Apply through click here to apply
అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ఆంధ్రప్రదేశ్ పభుత్వం జూన్ 10 నుంచి నిర్వహించనుంది.
| ||||||||||||||||||||||||||
ఆగస్టులో డీఎస్సీ నియామక పరీక్షలకు వీలుగా నోటిఫికేషన్, ఇతర ప్రక్రియలను ప్రారంభించనుంది. టెట్, డీఎస్సీల నిర్వహణపై ఉన్నతాధికారులతో మంత్రి గంటా శ్రీనివాసరావు ఏప్రిల్ 23న సచివాలయంలో సమీక్షించారు. ఆగస్టులో డీఎస్సీ పరీక్షలు పెట్టి త్వరగా నియామకాలు చేసేలా షెడ్యూల్‌ను రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ఖాళీ పోస్టుల భర్తీపై వ్యాజ్యానికి సంబంధించి ఏపీ నుంచి 9,259 పోస్టులు ఖాళీ ఉన్నట్లు సుప్రీంకోర్టుకు గతంలో అఫిడవిట్ సమర్పించామని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ మంత్రికి వివరించారు. డీఎస్సీ పోస్టుల సంఖ్యపై సీఎం అనుమతి తీసుకోవలసి ఉన్నందున ఏప్రిల్ 23 రాత్రి గంటా సీఎం చంద్రబాబును కలిశారు. ఆగస్టులో డీఎస్సీ నిర్వహించనున్నామని, 10 వేల పోస్టులకు పైగానే ఉంటాయని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఎస్జీటీ అభ్యర్థులకు పేపర్-1, స్కూల్ అసిస్టెంటు పోస్టులకు పేపర్-2, పండిట్లు, భాషోపాధ్యాయులకు పేపర్-3, పీఈటీలకు పేపర్-4 పెడతామని వివరించారు. ఆన్లైన్లో ఈ పరీక్షలు జరుగుతాయని, పీఈటీలకు సంబంధించి సిలబస్‌ను ప్రత్యేకంగా ప్రకటిస్తామన్నారు.
పరీక్షలు ఆన్లైన్లో రెండు పూటలా నిర్వహిస్తారు. https://cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. టెట్ షెడ్యూల్ ఇదే..
పరీక్షల షెడ్యూల్..
|
No comments:
Post a Comment