Sunday, June 19, 2016

Relations : Father's day Special

ప్రతి ఒక్కరి హీరో ‘నాన్నే‘.. అడుగడుగునా వెంటే ఉంటూ..అన్నీ తానై నిత్యం ప్రోత్సహించే నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. బిడ్డల ఉన్నతికి 
అహర్నిశలూ పాటుపడుతాడు. ఇంటి బాధ్యత కోసం ప్రతి కష్టాన్ని ఆనందంగా భరిస్తాడు. మరి ఆ నిస్వార్థ తండ్రికి ప్రేమతో అందించే కానుకే ‘ఫాదర్స్‌ డే’. ఈ రోజు(ఫాదర్స్‌ డే) ఎలా వచ్చింది? జంతువుల్లోనూ బాధ్యతగా చూసుకునే తండ్రులు ఉన్నారా? ఫాదర్స్‌ డే సందర్భంగా ఆ విశేషాలు.. 


పిల్లలు ముద్దు ముద్దుగా నాన్న అని పిలుస్తుంటే ప్రపంచాన్నే జయించిన వీరుడిలా సంతోషపడతాడు. బుడిబుడి అడుగులు వేస్తుంటే ఆనందంతో ఉప్పొంగిపోతాడు. గుండెలపై ఆడిస్తాడు. చల్‌ చల్‌ గుర్రం.. చలాకీ గుర్రమంటూ వీపుపై ఎక్కించుకుని సంతోషాల్లో ఊరేగుతాడు. ప్రేమతో కథలు చెబుతాడు. ఎంత మారాం చేసిన ఓపిగ్గా సముదాయిస్తాడు. అల్లరిని భరిస్తాడు. ఏడిస్తే నవ్విస్తాడు. తమ రాకుమారులు, రాకుమార్తెల కోసం ఎంత కష్టాన్నైనా ఇష్టంగా స్వీకరిస్తాడు. ఓటమి ఎదురైనా వేళ నేను ఉన్నానంటూ అండగా నిలబడతాడు, విజయం పలకరించిన వేళ వెన్నుతట్టి ప్రోత్సహిస్తాడు. అయితే తమ కోసం ఇంత చేసే తండ్రికి తగిన గుర్తింపు రావడం లేదని భావించి.. ఎలాగైనా నాన్నలకు ఒక సమున్నత గౌరవం దక్కాలని ఒక కూతురు పడిన తపన నుంచి పుట్టిందే ఫాదర్స్‌ డే. దాదాపు 52 దేశాల్లో నాన్నల గౌరవార్థం ఏటా జూన్‌ మూడో ఆదివారం ఫాదర్స్‌ డే గా జరుపుకుంటారు. 

No comments:

Post a Comment