ప్రజాస్వామ్య సూచీలో భారత్‌కు 42వ స్థానంపెచ్చుమీరుతున్న హిందూ అతివాదం, మైనారిటీలపై దాడుల నేపథ్యంలో ప్రజాస్వామ్య సూచీలో భారత్ స్థానం మరింత పడిపోయింది. 2016లో భారత్‌కు 32వ స్థానం దక్కగా, 2017లో 42వ స్థానానికి దిగజారి ‘దోషపూరిత ప్రజాస్వామ్య’ దేశాల జాబితాలోనే కొనసాగుతోంది. ఈ లిస్ట్‌లో అమెరికాకు 21వ స్థానం, రష్యాకు 135వ, చైనాకు 139వ స్థానం దక్కాయి. మొత్తం పది మార్కులకు గాను భారత్ 7.23 పాయింట్లు స్కోరు చేయగలిగింది. నార్వేకు అగ్రస్థానం (9.87 పాయింట్లు) దక్కగా ఐస్‌లాండ్, స్వీడన్, న్యూజిలాండ్, డెన్మార్క్, ఐర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ వరుసగా మొదటి పది స్థానాల్లో నిలిచాయి. 165 దేశాలు, రెండు ప్రత్యేక ప్రాంతాలతో ఎకనమిస్ట్ ఇంటెలిజెన్‌స యూనిట్ (ఈఐయూ) జాబితా రూపొందించింది. మొదటి 19 స్థానాల్లో నిలిచిన దేశాల్లోనే పూర్తిస్థాయి ప్రజాస్వామ్యం ఉన్నట్లు చెప్పింది.
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘ది ఎకనమిస్ట్ గ్రూప్’లోని పరిశోధన, విశ్లేషణ విభాగమే ఈఐయూ. ఇది 1946 నుంచి ఏటా ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యంపై సూచీలను విడుదల చేస్తోంది. ఆయా దేశాల్లో ఎన్నికల ప్రక్రియ, బహుళత్వం, పౌర స్వేచ్ఛ, ప్రభుత్వం పనితీరు, రాజకీయ ప్రాతినిధ్యం, రాజకీయ సంస్కృతి, మీడియా స్వేచ్ఛ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని.. సంపూర్ణ ప్రజాస్వామ్యం, దోషపూరిత ప్రజాస్వామ్యం, మిశ్రమ పాలన, నిరంకుశ పాలన ఉన్న దేశాలుగా విభజిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎకనమిస్ట్ ఇంటెలిజెన్‌స యూనిట్ ప్రజాస్వామ్య సూచీ - 2017
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : 42వ స్థానంలో భారత్
‘బోఫోర్స్’ పై మళ్లీ పిటిషన్ వేసిన సీబీఐ
బోఫోర్స్ కుంభకోణంపై 2005లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ ఫిబ్రవరి 2న సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి బీజేపీ నేత అజయ్ అగర్వాల్ గతంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. రూ.64 కోట్లకు సంబంధించిన ఈ కేసులో యూరప్ పారిశ్రామిక వేత్తలైన హిందూజా సోదరులతో సహా పలువురిపై కీలకమైన దస్తావేజులు, సాక్షాలతో సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
మే 31, 2005న అప్పటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ సోధి ఈ కుంభకోణంలో సీబీఐ కేసును కొట్టేశారు. అంతకుముందు, 2004 ఫిబ్రవరి 4న మరో జడ్జి జస్టిస్ జేడీ కపూర్ ఈ కేసులో మాజీ ప్రధాని రాజీవ్ ప్రమేయం లేదంటూ నిర్దోషిగా ప్రకటించారు.
భోఫోర్స్ నేపథ్యం
భారత ప్రభుత్వం స్వీడన్ ఆయుధ తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్ మధ్య నాలుగు వందల 155 ఎంఎం హోవిట్జర్‌లను కొనుగోలు చేసేందుకు 1986 మార్చి 24న రూ.1,437 కోట్ల ఒప్పందం కుదిరింది. 1987 ఏప్రిల్ 16న స్వీడన్ రేడియో.. ఆయుధాల కొనుగోలుకు సంబంధించి భారతీయ ప్రముఖ రాజకీయ నాయకులు, రక్షణశాఖ అధికారులకు బోఫోర్స్ ముడుపులు చెల్లించిందని వెల్లడించింది. దీంతో 1990 జనవరి 22న సీబీఐ ఏబీ బోఫోర్స్ అధ్యక్షుడు మార్టిన్ అర్డ్‌బో, మధ్యవర్తులుగా ఉన్న విన్ చద్దా, హిందూజా సోదరులపై నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీతోపాటుగా అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భోఫోర్స్‌పై సుప్రీంకోర్టులో మళ్లీ పిటిషన్
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : సీబీఐ
ఎందుకు : కేసుకు సంబంధించిన పూర్తి సాక్ష్యాలు, ఆధారాలు తమ వద్ద ఉన్నాయని
ఢిల్లీలో డీజిల్ ఇంజిన్లు మరో ఏడాదే
ఢిల్లీ ప్రాంతంలో 2019 మార్చి తర్వాత డీజిల్ ఇంజిన్‌తో నడిచే రైలు ఒక్కటి కూడా ఉండదని అధికారులు తనకు చెప్పినప్పినట్లు రైల్వే మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. 2022 నాటికి దేశవ్యాప్తంగా డీజిల్ ఇంజిన్ల వాడకాన్ని నిలిపేసేందుకు కృషి చేస్తున్నామనీ, ఆ తర్వాత నుంచి అన్ని రైళ్లనూ విద్యుత్తు ఇంజిన్లతోనే పరుగులు తీయిస్తామని ఆయన తెలిపారు. ఈ ఏడాది జనవరి 31 నాటికి రైల్వే 279 విద్యుత్తు ఇంజిన్‌లను అందుబాటులోకి తెచ్చిందనీ, ఈ సంఖ్యను వెయి్యకి పెంచాల్సి ఉందని గోయల్ చెప్పారు. 2019 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా డీజిల్ ఇంజిన్ల స్థానంలో విద్యుత్తు ఇంజిన్లను ప్రవేశపెడితే రైల్వేకు ఏడాదికి రూ.11,500 కోట్లు ఆదా అవడంతోపాటు రైళ్ల వేగం కూడా స్వల్పంగా పెరుగుతుందని అంచనా.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఢిల్లీలో డీజిల్ రైలు ఇంజిన్లు మరో ఏడాదే
ఎప్పుడు : 2019, మార్చి నాటికి
ఎవరు : పీయూష్ గోయల్
విమాన రద్దీలో ముంబై విమానాశ్రయం అరుదైన రికార్డు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన ఘనత సాధించింది. 24 గంటల్లో 980 విమానాల రాకపోకలతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సింగిల్ రన్‌వే విమానాశ్రయంగా రెండో ఏడాది కూడా రికార్డుల్లోకెక్కింది. జనవరి 20న ఈ విమానాశ్రయం ఈ ఘనత సాధించినట్లు ఎయిర్‌పోర్ట్ అధికార ప్రతినిధి తెలిపారు. గతేడాది డిసెంబర్ 6న 24 గంటల్లో 974 విమానాల రాకపోకలతో తన పేరిట ఉన్న రికార్డును ముంబై ఎయిర్‌పోర్ట్ బద్దలు కొట్టిందన్నారు. గత మార్చిలో ఒక్క రోజు వ్యవధిలో 837 విమానాల రాకపోకలతో ముంబై విమానాశ్రయం లండన్‌లోని గట్విక్ ఎయిర్‌పోర్ట్ (757 విమానాల రాకపోకలు)ను వెనక్కు నెట్టింది. ముంబై విమానాశ్రయం 24 గంటల పాటు పనిచేస్తే, ప్రభుత్వ నిషేధం కారణంగా గట్విక్ ఎయిర్‌పోర్ట్ ఉదయం 5 నుంచి రాత్రి 12 గంటల వరకే పనిచేస్తుంది. అయినప్పటికీ ఈ విమానాశ్రయానికి 2018లో రోజుకు 870 ఫ్లైట్ల రాకపోకల సామర్థ్యం ఉంది.
ఈవీఎంలను ఎవరికీ అమ్మొద్దని ఈసీఐ ఆదేశం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల అమ్మకానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్(బీఈఎల్), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్)లకు ఆదేశాలు జారీ చేసింది. తమ కోసం రూపొందించిన ఈవీఎంలను రాష్ట్రాల ఎన్నికల సంఘాలకు (ఎస్‌ఈసీ) కానీ, విదేశీ ఎన్నికల నిర్వహణ సంస్థలకు కానీ తమ అనుమతి లేకుండా అమ్మకూడదని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆ రెండు సంస్థలకు 2017, మే 27న ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. అయితే, ఈ ఆదేశాలపై 2017 నవంబర్‌లో జరిగిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ల జాతీయ సదస్సులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు ఒక సమాచార హక్కు విజ్ఞాపన ద్వారా వెల్లడైంది. ఈ విషయాన్ని ఈసీతో చర్చించాలని చివరకు నిర్ణయించారు. ఈసీఐ, ఎస్‌ఈసీ.. రెండూ కూడా ఈసీఐఎల్, బీఈఎల్ సంస్థల నుంచే ఈవీఎంలను కొనుగోలు చేస్తాయి.
తొలిసారిగా మావో నేత ఆస్తుల అటాచ్‌మెంట్
బిహార్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ ఓ మావోయిస్టు కమాండర్‌కు చెందిన రూ.86 లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. మావోయిస్టు ఆస్తులను ఈడీ వంటి దర్యాప్తుసంస్థ అటాచ్ చేయడం దేశంలో ఇదే తొలిసారి. అవినీతి నిరోధక చట్టం కింద సందీప్ యాదవ్ అలియాస్ బడ్కా భయ్యా, అతని కుటుంబీకుల స్థిర, చరాస్తులను అటాచ్‌చేస్తూ ఈడీ ఆదేశాలిచ్చింది. యాదవ్ ప్రస్తుతం మావోయిస్టు బిహార్-జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ ‘మధ్య జోన్’ ఇన్‌చార్జిగా ఉన్నాడు. బిహార్‌లోని 5 ప్లాట్లను, ఢిల్లీలో ఫ్లాటు కొనుగోలుకు సంబంధించిన రూ.10.43 లక్షల నగదు, కొన్ని వాహనాలు, బ్యాంకు డిపాజిట్లను ఈడీ అటాచ్ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తొలిసారిగా మావో నేత ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎక్కడ : బిహార్
ఎవరు : సందీప్ యాదవ్ అలియాస్ బడ్కా భయ్యా

No comments:
Post a Comment