అరె..కెమికల్స్ లేనిదెక్కడ..?
అన్ని ఫుడ్ ఐటమ్స్ లోనూ కెమికల్స్ ఉన్నాయని అంటున్నారు నిపుణులు. బ్రెడ్ లో పొటాసియం బ్రోమేట్ అనే హానికారక కెమికల్ ఉందని, ఇది క్యాన్సర్ కారకమని ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి కెమికల్స్ బ్రెడ్ లోనే గాక..అన్ని ఫుడ్ ఐటమ్స్ లోనూ ఉంటాయట. పండ్లు, కూరగాయల్లో సైతం కొద్దో గొప్పో రసాయనాలు ఉంటాయని, అయితే అవి మరీ హానికరం కాకపోయినా తినబోయేముందు అప్రమత్తంగా ఉండాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.
కొన్ని కెమికల్స్ ను యోగా మ్యాట్స్, చివరకు చెప్పుల తయారీలోనూ వాడతారని తెలిసింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ అనే సంస్థ..ఢిల్లీలో తయారైన బ్రెడ్ లో పొటాసియం బ్రోమేట్, పొటాసియం అయోడేట్ ఉన్నాయని తేల్చింది. ఇందులో పొటాసియం అయోడేట్ థైరాయిడ్ సమస్యకు దారి తీస్తుందని హెచ్చరించింది. అందువల్లే ఈ కెమికల్స్ ను యూరప్ దేశాల్లో బ్యాన్ చేశారని వెల్లడించింది.
అసలు కెమికల్స్ నీటిలోనూ ఉన్నాయని, అయితే మనం తీసుకునే ఆహార పదార్థాలు బూజు పట్టకుండా చూసుకోవాలని సూచించారు నిపుణులు. సేంద్రియ కూరగాయల్లో పూర్తిగా పెస్టి సైడ్లు ఉండవని చెప్పడానికి ఆధారాలు లేవని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు.
No comments:
Post a Comment