Friday, June 3, 2016

నమ్మకమే బలం

నమ్మకం ఒక ఆయుధం. నమ్మకం ఒక సాధనం. నమ్మకమే ప్రపంచాన్ని నడిపిస్తోంది. మనల్ని నడిపిస్తున్నది కూడా నమ్మకమే. జీవనయానంలో ప్రతి అడుగూ నమ్మకంతోనే పడాలి. మనల్ని మనం సాధించుకోవాలన్నా.. ఆత్మీయులను సాధించుకోవాలన్నా నమ్మకమే సాధనమ వ్వాలి. ముందుగా మనల్ని మనం నమ్మాలి... ఆ తర్వాత ఆత్మీయులనూ నమ్మగలగాలి. అప్పుడే జీవితంలో ఆనందం వర్ధిల్లుతుంది.
ప్రతి మనిషీ జీవితం నమ్మకంతోనే ముడిపడి ఉంటుంది. నమ్మకం లేనిదే ఒక్క అడుగూ ముందుకు వేయలేం. 'ఫలానా పని నేను చేయగలను..' అనే మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయొచ్చు. 'ఫలానా పని అతడు చేయగలడు..' అని ఇతరులు మనల్ని నమ్మాలంటే మన మీద మనకు నమ్మకం ముఖ్యం. మన మీద మనకు నమ్మకం లేనప్పుడు ఎవరికి మాత్రం ఉంటుంది? అందుకే ఏ పనిచేయాలన్నా ఆత్మవిశ్వాసం ఉండాలి. ఎదుటి వారి నమ్మకాన్ని పొందినప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది. కెరీర్‌ ఏదైనా ఎదుటి వారి నమ్మకాన్ని పొందడం ముఖ్యం. ఆఫీసులో బాస్‌ను మెప్పించాలన్నా .. వ్యాపారం, మరేదైనా వృత్తిలో వినియోగ దారులను ఆకట్టుకోవాలన్నా నమ్మకమే ప్రధానం. అలాగని ఎదుటి వారి నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. అలాగైతే ఎక్కువ కాలం వృత్తిలో కొనసాగలేం. ఒకసారి నమ్మకం కోల్పోతే మళ్లీ పొందలేం.పేరెంట్స్‌ వద్ద.. తల్లిదండ్రుల నమ్మకాన్ని ఎన్నటికీ వమ్ము చేయొద్దు. తమ పిల్లలు కాలేజీకి వెళ్లి బుద్ధిగా చదువుకుంటున్నారని అమ్మ, నాన్నలు ఎంతో నమ్మకం తో ఉంటారు. దానిని నిలబెట్టుకోవాలి. చెడు స్నేహాలు, వ్యసనా లకుపోయి వారికి మానసిక క్షోభను మిగల్చొద్దు. చదువులోనే కాదు.. ప్రేమ విషయంలోనూ తల్లిదండ్రుల నమ్మకాన్ని పొందాలి. మీరొకరిని ప్రేమిస్తున్నారంటే అది కచ్చితమైన ప్రేమ అని అమ్మ , నాన్నలు నమ్మగలిగాలి. ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన తల్లిదండ్రులు విస్మరించమనే విశ్వాసాన్ని కలిగించాలి. ప్రేమ పునాది పటిష్టంగా ఉండాలంటే...నమ్మకం లేని ప్రేమ.. పునాది లేని భవనం లాంటిది. ప్రేమ పదిలంగా ఉండటానికి నమ్మకం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా అమ్మాయిలు తన బారుఫ్రెండ్‌లో నమ్మకాన్ని వెతుకుతుంటారు. నమ్మకం, విశ్వాసం కలిగిన ఉన్న వ్యక్తి స్థిర మనస్తత్వం కలిగి ఉంటాడని భావిస్తుంటారు. కాబోయే జీవిత భాగస్వామి నమ్మకాన్ని పొందేందుకు అబద్ధాలను అస్త్రాలుగా ఉపయోగించొద్దు. సమయానికి కలవలేకపోయి నప్పుడు ఏదో సాకు చెప్పడంకన్నా కారణాన్ని సూటిగా తెలియజేయడమే మంచిది. అప్పుడే మీ పట్ల మీ లవర్‌కు విశ్వాసం ఏర్పడుతుంది. మీ వృత్తి గురించి, కటుంబ నేపథ్యం గురించి దాపరికం పనికి రాదు. అమ్మాయి దగ్గర గొప్పలు చెప్పొద్దు. ఇది మీ నైతిక విలువను పోగొట్టు తుంది. బంధం తెగడానికి అబద్ధాలు పదునైన కత్తి లా పనిచేస్తాయి. అవి నమ్మకాన్ని ముక్కలు ముక్కలుగా ఖండిస్తాయనే విషయాన్ని మరచిపోవద్దు. అలాగే మిమ్మల్ని మీ లవర్‌ నమ్మడమే సరిపోదు. మీరూ ఆమె/అతడిని నమ్మాలి. అప్పుడే ప్రేమ బంధం పునాదులు పటిష్టంగా ఉంటాయి. ఇద్దరి మధ్య ఏదైనా చర్చ జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ వాదనే నెగ్గాలనే పంతం మంచిది కాదు. ఇలాంటి పరిస్థితిలో మీరు నిజాన్ని ఆమోదిం చలేక పోతున్నారని స్పష్టమవుతుంది. ప్రేమను గెలిపించుకోవాలనే తపన ఇద్దరికీ ఉన్నప్పటికీ అబ్బాయిల విషయంలో అమ్మాయిలకు ఎక్కువ అంచనాలు ఉంటాయి. తమ ప్రేమను ఎలాగైనా అతడు గెలిపించుకుంటాడని అబ్బాయిని అమ్మాయి నమ్ముకుంటుంది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా దానిని నిలబెట్టు కోవాలి. స్నేహబంధానికీ కీలకమే... పది కాలాలపాటు స్నేహం పదిలంగా ఉండాలన్నా నమ్మకమే కీలకం. స్నేహంలో అవతలివారి భావాలను ఎంతమేరకు పట్టించుకుంటున్నా మన్నదే ముఖ్యం. అప్పుడే చెలిమి శాశ్వతంగా ఉంటుంది. స్నేహమంటే సరదాలూ షికార్లే కాదు.. అభిప్రాయాలు, అభిరుచులూ కలవడం కూడా. అంతకు మించి ఒకరికొకరు కష్టంలోనూ సాయపడటం... ఒకరి మీద ఒకరు నమ్మకం కలిగి ఉండటం. ఒకవేళ మీ స్నేహంలో అవి లోపిస్తే కారణమేమిటో ఒక్కసారి పరిశీలించు కోండి. మీలోనే ఏదైనా లోపం ఉందనుకుంటే దాన్ని సరిచేసుకోండి. అవతలివారిలో మార్చు కోవాల్సిన అంశాలు ఏవైనా ఉన్నప్పుడు ఫ్రెండ్‌గా మీ వంతు ప్రయత్నించండి. స్నేహంలో రహస్యాలు పంచుకుంటుంటారు. మనసు విప్పి మాట్లాడుకుంటుంటారు. ఎవరి మధ్య ఈ చర్చలు సాగాయో అవి అక్కడే ఉండిపోతే బాగుంటుంది. అలాకాకుండా సరదాగైనా కోపంతోనైనా వాటిని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయడం మంచిదికాదు. వాటిని ఏ పరిస్థి తుల్లోనూ మూడో వ్యక్తితో పంచుకోకపో వడమే మంచిది. మీ ఆలోచనలూ, అభిప్రాయాల్ని ఎదుటి వారి మీద రుద్దే ప్రయత్నం చేయొద్దు.అవతలివారి ఇష్టా యిష్టాలనూ గమనిం చండి... గౌరవిం చండి. వారు తమకు ప్రత్యేకం అనుకున్న వస్తు వులను మీరు ఇష్టారాజ్యంగా వాడుకో వద్దు. వ్యక్తిగత విషయాల్లో చొరబడి చేసే వ్యాఖ్యలూ, హాస్యం అవతలివారిని ఇబ్బంది పెడతాయి. ఒకవేళ అలాంటి తప్పు చేస్తే క్షమించమని అడగడానికి వెనకాడకండి. అప్పుడే మీ స్నేహం కలకాలం నిలుస్తుంది.

No comments:

Post a Comment