కొలువుల రైలు..కదిలివచ్చింది!
దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 26,502 టెక్నికల్, అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. కొత్త సంవత్సరం ఆరంభంలోనే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నిరుద్యోగులకు అందించిన అద్భుతమైన అవకాశం ఇది!
ఈరైల్వే ఉద్యోగాలకు ఎంపికైతే.. పోస్టును బట్టి ప్రొడక్షన్ యూనిట్, వర్క్‌షాప్, జనరల్ సర్వీస్, క్యారేజ్ అండ్ వ్యాగన్, ప్రింటింగ్ ప్రెస్, డీజిల్ షెడ్, ట్రాక్ మెషిన్, టెలీకమ్యూనికేషన్ సిస్టమ్, సిగ్నల్ సిస్టమ్ వంటి వివిధ డిపార్ట్‌మెంట్లలో ఆపరేటర్, ఫిట్టర్, డ్రైవర్, పెయింటర్ పోస్టులతోపాటు అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల్లో విధులు నిర్వర్తించాల్సివుంటుంది. నెల జీతం రూ.35,000 నుంచి రూ.40,000 వరకు వస్తుంది.
ఎవరు అర్హులు?
* పదోతరగతి తర్వాత ఐటీఐ పూర్తి చేసినవారు ్య 3 సంవత్సరాల డిప్లొమా పూర్తి చేసినవారు
* పాలిటెక్నిక్ పూర్తిచేసిన తర్వాత 3 సంవత్సరాల ఇంజినీరింగ్ పూర్తి చేసినవారు
* మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ పూర్తిచేసినవారు
* చివరి సంవత్సరం చదువుతున్నవారు ఈ పోస్టులకు అనర్హులు.
వయః పరిమితులు: జనరల్ కేటగిరీవారు 18-30 సంవత్సరాల మధ్యవారై ఉండాలి. 01-07-2018తో సరిచూసుకొని అభ్యర్థుల వయసు నిర్ణయిస్తారు. రిజర్వేషన్ కేటగిరీలకు మినహాయింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తి చేయడానికి చివరితేది: 05-03-2018.
ప్రథమ కంప్యూటర్ ఆధారిత పరీక్ష: ఏప్రిల్, మే నెలల్లో ఉంటుంది.
అభ్యర్థులు ఏ రైల్వే జోన్‌కు దరఖాస్తు చేయాలో నిర్ణయించుకుని, ఆయా రైల్వే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తిచేసి, ఫీజు చెల్లించాలి. ఏదైనా ఒక రైల్వే జోన్‌కు మాత్రమే అప్లై చేయాలి. ఒక అభ్యర్థి ఒక దరఖాస్తును మాత్రమే పూర్తి చేయాలి.
ఎంపిక ప్రక్రియ: అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ), టెక్నిషియన్ పోస్టులకు దరఖాస్తు చేసినవారు మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) రాయాల్సి ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయినవారికి రెండో కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తారు. మొదటి పరీక్షలోని మార్కులు క్వాలిఫయింగ్ మార్కులు మాత్రమే. రెండో పరీక్షలోని మార్కుల ఆధారంగా టెక్నిషియన్ పోస్టులను భర్తీ చేస్తారు.
ఏఎల్‌పీ పోస్టుకు దరఖాస్తు చేసినవారికి రెండో సీబీటీ తర్వాత కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. రెండో సీబీటీలో వచ్చిన మార్కుల్లో 70%, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో వచ్చిన వాటిల్లో 30% మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.
పరీక్ష జరగడానికి 3 నెలల సమయం ఉంది. రోజువారీ వీలైనంత ఎక్కువ సమయం సన్నద్ధత కోసం వెచ్చించటం సముచితం. ఎక్కువ ప్రశ్నలను సాధన చేస్తూ ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చు!
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (ఏఎల్‌పీ/ టెక్నిషియన్)
అరిథ్‌మెటిక్, మ్యాథమేటిక్స్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్ అంశాల నుంచి 75 ప్రశ్నలు ఇస్తారు. 60 నిమిషాల వ్యవధిలో పూర్తిచేయాలి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు, తప్పు సమాధానానికి 1/3 రుణాత్మక మార్కులున్నాయి.
జనరల్ కేటగిరీవారు 40%, ఓబీసీ, ఎస్సీవారు 30%, ఎస్‌టీ వారు 25% కనీస అర్హత మార్కులు పొందాలి.
రెండో సీబీటీ: (ఏఎల్‌పీ/టెక్నిషియన్)
మొదటి సీబీటీలో క్వాలిఫై అయిన వారిలో, పోస్టుల ఆధారంగా 15 రెట్ల మంది అభ్యర్థులను రెండో సీబీటీకి అర్హులుగా నిర్ణయిస్తారు. పార్ట్- ఎ, పార్ట్- బి పరీక్షలుంటాయి. రెండు పరీక్షలను 2.30 గంటల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
పార్ట్- ఎ: మ్యాథమెటిక్స్, అరిథ్‌మెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్, బేసిక్ సైన్స్, ఇంజినీరింగ్ (టెక్నికల్) సబ్జెక్టుల నుంచి 100 ప్రశ్నలు ఇస్తారు. 90 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాలి.
పార్ట్- బి: డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ట్రైనింగ్ వారు నిర్ణయించిన ట్రేడ్ సిలబస్ ఆధారంగా 75 ప్రశ్నలు ఇస్తారు. 60 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాలి. ఇందులో 35% అర్హత మార్కులు సాధిస్తే చాలు. మొత్తం మెరిట్ మార్కుల్లో పార్ట్- బిని పరిగణించరు.
కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఎల్‌పీ పోస్టులకు మాత్రమే)
రెండో సీబీటీలో క్వాలిఫై అయినవారిలో పోస్టుల సంఖ్య ఆధారంగా 8 రెట్ల మందికి కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రతీ టెస్ట్ బ్యాటరీలో 42 మార్కులు రావాలి. ఈ పరీక్ష సైకాలజీ టెస్ట్ లాంటిది.
ఏది ఎలా చదవాలి?
టెక్నిషియన్ పోస్టులకు రెండు అంచెల్లో, ఏఎల్‌పీ పోస్టుకు మూడు అంచెల్లో జరుగుతున్న పరీక్షలో మొదటిది సీబీటీ (కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్) క్వాలిఫయింగ్ పరీక్ష మాత్రమే. రెండో సీబీటీలోని పార్ట్-ఎ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ మార్కుల ఆధారంగా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రెండో సీబీటీలోని పార్ట్-బి కూడా క్వాలిఫయింగ్ మాత్రమే.
అభ్యర్థులు మేథమేటిక్స్, అరిథ్‌మెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్ సబ్జెక్టులు మొదటి సీబీటీ, రెండో సీబీటీ పరీక్షల్లో వస్తున్నాయి. కాబట్టి వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపితే మొదటి సీబీటీలో క్వాలిఫై అవడంతోపాటు రెండో సీబీటీలో ఎక్కువ మార్కులు పొందవచ్చు.
టెక్నికల్ సబ్జెక్టు అయిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రెండో సీబీటీలో పార్ట్-ఎలో ఉంటుంది. అభ్యర్థులు వారు పూర్తిచేసిన కోర్సుల్లోని సబ్జెక్టులే కాబట్టి, పునశ్చరణ చేస్తే సరిపోతుంది.
* అరిథ్‌మెటిక్: సింప్లిఫికేషన్‌లో బాడ్‌మాస్, పెడ్‌మాస్ రూల్స్ వినియోగించే విధానం, నంబర్ సిస్టమ్స్, శాతాలు, రేషియో-ప్రపోర్షన్, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం, చక్రవడ్డీ, బారువడ్డీ, ఎల్‌సీఎం, హెచ్‌ఎస్‌ఎఫ్, భాగస్వామ్యం, పైప్స్-సిస్టన్స్, క్యాలెండర్, గడియారాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
డేటా అనాలిసిస్, డేటా సఫిషియన్సీ ప్రశ్నలకు సమాధానాలను గుర్తించడం సాధన చేయాలి. సింప్లిఫికేషన్ తక్కువ సమయంలో పూర్తిచేయడం తెలిసుండాలి. శాతాలను ఆధారంగా తీసుకుని లాభనష్టాలు, చక్రవడ్డీ, బారువడ్డీ, నిష్పత్తి-అనుపాతం ప్రశ్నలను సాధన చేయాలి. ఇవన్నీ ఒకే కోణానికి చెందిన అంశాలు. లాజిక్ ఒకేవిధంగా ఉంటూ ప్రశ్నలో ఉపయోగించే భాష మాత్రమే వేరుగా ఉంటుంది. ఇలా సాధన చేస్తే సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు.
* మేథమేటిక్స్: త్రికోణమితి, ఎత్తు-దూరం, ఆల్జీబ్రా, జామెట్రీలో ప్లేన్ జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, ఎలిమెంట్రీ స్టాటిస్టిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటికి సంబంధించిన ఫార్ములాలన్నింటినీ ఒక దగ్గర రాసుకుని వాటిని ఎలా ఉపయోగించాలో సాధన చేయాలి. షార్ట్‌కట్స్ ఉపయోగించి తక్కువ సమయంలో సమాధానాలను గుర్తించడం అలవాటు చేసుకోవాలి.
* జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్: లాజికల్ రీజనింగ్ అంశాలైన నంబర్ సిరీస్, కోడింగ్-డీకోడింగ్, ఆడ్‌మాన్ అవుట్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలో ఉన్న సమాచారాన్ని లింక్ చేస్తూ లాజిక్‌ను కనిపెట్టాలి. వెన్ చిత్రాలు, సిమిలారిటీస్, డిఫరెన్సెస్ వంటి క్లరికల్ ఆప్టిట్యూడ్ అంశాలు, రిలేషన్‌షిప్, మేథమేటికల్ ఆపరేషన్స్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
ఇంగ్లిష్ భాషపై పట్టు సాధిస్తే క్రిటికల్ రీజనింగ్‌లోని ప్రశ్నలు సులువుగా చేయవచ్చు. సమాధానం గుర్తించకపోతే వెంటనే లాజిక్ మార్చి ప్రశ్నను పూర్తిచేయడం అలవాటు చేసుకోవాలి.
* జనరల్ సైన్స్: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ అంశాలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి.
* జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్: సమాజంలో చుట్టూ జరుగుతున్న శాస్త్రీయ, సాంకేతిక, భౌగోళిక, ఆర్థికవ్యవస్థలపై అవగాహన కలిగివుండాలి. జాతీయ, అంతర్జాతీయ అంశాలు, వార్తల్లోని వ్యక్తులు, దేశాలు-రాజధానులు, కరెన్సీ, ఇటీవలి అంతర్జాతీయ సమావేశాలు మొదలైనవి ముఖ్యం.
* బేసిక్ సైన్స్, ఇంజినీరింగ్: టెక్నికల్ సబ్జెక్టులో ఉండే అంశాల నుంచి సాధారణ ప్రశ్నలు వస్తాయి. బేసిక్ ఎలక్ట్రిసిటీ, యూనిట్ మెజర్‌మెంట్స్, సర్క్యూట్స్, స్పీడ్-వెలాసిటీ, హీట్-టెంపరేచర్, మెషిన్స్, లివర్, సేఫ్టీ-హెల్త్, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్, యూనిట్స్, మాస్ వెయిట్-డెన్సిటీ. ఇంజినీరింగ్ డ్రాయింగ్స్‌లోని ప్రొజెక్షన్స్, డ్రాయింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్, జామెట్రిక్ ఫిగర్స్, సింబాలిక్ రెప్రజెంటేషన్స్ అంశాల్లోని సాధారణ ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు వారు చదువుతున్న పుస్తకాల్లోని ఈ అంశాలకు రివిజన్ పూర్తిచేసి ఆబ్జెక్టివ్ విధానాల్లో అడగటానికి అవకాశం ఉన్న ప్రశ్నలు గుర్తించి వాటికి సిద్ధమవ్వాల.

No comments:
Post a Comment