సివిల్స్: స్మార్ట్ స్టడీ...!

సివిల్స్‌లో మొదటి అంకం ప్రిలిమ్స్‌కు సమయం దగ్గరపడుతోంది. గడువు రెండు నెలలకు పైగా ఉంది. సివిల్స్ అనే సుదీర్ఘ ప్రక్రియలో ప్రిలిమ్స్ తొలి అడుగు. ఇది దాటితేనే తదుపరి కార్యాచరణకు అవకాశం ఉంటుంది. అయితే, ప్రిలిమ్స్‌కు సంబంధించి కవర్ చేయాల్సిన అంశాలు ఇంకా ఉండవచ్చు. రివిజన, ప్రాక్టీసింగ్ కూడా ఉండొచ్చు. పరీక్ష దగ్గర పడుతోందంటే కొందరికి ఏదో తెలియని ఆందోళన పెరుగుతూ ఉంటుంది. ప్రిలిమ్స్ పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష. మొత్తం ప్రక్రియలో దీనికి వెయిటేజ్ ఏమీ ఉండదు. అయినప్పటికీ దీన్ని క్లియర్ చేస్తేనే తదుపరి దశలకు హాజరయ్యే అవకాశం కలుగుతుందన్నది విస్మరించరాని విషయం.
ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా రిపీటర్లతో పాటు కొత్తగా ప్రిలిమ్స్‌కు హాజరయ్యే అభ్యర్థులూ ఉంటారు. ప్రిలిమ్స్ పరీక్షను గతంలో క్లియర్ చేసిన వాళ్ళకు సైతం సవాలు విసిరే విధంగానే ప్రిలిమ్స్ ఎప్పుడూ ఉంటుందన్నది సుస్పష్టం. అలాగే ఈ పరీక్ష స్వరూప, స్వభావాలపై పూర్తి అవగాహన ఉన్న అభ్యర్థులకు ప్రిలిమ్స్ నల్లేరుపై బండి నడకే. ఆ ధర్మసూక్ష్మం తెలియని వారికి మాత్రం బలమైన తరంగాలను ఎదర్కోవడంగానే ప్రిలిమ్స్‌ను భావించాల్సి ఉంటుంది.
మార్పులు, చేర్పులతో ప్రిలిమ్స్ సులువుగా, అభ్యర్థుల మధ్య సమానత్వాన్ని తీసుకువచ్చేదిగా మారిందనటంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి పేపర్‌లో వచ్చిన మార్కులు ఆధారంగానే మెయిన్సకు అర్హులను తేలుస్తున్నారు. రెండో పేపర్ (సీశాట్)ను కేవలం అర్హత కలిగినదిగా మార్చారు. అందులో 33 శాతం మార్కులు తెచ్చుకుంటేనే, మొదటి పేపర్‌ని దిద్దుతారు. అందువల్ల ఈ పేపర్లలో ప్రవేశపెట్టిన విధానపరమైన మార్పులకు అనుగుణంగా ప్రిపేరైతే విజయానికి చేరువ కావచ్చు. ఈ విషయంలో ఒత్తిడి తప్పకుండా ఉంటుంది. యావత్తు సిలబస్ కవర్ చేయాలి. ప్రిపేరైనదంతా పదేపదే రివిజన చేసుకోవాలి. ఇదంతా జరగాలంటే టైమ్, సమయపరంగా పక్కా ప్రణాళిక ఉండాలి.
స్టడీ అప్రోచ్
రానున్న రెండు నెలల్లో అనుసరించేం దుకు కింద ఇచ్చిన కొన్ని టిప్స్ ఉప కరిస్తాయి.
+ కొత్తగా అను కున్నవి, ముఖ్యమైనవి, ఇప్పటికీ పెండింగ్‌లో పెట్టుకున్నవన్నీ చదవడాన్ని వచ్చే నెలాఖరులోగా పూర్తి చేసేయాలి. అన్నింటినీ ఒక దరి చేర్చుకోడానికి, సారాంశం గ్రహించి రివైజ్ చేసుకోవడానికి చివరి నెల రోజులను ఉపయోగించు కోవాలి.
+ ఆసక్తిగా, సులువుగా అనిపించిన సబ్జెక్టుల్లో పూర్తి స్థాయిలో ప్రిపరేషన సాగించాలి. ఎలాంటి తడబాటు లేని విధంగా ఆ ప్రిపరేషన ఉండాలి. ఒకటి రెండు సబ్జెక్టులు కొద్దిగా వైవిధ్య భరితంగానో, ఇబ్బందికరంగానో ఉండవచ్చు. కావాలనుకుంటే వాటిని పక్కన పేట్టేయవచ్చు. జనరల్ స్టడీస్‌లో కటాఫ్ 50 నుంచి 55 శాతం మధ్య ఉంటోంది. అందువల్ల ఒకట్రెండు సబ్జెక్టులను పక్కన పెట్టేసినా ఇబ్బంది కలుగదు. ఆ మేరకు ఫ్లెక్సిబిలిటీ అభ్యర్థులకు ఉంది.
+ సీశాట్‌గా ఇప్పటికీ భావించే రెండో పేపర్‌లో కాంప్రహెన్షన్స తరచుగా సులువుగా వస్తున్నాయి. చదవడానికి వాటికి కొద్దిగా సమయం కేటాయించుకోవాలి. పేరాగ్రాఫ్‌ను జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుంటే ఆయా లైన్లలోనే కొన్ని జవాబులు కనిపిస్తాయి. ఇంగ్లీష్ పేరాగ్రాఫ్‌లు కూడా చాలా చిన్నగానే ఉంటాయి. ఎవరైనా సరే కొద్దిగా ట్రై చేసి సాల్వ్ చేయవచ్చు. ఇలా 20 నుంచి 22 ప్రశ్నల పనిపట్టవచ్చు. అలాగే పాతిక శాతం మేర పోర్షన కూడా కవర్ అవుతుంది. మిగతావాటిలో అంటే లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, డెషిషన మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, మెంటల్ ఎబిలిటీ నుంచి నుంచి ఏవైనా ఎంచుకోవచ్చు. నెగెటివ్ మార్కింగ్ జోలికి పోకుండా జాగ్రత్తగా, పద్ధతిగా ఎంపిక చేసుకున్న ప్రశ్నలను మాత్రమే అటెంప్ట్ చేసి 33 శాతం మార్కులను సులువుగా తెచ్చుకోవచ్చు. సేఫ్ జోనలో ఉంటూ రెండో పేపర్లో గట్టెక్కేలా చూసుకోవాలి.
+ పాత ప్రశ్నపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. సాధారణంగా రిపీట్ అవుతున్న ప్రశ్నలు ఏవి అన్నది తెలుసుకోవాలి. ఆ విశ్లేషణకు అనుగుణంగా ప్రిపరేషన కొనసాగించాలి. అది పరీక్ష దగ్గరకు తీసుకువెళ్ళేలా చేసుకుంటే చాలు, లాస్ట్ మినిట్ ప్రిపరేషన పక్కాగా జరిగినట్లే. జాగ్రత్తగా పరిశీలిస్తే, జాగ్రఫీలో మ్యాప్ ఆధారిత, ఎకానమీలో కాన్సెప్ట్‌పై బలమైన పట్టు ప్రాతిపదికగా ప్రశ్నలు అడుగుతున్నారు.
+ కరెంట్ అఫైర్స్‌కు ఇస్తున్న వెయిటేజ్ రాన్రాను పెరుగుతోంది. అందువల్ల ప్రిపరేషన పూర్తి స్థాయిలో ఉండాలి. కేంద్ర ప్రభు త్వానికి సంబంధించి ముఖ్యమైన విధానాలు, కార్యక్రమాలపై ప్రాథమిక అవగాహన స్పష్టంగా ఉండాలి. డిజిటల్ ఇండియా, మేక్ ఇన ఇండియా, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి ప్రధాన కార్యక్రమాలను వివరంగా తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్ మెటీరియల్ విస్తృతంగా ఉంటుంది. అందువల్ల పుస్తకాలు, ప్రింటెడ్ మెటీరియల్ అని మాటిమాటికి షిప్ట్ అవకూడదు. మొదటి నుంచీ ఏదో ఒకటి మంచిది ఎంపిక చేసుకుని ఫాలో అవ్వాలి. అదే పదే పదే రివిజన చేసుకోండి. దానికే కొత్తగా గ్రహించినవి కలుపుకోండి. అప్పుడు పద్ధతి దెబ్బ తినదు.
+ పరీక్ష గదిలో టైమ్ మేనేజ్‌మెంట్ కీలకమైన అంశం. ప్రశ్నలను కూడా మనం సులువు, మీడియం, కష్టం, బాగా కష్టం అని విభజించుకుంటూ ఉంటాం. పరీక్ష హాల్లో ఈ విషయంలో మంచి అప్రోచతో ముందుకు వెళ్ళాలి. మొదట రెం డూ అంటే సులువు, మీడియంగా ఉండే ప్రశ్నలకు సమాధానం గుర్తించాలి. తప్పులను బాగా తగ్గించగలగాలి. తదుపరి కష్టంగా, బాగా కష్టంగా ఉన్న ప్రశ్నల వైపు దృష్టి సారించాలి. ఇక్కడే మినిమమ్ కటాఫ్ 33 శాతం మార్కులు రెండో పేపర్‌లో సాధించుకునేలా మన వ్యూహానికి పదును పెట్టుకోవాలి. గెస్సింగ్‌ను పూర్తిగా మానుకోగలిగితే నెగెటివ్ మార్కింగ్‌కు ఆస్కారం బాగా తగ్గుతుంది. ఫలితంగా ఎక్కువ స్కోరింగ్ రాబట్టవచ్చు.
తేలికగా, ప్రభావశీలంగా ఉండే వ్యూహం అనుసరించడం ఈ పరీక్షకు చాలా అవసరం. అంచెలంచెలుగా ఏడాది పాటు సాగే జర్నీ అప్పుడే బాగుంటుంది. మొత్తంగా ప్రిపేరవుతున్నప్పుడు ముందస్తు వ్యూహం తప్పనిసరి. స్మార్ట్ స్ర్టాటజీలో భాగంగా లోతుగా, ప్రతీది వివరంగా పట్టించుకోవాలి. సమగ్ర రివిజనకు తద్వారా ఎగ్జామ్ ఓరియెంట్‌డ్ అప్రోచకు పట్టంగట్టుకోవాలి. నేను చేయగలను అన్న నమ్మకాన్ని, ధోరణిని పెంచుకుంటే విజయం తథ్యం.

No comments:
Post a Comment