- 1051 పోస్టులతో గ్రూప్-3 నోటిఫికేషన్
- పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ప్రకటన
- 27 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
- ఆఫ్‌లైన్‌లో స్ర్కీనింగ్.. ఆన్‌లైన్‌లో ప్రధాన పరీక్ష
- ఏప్రిల్ 21న స్ర్కీనింగ్.. ఆగస్టు 2న మెయిన్స్
- వయో పరిమితి 42 ఏళ్లుగా నిర్ధారణ
- ‘ఎక్స్‌టెన్షన్’ పోస్టులకూ నోటిఫికేషన్
- 109 పోస్టులకు ఏపీపీఎస్‌సీ ప్రకటన జారీ
- 28 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తులు
- ఏప్రిల్ 25న మెయిన్స్ పరీక్ష
అమరావతి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో మరోసారి పంచాయతీ కొలువుల భర్తీ ప్రారంభమైంది. అభ్యర్థులు కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్న గ్రూప్-3 నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ శుక్రవారం విడుదలచేసింది. ఏపీ పంచాయతీ రాజ్ సబార్డినేట్ సర్వీ్‌సలో 1051 పంచాయతీ సెక్రెటరీ(గ్రేడ్-4) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌జ్ట్టిఞ://ఞటఛి.్చఞ.జౌఠి.జీుఽలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 27 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తు గడువు ఉంటుంది. పరీక్ష ఫీజును మాత్రం జనవరి 18 రాత్రి 11.59లోపు చెల్లించాలి. 2018 జూలై 1 నాటికి 18 ఏళ్లు పూర్తయి 42 ఏళ్లకు మించని అభ్యర్థులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు మరో 5 ఏళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు మరో 10 ఏళ్ల వయో పరిమితి సడలింపు ఉంటుంది. కొత్తగా ఏర్పడిన 1000 పోస్టులతోపాటు క్యారీ ఫార్వర్డ్ అయిన 51 పోస్టులను భర్తీచేయనున్నారు.
దరఖాస్తుల సంఖ్య 25 వేలకు మించితే ఏప్రిల్ 21న స్ర్కీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆగస్టు 2న మెయిన్స్ నిర్వహిస్తారు. పరీక్షలు ఆబ్జెక్టివ్ టైపులోనే నిర్వహిస్తారు. ఆఫ్‌లైన్‌లో నిర్వహించే స్ర్కీనింగ్ టెస్ట్‌లో 150 ప్రశ్నలు, ఆన్‌లైన్‌లో నిర్వహించే మెయిన్స్‌లో 300 ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కింద రూ.250, పరీక్ష ఫీజు కింద రూ.80 చెల్లించాలి. రాత పరీక్షల్లో నెగిటివ్ మార్కుల విధానం అమలు చేస్తారు.
జిల్లాల వారీగా పోస్టులు
శ్రీకాకుళం-114, విజయనగరం-120, విశాఖపట్నం-107, తూర్పుగోదావరి-104, పశ్చిమగోదావరి-25, కృష్ణా-22, గుంటూరు-50, ప్రకాశం-172, నెల్లూరు-63, చిత్తూరు-141, అనంతపురం-41, కర్నూలు-90, కడప-2
No comments:
Post a Comment