Tuesday, October 23, 2018

Political : 'పంజరంలో చిలక' సీబీఐ అవినీతి కేసులో అలోక్ వర్మ వర్సెస్ రాకేష్ ఆస్థానా


'పంజరంలో చిలక' సీబీఐ అవినీతి కేసులో అలోక్ వర్మ వర్సెస్ రాకేష్ ఆస్థానా

సీబీఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అవినీతికి వ్యతిరేకంగా విచారణ జరిపే భారత ప్రభుత్వ అతిపెద్ద ఏజెన్సీ. కేంద్రంలో ఎవరి ప్రభుత్వం ఉంటే, వారి రాజకీయ ఆయుధంగా మారుతుందని సీబీఐకి ఒక ఇమేజ్ ఏర్పడింది.
సుప్రీంకోర్టు కూడా ఈ ఏజెన్సీ 'ఏస్ మ్యాన్' ఇమేజ్‌పై ముద్ర వేస్తూ దీనిని 'పంజరంలో చిలక'గా వర్ణించింది. ఇప్పుడు ఇంటి గుట్టు రట్టవడంతో ఈ రాజకీయ ఆయుధం పీకల్లోతు వివాదాల్లో చిక్కుకుంది.
సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ అస్థానాల విషయంలో ఎన్ని అనుమానాలు వస్తున్నాయంటే.. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వమే సందిగ్ధంలో పడిపోయింది.
సీబీఐ తన భవనంలోనే తనిఖీలు చేస్తోంది. పత్రాలు తారుమారు చేశారనే ఆరోపణలతో డీఎస్పీ దేవేంద్ర కుమార్‌ను అరెస్ట్ చేసింది. వీటిలో సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ అస్థానా లంచం తీసుకున్న ఆరోపణలకు సంబంధించినవి ఉన్నాయి.
విశ్వసనీయ వర్గాలు చెబుతున్నదాని ప్రకారం అక్టోబర్ 21వ తేదీ ఆదివారం సాయంత్రం ప్రధాని మోదీతో అలోక్ వర్మ భేటీ అయ్యారు. ఆయన మొత్తం విషయంపై చర్చించారు.
అనంతరం అదే రోజు సాయంత్రం భారత నిఘా సంస్థ 'రీసర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్(ఆర్‌ఏడబ్ల్యూ-రా)' చీఫ్ అనిల్ ధస్మానాతో కూడా ప్రధాని ప్రత్యేకంగా సమావేశమైనట్టు తెలుస్తోంది.
అస్థానా అవినీతి కేసు ఎఫ్‌ఐఆర్‌లో రా స్పెషల్ డైరెక్టర్ సామంత్ కుమార్ గోయల్‌ పేరు కూడా ఉంది. అయితే ఈ కేసులో ఆయన నిందితుడు కాదు.

కేసులు
అస్థానా నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) ఏర్పాటు చేశారు. అది మొయిన్ ఖురేషీ కేసును దర్యాప్తు చేసింది.
దేవేంద్ర కుమార్ ఇదే ఎస్ఐటీలో దర్యాప్తు అధికారిగా పనిచేస్తున్నారు. దేవేంద్ర కుమార్‌ను సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు అరెస్టు చేశారు. అంతకుముందు శుక్రవారం సీబీఐ భవనంలో దేవేంద్ర కుమార్ ఆఫీసులో తనిఖీలు నిర్వహించారు.
సీబీఐ మంగళవారం నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో దేవేంద్ర కుమార్ రెండో నిందితుడిగా ఉన్నారు. ఒకటో నిందితుడుగా అస్థానా ఉన్నారు.
సీబీఐ సోర్సెస్ ప్రకారం భారత మీడియాలో ప్రచురించిన వార్తలను బట్టి దేవేంద్ర కుమార్‌ను విచారణకు సంబంధించిన రికార్డులను ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై అరెస్టు చేశారు.
దేవేంద్ర కుమార్ ఈ కేసులో సాన సతీష్ బాబు తరఫున కల్పిత వాంగ్మూలం సృష్టించారని, సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై అస్థానా ఆరోపణలకు బలం చేకూర్చేందుకే అలా చేశారని ఆరోపిస్తున్నారు.
ఎఫ్ఐఆర్‌ను బట్టి వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో సాన సతీష్ బాబు ఒక సాక్షి. సీబీఐ సిట్ దర్యాప్తు నుంచి సతీష్ బాబుకు విముక్తి కల్పించడానికి అస్థానా లంచం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక సోర్సుల ప్రకారం సతీష్ కల్పిత వాంగ్మూలాన్ని సీఆర్పీసీ సెక్షన్ 161 కింద రూపొందించారు. ఈ వాంగ్మూలం సెప్టంబర్ 26న దిల్లీలో రికార్డ్ చేశారని తెలిపారు.

ప్రశ్నలు
అయితే, సీబీఐ విచారణ అధికారులకు చెందిన వర్గాల ప్రకారం సెప్టంబర్ 26న సతీష్ బాబు దిల్లీలోనే లేరు. ఆయన హైదరాబాద్‌లోనే ఉన్నారు. అక్టోబర్ 1 నుంచి ఆయన ఈ విచారణకు హాజరయ్యారని వారు చెబుతున్నారు.
సీబీఐ కల్పితం అని చెబుతున్న ఈ వాంగ్మూలాన్ని బట్టి సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మతో తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడిన తర్వాత కేసును మూసి వేయాలని సిట్‌తో అలోక్ వర్మ చెప్పారు.
ఈ కల్పిత వాంగ్మూలంపై దర్యాప్తు అధికారిగా దేవేంద్ర కుమార్ సంతకం ఉంది. నమోదైన వాంగ్మూలం ప్రశ్న-జవాబు ఫార్మాట్లో లేదు. సతీష్‌ను ఒక ప్రశ్న అడిగారు. 'మీరు మీపై దర్యాప్తు పూర్తైందని చెప్పిన తర్వాత కూడా సీబీఐ మిమ్మల్ని ప్రశ్నించడానికి సమన్లు ఎందుకు పంపింది.?'
ఈ ప్రశ్నకు సమాధానంగా సతీష్ "2018 జూన్లో నేను, నా స్నేహితుడైన టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్‌తో దీని గురించి మాట్లాడాను. ఆయన సంబంధిత డైరెక్టర్‌తో మాట్లాడతానని నాకు మాట ఇచ్చారు. నేను సీఎం రమేష్‌ను తరచూ కలుస్తూ వచ్చాను. ఒక రోజు ఈ కేసు గురించి సీబీఐ డైరెక్టర్‌ను కలిశానని రమేష్ చెప్పారు. నన్ను సీబీఐ ఇంకోసారి పిలవదని కూడా ఆయన నాకు చెప్పారు. జూన్ తర్వాత నుంచి నన్ను సీబీఐ పిలవలేదు. అందుకే నాపై సీబీఐ దర్యాప్తు పూర్తైందని ఉండిపోయా" అన్నారు.
దీని గురించి ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన సీఎం రమేష్ "నా జీవితంలో నేనెప్పుడూ సీబీఐలోని ఒక్క పోలీసును కూడా కలవలేదు. ఇదంతా కల్పితం. నా ఇమేజ్ పాడు చేయడానికి జరుగుతున్న కుట్ర. మా పార్టీ ఎన్డీయేలో భాగం కాదనే ఇదంతా చేస్తున్నారు. ఇప్పుడు సీబీఐ కూడా సతీష్ వాంగ్మూలం కల్పితం అంటోంది" అన్నారు.
అక్టోబర్ 19న అస్థానా కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ)కి ఒక లేఖ రాశారు. ఈ లేఖలో "సానా సతీష్ బాబు సీఎం రమేష్‌ను సంప్రదించారు. రమేష్ అలోక్ వర్మను ప్రైవేటుగా కలిశారు. మళ్లీ పిలిపించడం ఉండదని సతీష్‌కు సీబీఐ తరఫున హామీ ఇప్పించారు'' అని రాశారు.

లంచం
ఎఫ్ఐఆర్లో దుబయ్ పారిశ్రామిక వేత్త మనోజ్ ప్రసాద్ పేరు వచ్చినపుడు అస్థానా రాసిన ఈ లేఖ విషయం బయటికి వచ్చింది. ఆస్థానా కోసం లంచాలు తీసుకుంటున్నాడని మనోజ్‌పై ఆరోపణలున్నాయి. మనోజ్‌ను మంగళవారం ఉదయం దిల్లీ పోలీసులు విమానాశ్రయంలో అరెస్టు చేశారు. మనోజ్ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
అస్థానా, కుమార్ కాకుండా సీబీఐ ఎఫ్ఐఆర్ నంబర్ 13A/2018లో మనోజ్ ప్రసాద్, సోమేశ్వర్ ప్రసాద్ పేర్లను కూడా నిందితులుగా చేర్చింది. ఎఫ్ఐఆర్లో 2017 డిసెంబర్లో 2018 అక్టోబర్ మధ్య లంచం తీసుకున్నారని చెప్పారు.
సతీశ్ వాంగ్మూలం ప్రకారం లంచం ఐదు సార్లకు పైగా ఇచ్చారు. ఒక కోటి రూపాయలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కరెన్సీ దిర్హంలో దుబయ్‌లో 2017 డిసెంబర్ 10న ఇచ్చారు. మూడు రోజుల తర్వాత రూ.1.95 కోట్ల లంచం దిల్లీలో ఇచ్చారు. అక్టోబర్ 10న 25 లక్షల రూపాయలు లంచంగా ఇచ్చారు.
సీబీఐ దర్యాప్తులో సతీశ్‌కు 2017 అక్టోబర్-నవంబర్ మధ్య నాలుగుసార్లు సమన్లు పంపారని తేలింది. ఐదు కోట్ల రూపాయల లంచంలో రూ. 2.95 కోట్లు ఇచ్చిన తర్వాత సతీశ్‌కు సమన్లు వెళ్లలేదు.
సతీశ్ ఫిబ్రవరిలో మనోజ్ ప్రసాద్‌ను కలవడానికి దుబయ్ వెళ్లడంతో.. సమన్లు ఆపేశారు. ఒకరోజు ముందే సమన్లు జారీ చేసినప్పుడు ఇలా జరిగిందని చెబుతున్నారు. తర్వాత సతీశ్‌పై లుకవుట్ నోటీస్ కూడా జారీ చేశారు. విదేశాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు.

సీబీఐలో గొడవ పడుతున్న ఈ ఇద్దరు అధికారులు ఎవరు?
అలోక్ వర్మ సీబీఐ చీఫ్. రాకేశ్ ఆస్థానా రెండో స్థానంలో ఉన్న అధికారి. ప్రస్తుత ఆరోపణలు, ప్రత్యారోపణలను వదిలేస్తే ఇద్దరి కెరీర్లో వేరే ఎలాంటి వివాదాలూ లేవు. వర్మ 22 ఏళ్ల వయసులోనే ఐపీఎస్ అయ్యారు.
వర్మ తన బ్యాచ్‌లో అందరికంటే చిన్నవారు. సీబీఐ డైరెక్టర్ కాక ముందు ఆయన దిల్లీ పోలీస్ కమిషనర్, దిల్లీ జైళ్ల డీజీపీ, మిజోరాం డీజీపీ, పుదుచ్చేరి డీజీపీ, అండమాన్-నికోబార్ ఐజీగా ఉన్నారు. సీబీఐలో ఎలాంటి అనుభవం లేకున్నా దానికి డైరెక్టర్ అయిన మొదటి వ్యక్తి అలోక్ వర్మ.
రాకేష్ అస్థానా గుజరాత్ కేడర్‌కు చెందిన 1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన చాలా కీలక కేసులు దర్యాప్తు చేశారు. వీటిలో దాణా కుంభకోణం కేసు కూడా ఉంది. గోద్రాలో రైలు దహనం కేసును కూడా అస్థానానే దర్యాప్తు చేశారు.
ప్రధాని మోదీకి అస్థానా కొత్త ముఖం కాదు. గుజరాత్‌లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అస్థానాకు మోదీ ఎన్నో బాధ్యతలు అప్పగించారు.

No comments:

Post a Comment