65వ జాతీయ చలన చిత్ర
అవార్డులు
జాతీయ
స్థాయిలో సినిమా రంగానికిచ్చే ‘జాతీయ చలన చిత్ర
అవార్డుల’ను
ఏప్రిల్ 13న
ప్రకటించారు.
ఈ అవార్డుల్లో
బాహుబలి-2, ఘాజీ చిత్రాలు టాప్
అవార్డులను దక్కించుకున్నాయి. ఇటీవల మరణించిన నటి
శ్రీదేవికి ఉత్తమ నటి అవార్డు
రాగా, అస్సామీ చిత్రం విలేజ్ రాక్స్టార్స్ ఉత్తమ
చిత్రంగా నిలిచింది. ఈ మేరకు న్యూఢిల్లీలో
జరిగిన కార్యక్రమంలో అవార్డుల జ్యూరీ కమిటీ అధ్యక్షుడు, బాలీవుడ్
దర్శకుడు శేఖర్ కపూర్ 65వ
జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించారు. 2017లో దేశవ్యాప్తంగా విడుదలైన
అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులను ప్రకటించారు.
అవార్డులు
– విజేతలు
దాదా
సాహెబ్ ఫాల్కే అవార్డ్ - వినోద్ ఖన్నా
ఉత్తమ
చిత్రం - విలేజ్ రాక్స్టార్స్ (అస్సామీ)
జాతీయ
ఉత్తమ నటి - శ్రీదేవీ (మామ్)
జాతీయ
ఉత్తమ నటుడు - రిద్ధీసేన్(నగర కీర్తన్-బెంగాలీ)
ఉత్తమ
దర్శకుడు - జయరాజ్ (భయానకమ్)
ఉత్తమ
పోరాట సన్నివేశ చిత్రం - బాహుబలి2
ఉత్తమ
స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు - బాహుబలి2
ఉత్తమ
ప్రజాదరణ పొందిన చిత్రం - బాహుబలి2
ఉత్తమ
నృత్య దర్శకుడు - గణేష్ ఆచార్య (టాయిలెట్
ఏక్ ప్రేమ్కథ)
ఉత్తమ
సంగీత దర్శకుడు - ఎఆర్ రెహ్మాన్ (కాట్రు
వెలియదై)
ఉత్తమ
నేపథ్య సంగీతం - ఎఆర్ రెహ్మాన్ (మామ్)
ఉత్తమ
గాయకుడు - జె. ఏసుదాసు
ఉత్తమ
గాయని - షా షా తిరుపతి
(కాట్రు వెలియదైలోని వాన్ వరువన్)
ఉత్తమ
సహాయనటుడు - ఫహాద్ ఫాసిల్ (తొండిముత్తలం
ద్రిసాక్షియుం)
ఉత్తమ
సహాయనటి - దివ్యాదత్ (ఇరాదా)
ఉత్తమ
బాలనటి - బనితా దాస్(విలేజ్
రాక్ స్టార్స్)
ఉత్తమ
షార్ట్ఫిల్మ్(ఫిక్షన్) - మయ్యత్ (మరాఠీ)
బెస్ట్
నాన్ ఫీచర్ ఫిల్మ్ - వాటర్
బేబీ
బెస్ట్
ఫిల్మ్స్ ఆన్ సోషల్ ఇష్యూస్
- అయామ్ బొనే, వెల్ డన్
బెస్ట్
అడాప్టెడ్ స్క్రీన్ ప్లే - భయానకం(మలయాళం)
బెస్ట్
ప్రొడక్షన్ డిజైన్ - టేకాఫ్ (మలయాళం)
హిందీ
ఉత్తమ చిత్రం - న్యూటన్
ఉత్తమ
తెలుగు చిత్రం - ఘాజీ
ఉత్తమ
తమిళ చిత్రం - టు లెట్
ఉత్తమ
మరాఠీ చిత్రం - కచ్చా నింబూ
ఉత్తమ
కన్నడ చిత్రం - హెబ్బెట్టు రామక్క
ఉత్తమ
బెంగాలీ చిత్రం - మయురాక్షి
నర్గీస్
దత్ అవార్డు (జాతీయ సమైక్యతా చిత్రం)
- దప్పా(మరాఠీ)
No comments:
Post a Comment