్షలో నెగిటివ్‌ మార్కులు కూడా ఉన్నాయి. ప్రతి తప్పునకు 1/3 వంతు మార్కు కోత విధిస్తారు. మొత్తం 120 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. వీటికి 90 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి. ఇందులో జనరల్‌ అవేర్‌నెస్‌ (50 మార్కులు), అర్థమెటిక్‌ (35 మార్కులు), జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ (35 మార్కులు) అనే మూడు విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఈ పరీక్షను సెప్టెంబరు / అక్టోబరులో నిర్వహించే అవకాశం ఉంది. ఇందులో జనరల్‌ / ఓబీసీ అభ్యర్థులు - 35 శాతం, ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులు - 30 శాతం మార్కులు సాధిస్తే అర్హులుగా పరిగణినిస్తారు.
రెండో దశ పీఈటీ - పీఎంటీ: మొదటి దశ పరీక్షలో ప్రతిభ చూపిన వారిని 1:10 నిష్పత్తిలో రెండో దశకు ఎంపిక చేస్తారు. అభ్యర్థులు రెండో దశలో అర్హత సాధించటం తప్పనిసరి. ఇందులో నిర్దేశించిన విధంగా అభ్యర్థులకు శారీరక ప్రమాణాలు ఉన్నాయా లేవా అని పరిశీలిస్తారు. అదేవిధంగా ఫిజికల్‌ ఈవెంట్లలో క్వాలిఫై కావాలి. ఈ దశ కేవలం అర్హతకు మాత్రమే ఉద్దేశించింది. ఎటువంటి మార్కులు ఇవ్వరు. ఇందులో ఉండే
ఈవెంట్లు...
పురుషులు 1600 మీటర్ల దూరాన్ని 6 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేయాలి. లాంగ్‌ జంప్‌లో 12 ఫీట్లు, హై జంప్‌లో 3 ఫీట్ల 9 ఇంచ్‌ల ఎత్తు దూకాలి.
మహిళలు 800 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల్లో పూర్తి చేయాలి. లాంగ్‌ జంప్‌లో 9 ఫీట్లు, హై జంప్‌లో 3 ఫీట్ల ఇంచ్‌ల ఎత్తు దూకాలి. (పురుషులు, మహిళలకు లాంగ్‌ - హై జంప్‌ కోసం రెండు ఛాన్స్‌లు ఉంటాయి).
కానిస్టేబుల్‌
ఖాళీలు: 8619
కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు కూడా పురుషులు, మహిళలు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి వేతన కమిషన్‌ ప్రతిపాదనల మేరకు వేతనాలు అందుతాయి. కెరీర్‌ ప్రారంభంలో నెలకు రూ. 21,700 వరకు జీతం లభిస్తుంది. ఇతర భత్యాలు కూడా ఉంటాయి. పురుషులకు 4403, మహిళలకు 4216 పోస్టులు కేటాయించారు.
జోన్ల వారీగా ఖాళీలు
జోన్‌                                                       ఖాళీలు
ఎస్‌ఆర్‌, ఎస్‌డబ్ల్యూఆర్‌, ఎస్‌సీఆర్‌ 1731
సీఆర్‌, డబ్ల్యూఆర్‌, డబ్ల్యూసీఆర్‌ - ఎస్‌ఈసీఆర్‌ 1152
ఈఆర్‌, ఈసీఆర్‌, ఎస్‌ఈఆర్‌ - ఈసీఓఆర్‌ 2678
ఎన్‌ఆర్‌, ఎన్‌ఈఆర్‌, ఎన్‌డబ్ల్యూఆర్‌ - ఎన్‌సీఆర్‌ 2052
ఎన్‌ఎఫ్‌ఆర్‌ 340
ఆర్‌పీఎస్‌ఎఫ్‌ 666
ఆర్‌పీఎస్‌ఎఫ్‌లో పోస్టులను పురుషులకు మాత్రమే కేటాయించారు.
అర్హత: గుర్తింపు బోర్డు నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌సీ / మెట్రిక్‌ (పదో తరగతి).
వయసు: 18 - 25 ఏళ్లు (జూలై 1, 2018 నాటికి). రిజర్వ్‌డ్‌ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ), ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌ (పీఈటీ) అండ్‌ ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌ (పీఎంటీ) ఉంటాయి. చివరిగా డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ (డీవీ) ఉంటుంది.
సీబీటీ: ఇది మొదటి దశ. అబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. మొత్తం 15 భాషల్లో ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు పరీక్ష మాధ్యమంగా తెలుగు భాషను ఎంపిక చేసుకోవచ్చు. సీబీటీలో ప్రశ్నల క్లిష్టత పదో తరగతి స్థాయిలో ఉంటుంది. నెగిటివ్‌ మార్కులు కూడా ఉన్నాయి. ప్రతి తప్పునకు 1/3 వంతు మార్కు తీసేస్తారు.
ప్రశ్నపత్రంలో మొత్తం 120 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. వీటికి 90 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి. ఇందులో జనరల్‌ అవేర్‌నెస్‌ (50 మార్కులు), అర్థమెటిక్‌ (35 మార్కులు), జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ (35 మార్కులు) అనే మూడు విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఈ పరీక్షను సెప్టెంబరు / అక్టోబరులో నిర్వహించే అవకాశం ఉంది. కనీస ఉత్తీర్ణత శాతం ఎస్‌ఐ పోస్టులకు మాదిరిగానే ఉంటుంది. జనరల్‌ / ఓబీసీ అభ్యర్థులు - 35 శాతం, ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులు - 30 శాతం మార్కులు సాధించాలి.
పీఈటీ - పీఎంటీ: మొదటి దశ సీబీటీలో ప్రతిభ చూపిన వారిని 1:10 నిష్పత్తిలో రెండో దశకు ఎంపిక చేస్తారు. పోస్టుకు ఎంపిక కావాలంటే ఈ దశలో అర్హత సాధించటం తప్పనిసరి. ఇందులో నిర్దేశించిన విధంగా అభ్యర్థులకు శారీరక ప్రమాణాలు ఉన్నదీ లేనిదీ పరిశీలిస్తారు. ఫిజికల్‌ ఈవెంట్లలో కూడా క్వాలిఫై కావాలి. ఈ దశ కేవలం అర్హతకు మాత్రమే ఉద్దేశించింది. ఎటువంటి మార్కులు ఇవ్వరు. ఇందులో ఉండే ఈవెంట్లు..
పురుషులు 1600 మీటర్ల దూరాన్ని 5 నిమిషాల 45 సెకన్లలో పూర్తి చేయాలి. లాంగ్‌ జంప్‌లో 14 ఫీట్లు, హై జంప్‌లో 4 ఫీట్ల ఎత్తు దూకాలి.
మహిళలు 800 మీటర్ల దూరాన్ని 3 నిమిషాల 40 సెకన్లలో పూర్తి చేయాలి. లాంగ్‌ జంప్‌లో 9 ఫీట్లు, హై జంప్‌లో 3 ఫీట్ల ఎత్తు దూకాలి. (పురుషులు, మహిళలకు లాంగ్‌ - హై జంప్‌ కోసం రెండు ఛాన్స్‌లు ఉంటాయి).
ఉపయోగపడే పుస్తకాలు
మోడ్రన్‌ అప్రోచ్‌ టు వెర్బల్‌ - నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌ - ఆర్‌ఎస్‌ అగర్వాల్‌
ఫాస్ట్‌ ట్రాక్‌ ఆబ్జెక్టివ్‌ అర్థమెటిక్‌ - అర్హింత్‌ పబ్లికేషన్స్‌
అనలిటికల్‌ రీజనింగ్‌ - ఎంకే పాండే
మనోరమ / ఇండియా ఇయర్‌ బుక్‌
ఎన్‌సీఈఆర్‌టీ - హిస్టరీ, పాలిటీ,
ఎకానమీ, జాగ్రఫీ పుస్తకాలు
ముఖ్య సమాచారం
దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా
దరఖాస్తు ప్రారంభం: జూన్‌ 1, 2018.
దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 30, 2018.
వెబ్‌సైట్‌: http://constable.rpfonlinereg.org/ https://si.rpfonlinereg.org/ 

No comments:

Post a Comment