Tuesday, July 30, 2019

AP GRAMA SACHIVALAY JOBS : గ్రామ, వార్డు సచివాలయాల్లో80% ఉద్యోగాలు స్థానికులకే...

గ్రామ, వార్డు సచివాలయాల్లో80% ఉద్యోగాలు స్థానికులకే...

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో భర్తీ చేయనున్న 1,26,728 ఉద్యోగాల్లో 80 శాతం పోస్టులను స్థానికులకే కేటాయిస్తారు.
మిగిలిన 20 శాతం పోస్టులను ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. జిల్లాను యూనిట్‌గా తీసుకుని అభ్యర్థుల స్థానికతను గుర్తిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏడేళ్ల కాలంలో నాలుగేళ్లపాటు ఏ జిల్లాలో చదువుకుంటారో సదరు అభ్యర్థిని స్థానిక కేటగిరీగా గుర్తిస్తారు. ఆ జిల్లాకు కేటాయించిన మొత్తం పోస్టుల్లో 80 శాతం వారితోనే భర్తీ చేస్తారు. ఒక జిల్లాలో ఎక్కువ కాలం చదివి.. వేరే జిల్లాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే ఓపెన్ కేటగిరీలో 20 శాతం మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఈ విషయాలను స్పష్టంగా పేర్కొంది.  

 వయో పరిమితి.. జీతం ఇలా... గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితి 18నుంచి 42 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గరిష్ట వయో పరిమితిలో ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్ల సడలింపు అమలు చేస్తారు. సంబంధిత ఉద్యోగంలో ఇప్పటికే ఔట్ సోర్సింగ్‌లో పని చేస్తున్న వారికి వయో పరిమితిలో వారి సర్వీసు కాలానికి సడలింపు ఇస్తారు. గరిష్ట వయో పరిమితిలో అత్యధికంగా ఐదేళ్ల సడలింపు ఇస్తారు. జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో జరిగే రాత పరీక్ష  అనంతరం ఎంపికయ్యే అభ్యర్థికి మొదటి రెండేళ్లు రూ.15 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించి, ఆ తర్వాత పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగి హోదా కల్పిస్తూ బేసిక్ శాలరీ అమలు చేస్తారు. పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులకు రూ.15,030 నుంచి రూ.46,060 మధ్య బేసిక్ శాలరీ నిర్ణయించగా.. మిగిలిన పోస్టులకు రూ.14,600 నుంచి రూ.44,870 మధ్య బేసిక్ శాలరీగా అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు.  
 
 దరఖాస్తు విధానం : 
 గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం మూడు వెబ్ పోర్టల్స్‌ను ఏర్పాటు చేసింది. ఏ వెబ్ పోర్టల్‌ను ఓపెన్ చేసినా.. ఒకే తీరున మొత్తం ఐదు విభాగాలతో కూడిన స్క్రీన్ కనిపిస్తుంది. మొదట నోటిఫికేషన్ అన్న విభాగం ఉంటుంది. దానికి కింద క్లిక్ చేస్తే.. భర్తీ చేసే ఉద్యోగాల వారీగా వివరాలు ఉంటాయి. ఏ ఉద్యోగానికి సంబంధించిన పేరు మీద క్లిక్ చేస్తే.. ఆ ఉద్యోగానికి సంబంధించి జిల్లా వారీగా ఖాళీలు, విద్యార్హత, పరీక్ష విధానం వంటి సమగ్ర వివరాలు ఉంటాయి. వాటి ఆధారంగా అభ్యర్థి తనకు ఆసక్తి ఉన్న ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. స్టెప్-1లో పేర్కొన్న రెండో కాలంలో ఉన్న బటన్ క్లిక్ చేసి అభ్యర్థి పేరు, ఆధార్ వివరాలు లేదా ఇతర గుర్తింపు కార్డు వివరాలతోపాటు మొబైల్ నంబర్, ఫొటోను అప్‌లోడ్ చేస్తే సంబంధిత : 
 అభ్యర్థి ఫోన్ నంబర్‌కు అతని దరఖాస్తుకు సంబంధించి కేటాయించిన ఐడీ వివరాలు మెసేజ్ అందుతుంది. ఆ ఐడీ వివరాల ప్రకారమే అతడు ఆన్‌లైన్‌లో తన దరఖాస్తును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టెప్ -2 విభాగంలోని బటన్‌ను క్లిక్ చేస్తే.. అభ్యర్థి మొబైల్‌కు మెసేజ్ ద్వారా అందిన ఐడీ నంబర్ వివరాలు నమోదుకు బాక్స్‌లు ఉంటాయి. ఐడీ నంబర్ నమోదుతో పాటు తాను ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారనే వివరాలను అక్కడ నమోదు చేస్తే పూర్తి దరఖాస్తు ఫారం నమూనా ఓపెన్ అవుతుంది. తప్పులు లేకుండా దానిని నింపాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారం పూర్తి చేసినట్టు క్లిక్ బటన్ నొక్కే ముందువరకు తప్పులను సరిచేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తులో పేర్కొన్న వివరాలను మార్చడానికి వీలుండదు. నాల్గవ కాలమ్‌గా అభ్యర్థి దరఖాస్తుకు సంబంధించి చెల్లించాల్సిన ఫీజుల వివరాలు ఉంటాయి. అక్కడ బటన్ క్లిక్ చేసి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చివరన గ్రామ సచివాలయాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోల వివరాలు ఉన్నాయి. అభ్యర్థికి ఏమైనా సమాచారం కావాలంటే అక్కడ తెలుసుకోవచ్చు.
 
 పోస్టుల వారీగా పరీక్ష విధానం.. వివరాలు
 

 1. పంచాయతీ కార్యదర్శి :  ఖాళీలు: 7,040
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు) : జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (75)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): చరిత్ర, ఎకనామిక్స్, జాగ్రఫీ, పాలిటిక్స్ (75)  
 
 2. గ్రామ రెవెన్యూ ఆఫీసర్ (గ్రేడ్-2) :  ఖాళీలు: 2,880
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు)
 : జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (50) 
 పేపర్-2 సిలబస్ (మార్కులు): డ్రాయింగ్ అండ్ సర్వే (100) 
 
 3. ఏఎన్‌ఎం : 
 ఖాళీలు:
 13,540
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు)
 : జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (50)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు (100) 
 
 4. పశు సంవర్ధక శాఖ సహాయకుడు :
 ఖాళీలు:
 9,886
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు) : జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (50)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): పశు సంవర్ధక సబ్జెక్ట్‌పై (100) 
 
 5. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ : 
 ఖాళీలు:
 794
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు) : జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (50)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): ఫిషరీస్, ఆక్వాకల్చర్‌పై (100 ) 
 
 6. విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ : 
 ఖాళీలు:
 4,000
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు)
 : జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (50)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): హార్టీకల్చర్‌పై (100) 
 
 7. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ : ఖాళీలు:  6,714
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు) : జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (50)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): అగ్రికల్చర్ మీద (100)
 
 8. విలేజ్ సెరీకల్చర్ అసిస్టెంట్
 ఖాళీలు:
 400
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు
) : జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (50)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): సెరీకల్చర్ (100) 
 
 9. మహిళా పోలీస్ : 
 ఖాళీలు:
 14,944
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు) : జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (75)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): ఎకనమిక్స్, జాగ్రఫీ, చరిత్ర, పాలిటిక్స్, రాష్ట్ర సంబంధిత అంశాలపై (75) 
 
 10.  ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-2) :  ఖాళీలు:11,158
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు)
 : జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (50) 
 పేపర్-2 సిలబస్ (మార్కులు): సివిల్ లేదా మెకానికల్ సబ్జెక్టుపై (100)
 
 11. డిజిటల్ అసిస్టెంట్ : 
 ఖాళీలు:11
,158
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు) : జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ,చరిత్ర, ఎకనమిక్స్ (50)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌పై (100) 
 
 12. విలేజ్ సర్వేయర్: 
 ఖాళీలు :
 11,058
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు) :
  జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ,చరిత్ర, ఎకనమిక్స్ (50)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): సర్వే సబ్జెక్ట్ (100)  
  13. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్: : 
 ఖాళీలు :
 11,058
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు) :  జనరల్ ఇంగ్లిష్, కంప్యూటర్ పరిజ్ఞానం (75)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): చరిత్ర, ఎకనమిక్స్, విభజన తరువాత  రాష్ట్ర పరిస్ధితి, సంక్షేమ పథకాలు (75)
  14. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ :  ఖాళీలు : 3,307
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు) :  జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (75)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): చరిత్ర, ఎకనామిక్స్, జాగ్రఫీ, పాలిటిక్స్ (75)
 
 15. వార్డు ఎనిమిటీస్ సెక్రటరీ :  ఖాళీలు : 3,601
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు) :  జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (50)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): సివిల్ లేదా మెకానికల్ సబ్జెక్ట్‌పై (100) 
  16. వార్డు శానిటేషన్ సెక్రటరీ : 
 ఖాళీలు :
 3,648
 పరీక్ష విధానం :  
 పేపర్-1 సిలబస్ (మార్కులు) :  జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (50)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంట్ సైన్స్పై (100)
 
 17. వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ
 ఖాళీలు
 : 3,786
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు) :  జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ(50)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): విద్య, కంప్యూటర్, కమ్యూనికేషన్ సబ్జెక్ట్‌లు (100) 
  18. వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ : 
 ఖాళీలు :
 3,770
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు) :  జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (50)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): టౌన్‌ప్లానింగ్, మాస్టర్ ప్లాన్, అర్బన్ ఫారెస్ట్, సర్వే అండ్ బిల్డింగ్ ప్లాన్ సబ్జెక్టులపై (100)
 
 19. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ : 
 ఖాళీలు :
 3,786
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు) :  జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ(50)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): అంత్రోపాలజీ, సోషల్ వర్క్, ఎకనమిక్ ప్లానింగ్ తదితర సబ్జెక్టులపై (100) 

No comments:

Post a Comment