స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) - ఢిల్లీ పోలీస్, కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్) కోసం సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకోసం ప్రకటన విడుదల చేసింది. సీఐఎస్‌ఎఫ్‌లోని అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఖాళీలకు సంబంధించిన ప్రకటన విడుదల కావాల్సి ఉంది.
‘ఢిల్లీ పోలీస్’కు కేటాయించిన ఎస్సై పోస్టులు:150 (పురుషులకు 97, మహిళలకు 53)
‘సీఏఎస్‌ఎఫ్’కు కేటాయించిన పోస్టులు: 1073 (పురుషులకు 1035, మహిళలకు 38)
‘ఫోర్స్’లవారీ ఖాళీలు: సీఆర్‌పీఎఫ్ 274, బీఎస్‌ఎఫ్ 508 (మహిళలకు 25), ఐటీబీపీ 85 (మహిళలకు 13), ఎస్‌ఎస్‌బీ 206
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
వయసు: ఆగస్టు 1 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (పేపర్ 1 ్క్ష పేపర్ 2), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ) / ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (పీఈటి), మెడికల్ టెస్ట్ ద్వారా
రాత పరీక్ష తేదీలు: జూన్ 4 నుంచి 10 వరకు పేపర్ 1, డిసెంబరు 1న పేపర్ 2 పరీక్షలు జరుగుతాయి.
దరఖాస్తు ఫీజు: రూ.100(ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్/ మహిళలకు మినహాయింపు వర్తిస్తుంది)
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 2
వెబ్‌సైట్: www.ssc.nic.in
No comments:
Post a Comment