మాఊరి "రంగస్థలం "
" గ్రామాలే ఈ దేశానికీ పట్టుగొమ్మలు " "రైతేరాజు " "రైతే ఈ దేశానికి వెన్నుముక " స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండి రాజకీయ నాయకులు ఎక్కువగా వాడే డైలాగ్ లు ,అయినా ఇప్పటికీ 90 శాతం గ్రామాలు , రైతులు అభివృద్ధి ఫలాలకు దూరంగా ఉన్నారు . ప్రతి సంవత్సరం ప్రభుత్వం మెజారిటీ నిధులు గ్రామాలకు ,రైతు సంక్ష్మేమానికీ కేటాయిస్తున్నప్పటికి ప్రతి యేటా గ్రామాలు ఖాళీ అవుతున్నాయి ,రైతులు కాడిని వదిలేస్తున్నారు .
గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రధానమంత్రో ముఖ్యమంత్రో అనుకుంటే జరగదు , వాళ్లు నిధులు ఇవ్వచ్చోమో గాని వాటిని ఒక ప్రణాళికతో సద్వినియోగం చేసుకొనే ఒక బలమైన నిస్వార్థపరుడైన నాయకుడు ఉన్నపుడే ఆ గ్రామం సర్వతోముఖాభివృద్ధి జరుగుతుంది . అలాంటి మంచి నాయకుడిని ఎన్నుకొనే అవకాశం ప్రతి అయిదు సంవత్సరాలకి ఒక సారి వస్తుంది . రాజకీయ పార్టీలకు సంభంధం లేకుండా జరగాల్సిన ఎన్నికలను రాజకీయ పార్టీలు గ్రామాల్లో కులాలు వర్గాలుగా విడగొట్టి గ్రామ నాయకత్వాన్ని ఎదగనీయకుండా అభివృద్ధికి నోచుకోకుండా చేస్తున్నారు . పార్టీలతో సంబంధం లేకుండా ఏకగ్రీవంగా సర్పంచ్ లను ఎన్నుకుంటే బావుంటుంది .
ప్రస్తుతం సర్పంచులుగా పోటీచేసేవాళ్ళు ఊరిలో గౌరవం కోసమో, అధికార పెత్తనం కోసమో, పంతం కోసమో పోటీ చేస్తున్నారు కానీ గ్రామ అభివృద్ధ్ది కోసం ఎవరిదగ్గర సరైన ప్రణాళికలు కూడా లేకుండా పోటీ చేస్తున్నారు . ఇలాంటి వారి కంటే గ్రామం గురించి మంచి అభిప్రాయం ఉండే యువత పోటీ చేస్తే మంచిది. అందులోను ప్రతి గ్రామంలో నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్నారు కాబట్టి అలాంటి వారికి అవకాశం ఇస్తే అయిదు సంవత్సరాలు వారికి ఉపాధి దొరుకుతుంది(1 సర్పంచ్ + 10 వార్డుమెంబర్లు ) . ఉద్యోగాలు ఘగనమై పోతున్న తరుణంలో ప్రతీ గ్రామంలోని పది తాత్కాలిక పదవులకోసం నీతి నిజాయితీగా ప్రయత్నిస్తే సాదించవచ్చు .
-----------------------------------------------------------------------------------------------------------------------
పార్ట్- 1
సీన్ -1
మల్లి ఎన్నికల సంవత్సరం వచ్చింది .
ప్రతియేటా పెరుగుతున్న ఎండలకు ఈసారి రాజాకీయ వేడి తోడవ్వడంతో ఊరిలో జనం ఇంట్లో కంటే రచ్చబండ దగ్గర చింతచెట్టు కిందనే ఎక్కువ సమయం గడుపుతున్నారు . అప్పుడే ఊరిలోకి వచ్చిన ఆటో నుండి దిగిన ఒక పెద్దాయన (పుట్టింది ఈఊరిలోని అయినా ఉద్యోగరీత్యా పట్టణం లో ఉంటున్నారు ఊరి మీదనున్న మమకారంతో నెలకు ఒకసారి అయినా వచ్చి వెళ్తుంటాడు ,ఈ మధ్య రిటైర్ అయినా తరువాత నాలుగుఅయిదు రోజులకి ఒకసారి ఉదయమే వచ్చి మళ్ళీ సాయంత్రానికి తిరిగే వెళ్తుంటాడు ) పక్కనేవున్న అంగడి దగ్గర ఉన్న తన ఈడు అయినా ఇంకో పెద్దాయన దగ్గరికివెళ్తూ
1 " ఏరా సుబ్భయ్యా బాగున్నావా ! "
2. " హా ఏమిభాగు రెండు ముద్దలు అన్నంతింటే నాలుగు మాత్రలు తినాల్సివస్తుంది ,ఆలా గడిచిపోతుంది కాలం ."
1. "ఏంటి ... ఊరిలో విశేశాలూ ఈ ఎలెక్షన్స్ లో అయినా ఊరికి మంచి జరుగుతుందంటావా ???? "
2. "ఊరికి ఏమోకానీ తినేవాళ్లకి తాగేవాళ్ళకి అయితే ఈ రెండు నెల్లు పండగే పండగా ,వారికీ మాత్రం మంచిరోజులే "
1. " నాకు ఓటు హక్కు వచ్చిన నుండి ఇవి పదో ఎలక్షన్స్ ,మొదట్లో మనిషిపై నమ్మకంతో ఓట్లు వేసేవారు ,రాను రాను డబ్బులుంటేనే ఎలక్షన్స్ లో పోటీ చేసే పరిస్థితి వచ్చింది ,ఎంత మార్పు "
2. అవును 20 సంవత్సరాల నుండి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ,వానదేవుడు మన ఊరిని పూర్తిగా మరిచిపోయాడు , సమయానికి వర్షాలు రాక పండిన పంటకు ధరలేక కాడి కట్టి సేద్యం చేసే మగాడు ఊరిలో ఒక్కడు లేడంటేనే అర్థము చేసుకోవచ్చు కాలం ఎంతమారింది అని ,అయినా ప్రతియేటా శివరారాత్రికి శివునికి అభిషేకాలు మానలేదు ,ప్రతిశ్రీరామనవమికి శ్రీరాముడి ఊరేగింఫులు ఆగలేదు ,ప్రతి సంక్రాంతికి గుంటి గంగమ్మకు యాటలు నరకడం మర్చిపోలేదు ,బండ మీద నరసింహస్వామికి మొలకలుపున్నమికి కథ చెపించడం ఆగలేదు "
1. ఎన్ని చేసి ఏమిలాభం, ఊరిలో ఉండడమే పాపం అన్నట్లు తయారైంది పరిస్థితి , చదువురాని వాళ్ళు గల్ఫ్ కి అంతోఇంతో చనువుకున్నోల్లో పట్టణాల్లో చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ ఊరికి చుట్టపుచూపున వచ్చి వెళ్లే పరిస్థితులు . పల్లెజీవనం అనేది సినిమాల్లోనే బాగుంటుంది కానీ నిజజీవితంలోకి వస్తే ఇప్పటికే సగం ఊరు కాలిఅయింది . ఉన్నవాళ్లు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు పట్టణాల్లో స్థిరపడానికి , ఏ పని దొరకనప్పుడు పొట్టకూటి కోసం ఎవరిదారి వాళ్లు చుసుకోకతప్పదు .
2. ఇది ప్రతిపల్లె బాధ ,దీనిని ఎవరుమార్చలేరు ???
1. ఎక్కువ శాతం పల్లెల బాధ అయిండొచ్చుకాని ప్రతిపల్లె బాధ అయితే కాదు , ప్రపంచంలో richest village huaxi (china) కూడా వ్యవసాయంతో మొదలుపెట్టి ఈరోజు ఆ స్థాయికి ఎదిగారు అలానే మన దేశం లో కూడా చాలా పల్లెలు స్వయంసంవృద్ధితో అబివృద్దిచెంది ఆదర్శ గ్రామాలుగా ఉన్నాయి ,దానికి కారణం ఆ ఊరి ప్రజల కృషి పట్టుదల అలానే వాళ్ళందరూ కలిసి ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని ఆ నాయకుడి వెంట నడిచినపుడే అది సాయం అయ్యింది .
2. అయితే మన ఊరి పరిస్థితికి మనమే కారణం అంటావ్,అంతేకదా .
1. 100% ,ఈ సారి అయినా డబ్బుకు ముందుకు ఆశపడకుండా కులానికి కాకుండా గుణంచూసి ఒక నిస్వార్థపరుడైన నాయకుడిని ఎన్నుకొని ఊరి అభివుద్దిలో అందరూ ఒక చేయి వేస్తే మన గ్రామం కూడా ఆదర్శ గ్రామంగా నిలుస్తుంది.
2. అలా ఊరందరు కలిసి పరిస్థితులు ఇప్పుడు లేవు పనిలేని రాజకీయ నాయకులు ఇప్పటికే చిచ్చులు పెట్టి కులాలవారీగా వర్గాలుగా విడకొట్టారు .
1. అయినా మన ప్రయతం మనం చేద్దాం , అందరికి ఒకసారి చెప్పిచుదాం , ఈ ఎలక్షన్స్ లో అందరికి అమోదగ్గమైన వ్యక్తిని ఏకాగ్రవంగా ఎన్నుకుంటే అలాంటి గ్రామాలకు ప్రభుత్వం కూడా 10 లక్షల వరకు గ్రాంట్ లు ఇస్తుంది ,వాటిని మన గ్రామ అభివృద్ధి కి ఖర్చుపెట్టొచ్చు .
2. ఈ తరం పిల్లకాయలు మనమాటలు వినేరకం కాదు.
1. మన మాటలే వినాలి అనుకోవడం మన మూర్కత్వం ,మన అభిప్రాయలు మనం చెపుదాం ,వాళ్ళకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయ్ అవి తెలుసుకొని ఊరికి ఏది మంచి అయితే అది చేద్దాం , ఒకప్పటి యువతలా లేరు ఇప్పుడున్న వాళ్ళు అన్ని తెలుసుకుంటున్నారు , ఆలోచిస్తున్నారు , వారికి నచ్చినదానిని సాధిస్తున్నారు , అలాగే ఊరికోసం వాళ్ళు అనుకుంటే తప్పకుండా మంచిచేస్తారు .
2. సరే అయితే ఈ సారి ఎలాగైనా ఏకగ్రీవం అయ్యేలా చేద్దాం .
సీన్-2
ప్లేస్ : హైస్కూల్
టైం : 4:00 పిఎం
20 members playing cricket
here 1 2 3 4 5 are characters names
1 : మామా న్యూస్ చూసావా next month లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందంట ఇక two months వరకు ముందుకు విందుకు కొదవే ఉండదు .
2. అవును రోయ్ ,పోయినసారిలాగా ఒక పార్టీనే నమ్ముకొని opposition పార్టీ ఇచ్చే విందులకు దూరంగా ఉన్నాం ,ఈ అలా కాదు ఎవరు ఇచ్చిన తీసుకోవడమే ,వాళ్ళు కూడా మన గురించి ఆలోచించేది ఈ రెండు నెలలే కాబట్టి ఈ అవకాశాన్ని బాగా సొమ్ము చేసుకోవాలి అని decide అయ్యా , ఒక సారి fix అయితే blind గా follow అయిపోతా !
3. రే అలా రోజు తాగితే పోతావ్ ......
2. అది నిజమే రోయ్ అసలే మనల్ని నమ్ముకొని చాలా మంది ఉన్నారు . అయినా పర్లేదు ఇచ్చినవన్నీ తీసుకొని భద్రంగా దాచుకుంటా అవసరమైనప్పుడు పనికొస్తాయ్ .
4. మీరు మారారా ఇంకా ,ఫ్రీగా దొరికితే దేన్నీ వదలరా .
2. ఆపరా ....... అంతకుమించి ఒక మాట ఎక్కువ మాట్లాడినా మీ తాత బీడీ మీది ఒట్టు , అయినా థమ్స్ అప్ తాగి మిక్సర్ తినేవాళ్లకి dialogue లు లేవు , ఒకటి గుర్తుపెట్టుకో మాలాంటి వాళ్ళు తాగి ఊగడం వల్లే ప్రభుత్వం strong ఉంటుంది . ఎవడు ఏమన్నా this is true , any way you should remember one thing before blaming any drunk man .
4. నీకు దండం రా అయ్యా , నా కళ్ళు తెరిపించావ్ నీకు అప్పుడైనా ఉచిత సలహాలు ఇస్తే నీ చెప్పుతో కొట్టు .
5. ఇవన్నీ కాదు , మనందరం unity గా ఉందాం ,అప్పుడే మంచి అయినా చెడు అయినా మనం అనుకున్నది సాధించగలం.
4. ఊరి మంచికా లేకుంటే ఆ ..... మంచికా
2. రే dialogue లు లేనివాళ్లను సీన్లో ఎందుకు పెట్టార్రా , మేము కూడా ఊరి మంచి కోసం ఆలోచిస్తాం అలానే ఊరిలో మేము భాగం కాబట్టి మా మంచి గురించి కూడా అడుగుతాం .
1. ఆలు లేదు చూలు లేదు కొడుకుపేరు కీరాకే అన్నట్టు ఉంది యవ్వారం , అసలు ఎవరెవరు పోటీ చేస్తారు ఏ పార్టీ ఎవరికీ seat ఇస్తుంది ఇవేవి తెలీకుండానే పెద్ద పెద్ద ప్లాన్లు ఏస్తున్నారు. మీ ఆత్రం చూస్తుంటే ఈ దేశానికి రాజకీయ నాయకులకంటే ప్రజల వల్లనే ఎక్కువ ప్రమాదం ఉంది , ప్రజాస్వామ్యమా వర్ధిల్లాలి .
2. x పార్టీ నుండి పోయినా సారి పోటీచేసి ఓడిపోయిన 's ' confirm గా మళ్ళీ పోటీచేస్తాడు , ఇప్పుడున్న సర్పంచ్ ఇప్పటికే రెండు సార్లు గెలిచాడు , ఈసారి పెద్ద పదవికి try చేస్తున్నాడు , ఆయన మళ్ళీ పోటీ చేయకపోవచ్చు అని 'y ' పార్టీ వాళ్ళు చెప్పారు.
1. అంటే 'y ' పార్టీ వాళ్ళు కొత్తవాళ్ళకి ఛాన్స్ ఇస్తారు , ఎవరు గెలిచినా ఊరికి కొత్త సర్పంచ్ రావడం పక్కా ...
2. ఎవరు గెలిస్తే ఏముంది ,బాగా డబ్బులున్న వాళ్ళకి seat ఇస్తే పోటీ మంచి రసవత్తరంగా ఉంటుంది అలానే మనకు కొంచెం గిట్టుబాటు అవుతుంది.
1. ఈ two months ఊరిలో పండగే పండుగా .
2. ఈ గవర్నమెంట్ వాళ్ళు రెండు ఎలెక్షన్స్ అయినా పెట్టాలి అప్పుడే ఊరిలో జనాలకి పని దొరుకుతుంది ఊర్లు వదిలి పట్టణాలకు పోరు.
1. ఇద్దరేనా ఏ ఇంకా ఎవరైనా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా .?
5. చక్రం మామ ఒకసారి నాతో అన్నట్టు గుర్తు " ఒకసారి అయినా సర్పంచ్ కావలి ఆ హోదా అధికారాన్ని అనుభవంచాలి ,ఎదో ఒక పార్టీ seat ఇస్తే పోటీ చేయాలి " అని, అయన దగ్గర కూడా వడ్డీ డబ్బులు దండిగానే మూలుగుతున్నాయ్ .
2. మామ నాకు బాగా close ,నేనెళ్ళి కనుకుంటా ఒకసారి ఆయనకి ఇష్టం ఉండి పోటీ చేస్తే నా ఓటు మామకే .
4. (claps కొడుతూ ) ఆహా మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది ,ఎలెక్షన్స్ అయ్యాక గెలిచినా వాళ్ళు ఎలాగూ ఏంచేయరని తెలిసి ఈ రెండు నెల్లె మనకు మంచి రోజులు అని సంబరపడిపోతున్న మీ అల్ప సంతోశానికి జోహార్లు ,
2. ఎదో మాట్లాడబోతుండగా
4. please ఒక నిమిషం నన్ను మాట్లాడనివ్వు రే '2' ను అస్సలు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వోద్దు , మనం ఈ రెండు నెలలు గురించి ఆలోచిండం మానేసి దేనికి లొంగకుండా నిజాయితీపరుడైన సర్పంచ్ ని ఎన్నుకుంటే ఈ రెండు నెలల సంతోషాన్ని మనం అయిదు సంవత్సరాలు అనుభవించొచ్చు ,think about permanent solutions not about temporary happiness , మీరు చెప్పిన వాళ్ళందరూ పదవి,పంతం ,డబ్బు అధికారం కోసం పోటీ చేసున్నారు కానీ , వాళ్ళల్లో ఏ ఒక్కరికి కూడా గెలిస్తే గ్రామ గ్రామ అవసరాలు ఏంటి ఏవిదంగా develop చేయాలి అనే ప్రణాళికలు , ఆలోచనలు ఏమి లేవు, అలాంటపుడు వాళ్ళు గెలిచి ఊరికి ఎదో చేస్తారని ఆశించడం కూడా తప్పే. final గా నేను చెప్పొచ్చేది ఏటంటే , మనలో కూడా కొందరికి ఊరికి మంచి చేయాలి అని ఉంటుంది , కానీ ఈ కుళ్ళు రాజకీయాల వల్ల ఈ కంపు మనకెందుకు అని silent గా ఉంటున్నారు, చాలా పల్లెల్లో యువత అడ్వాన్స్ గా ఆలోచిస్తూ గ్రామాన్ని ప్రగతిరథంలో నడిపిసున్నారు అలానే మనలో ఎవరోఒకరు ఈసారి పోటీ చేద్దాం , నేను పోటీ చేయడానికి రెడీగా ఉన్నాను చేయండి లేకుంటే మీలో ఎవరు నిలబడిన నేను అన్ని విధాలా సహకరిస్తాను , మీరు ఒకసారి ఆలోచించండి.
12345 అందరు షాక్
2. అరే రాజకీయాలంటే రోజుకి 8 గంటల డ్యూటీ ,వీకెండ్ party లు ,team outing లు అనుకున్నావా రాజకీయాన్ని నమ్ముకొని చెడినవాళ్ళే ఉన్నారు కానీ బాగుపడినవాళ్లు 100 మందిలో ఒకరే ఉంటారు ,అంతెందుకు పోయినసారి పొలాల అమ్మిమరి పోటీచేసిన 'k ' ఇప్పటికి చేసిన అప్పులకి వడ్డీ కడుతున్నాడు , అయినా మనం అప్పుచేద్దాం అన్నా మన ముఖం చూసి అప్పులిచ్చేవాళ్ళు కూడా లేరు,అలాంటిది మనకు ఓట్లు వేస్తారా.. అందరికి అలానే అనిపిస్తుంది యువత రాజాకీయాల్లోకి రావాలి,గెలిస్తే నిజాయితీగా పనిచేస్తారు ఊరు బాగుపడుతుంది అని కానీ యువత ముందుకొచ్చి పోటీ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఓటు వేయరు , ఇవన్నీ జరగవు, అంటేనే మనకు entertainment మనం enjoy చేయాలి కానీ risk లు చేసి ఉన్న సంతోషాన్ని కోల్పోకూడదు .
4 ప్రతిసారి ఇలానే వెనకడుగు వేయడం వలనే నాయకులూ ఆలా తయారవుతున్నారు ,దైర్యం చేసి మనం ఒక అడుగు ముందుకేస్తే మనం గెలవక పోయినా మన తరువాత తరం గెలుపుకి పునాది అవుతాం ,ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. డబ్బు, మందు, కులం, వర్గం లేని రాజకీయాలు మనతోనే మొదలవ్వాలి,ఒకసారి ఆలోచించండి .
5. గుడ్ proposal , ఇంకా టైం ఉంది మళ్ళీ మనమందరం మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వద్దాం.
1. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది , 4,s ,r చక్రం మామ ఈసారికి నలుగురు పోటీలో ఉన్నారు.
సీన్-3
పచ్చటిపొలంలో పొలం పనులు చేసుకుంటూ ఇద్దరు ఆడవాళ్ళూ
6. ఏమి ఎలెక్షన్స్ ఓ ఏంటో , పాడు ఎలెక్షన్స్ ప్రశాంతంగా ఉన్న ఊరిలో గొడవలు పెట్టడానికి కాకపోతే ఏమయినా ఉపయోగం ఉందా , మా మొగుడు పార్టీ పార్టీ అని పోయిన ఎలేక్షన్స్ లో పెట్టిన కేసులకే కోర్టుకు తిరుగుతున్నాడు ,ఈసారి ఎన్ని కేసులు అవుతాయో , ఆ పార్టీ ఏమయినా కూడు పెట్టిందా ఒక రూపాయి ఇచ్చారా , మన కష్టం మనం పడాలి కడుపు నింపుకోవాలి. అప్పుడు పోటీ చేసిన ఇద్దరు నాయకులు ఇప్పుడు ఒకటైనారు ,అప్పటిసంది ఊరిలో సగం మందికి మాకు వాళ్లకు మాటలే లేవు ,వాళ్ళు మనల్ని ఎర్రోళ్ళని చేస్తున్నారని మాఆయనికి ఎప్పుడు తెలుస్తుందో.
7.(వాళ్ళ కొడుకుని ఉద్దేశించి ) మా ఇంట్లో ఒకడు తయారయ్యాడు వద్దురా మనకు అంటే వినకండా రాజకీయాలని తిరుగుతున్నాడు. నాలుగు పోలీస్ దెబ్బలు పడినాకైనా బుద్దేస్తుందేమో.
6. ఎవరన్నా గెలవని , గొడవలు జరగకుండా ఎలక్షన్స్ అయిపోతే చాలు అదే ఈ ఊరికి పదివేలు .
పార్ట్-2
మరుసటిరోజు ఉదయం .
అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇప్పుడిప్పుడే ప్యాక్షన్ నుండి బయటపడి పల్లెలకు దూరంగా వెళ్లి ఆర్థికంగా స్థిరపడేవాళ్లు కాకుండా ఊరిలో ఒకరిద్దరు మాత్రమే వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న సమయంలో దేవుడు కూడా మా ప్రాంతం మీద ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నట్టు దేశంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వర్షం పడుతున్నా ఒక్క కడప జిల్లాల్లో మాత్రం 70% లోటు వర్షపాతంతో వేసిన వరినారు నాటకుండానే పెద్దదవుతోందీ , వర్షాన్నే నమ్ముకొని వేసిన వేరుశనగ విత్తనాలు మట్టిలోనే కలిసిపోయాయి , ఉపాదిపని దినాలు(100) కూడా అయిపోవడంతో పనేలేని మా ఊరి కోసమే ఈ ఎలక్షన్స్ వచ్చాయా అన్నట్టు ఉంది , అయినా ప్రతీసంవత్సరం ఎలక్షన్స్ రావు కాబట్టి దేవుడు కరుణించి వర్షాలుపడేలా చేస్తే వ్యవసాయాన్ని ప్రతిపల్లెను అంతరించపోకండా కాపాడినట్లు అవుతుంది.
రాష్ట్రం మొత్తం ఎలక్షన్స్ కంటే ముందే వర్షాలు పడటటంతో వాళ్ళ ఊరిలో రాజకీయాన్ని వారి పోలంపనులు డామినేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది , వర్షంలేని కారణంగా పోలంపనులేని మా ప్రాంతంలో రాజకీయమే ఏకగ్రీవంగా ఎప్పుడూలేని విదంగా ఊరినే ఒక తెలీని అనుభూతిలోకి తీసుకెళ్ళడంతో పాటు అందరిలోనూ ఒకటే ఆత్రుత కనిపిస్తుంది. ఊరిలో ఉన్న ముసలివాళ్ళ దగ్గరనుండీ మొదలుపెట్టి ఉదయమే ఊరినుండి బయలుదేరి పట్టణంలో పనులు చూసుకొని సాయంత్రానికి తిరిగివచ్చే ఉద్యోగులు,టౌన్ లోనే వుద్యోగం చేస్తూనో చదువుకంటునో ఉండి శనివారం రాగానే పల్లెకు చేరుకునేవాళ్ళు , ఎక్కడో దేశానికి దూరంగా గల్ఫ్ లో ఉన్నవాళ్లవరకు అందరికీ ఒకటే విషయం వాళ్లకు తెలియకుండానే రోజువారీ మాటల్లో భాగం అయిపొయాయి ఊరి రాజకీయాలు . ఓటు వేసే వల్లే ఇంతలా ఆలోచిస్తుంటే ఇక పోటీ చేసేవాళ్ల సంగతి చెప్పనక్కర్లేదు .
మొదటిపోటీదారుడు (soma ):
ఊరిలో ఆర్థికంగా స్థితిమంతుడూ, వాళ్ళనాన్నకు ఊరిలో పెద్దమనిషిగా పేరుంది . వాళ్ళ నాన్నకి ఊరిలో మంచిపేరు ఉన్నా ఎప్పుడూ పదవులు కోరుకోలేదు ,ఆ ఆశకూడా లేని వ్యక్తి . ఇతనికి మాత్రం అధికారాన్ని అనుభవించాలి కోరికా బలంగా నాటుకుపోయింది , అందుకే పోయిన ఎలక్షన్స్ లో పోటీచేసి ఓడిపోయినప్పటికీ గెలవడానికి కావాల్సిన అనుభవం అయితే నేర్చుకున్నాడు , తాను ఓడిపోయినప్పటికీ అదే పార్టీకి చెందిన వ్యక్తి mla గా గెలవటంతో తన అనుకున్న పనులు అన్ని చేసుకోగలిగాడు , ఆ mla సపోర్ట్ కూడా ఉండడంతో ఈసారి ఎలాగైనా గెలవాలి అనే పట్టుదలతో ఉన్నాడు .
సీన్-1
సమయం :8:00 AM
ప్లేస్ :సోమా మామిడితోటలో తన మద్దతుదారులతో
అప్పుడే ఫోన్ చేసిన mla గారితో 10 నిమిషాలు మాటలాడిన తర్వాత ఫోన్ పెట్టేస్తూ ,mla గారు చెప్పిన విషయాలను అక్కడే ఉన్నవాళ్ళతో పంచుకంటున్నాడు ,
soma : "మనవాళ్ళు అందరూ వచ్చారా , కాలం గాయాల్ని మాన్పిస్తుంది అంటే ఎదో అనుకున్న ఈ అయిదేళ్ల కాలం ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదు , అయినా మనమంచికే , గడచిన ఓటమిని మర్చిపోవడానికి దేవుడు మనకు మల్లి ఒక అవకాశం ఇచ్చాడు , ఇప్పుడే mla గారితో ఫోన్ మాట్లాడాను , ఈ ఎలక్షన్స్ లో నా గెలుపు నాకు ఒక్కడికే కాదు మన mla గారికి అలానే మన పార్టీకి కూడా చాలా ముఖ్యం అని చెప్పాడు . పోలీసుల సపోర్ట్ కూడా మనకే ఉంటుంది , ఇప్పుడున్న సర్పంచ్ మల్లి పోటీచేయడు ,నా మీద పోటీచేసేవాళ్ళు దరిదాపుల్లో కూడా కనబడటం లేదు. ఈ నెల రోజులు మనం కష్టపడితే అయిదు సంవత్సరాలు మనకు ఎదురు ఉండదు , మీకు నేను అన్ని విధాలా సహకరిస్తాను. "
1. " మనకు ఎంత పోటీ లేకున్నా డబ్బు లేకుండా ఎలక్షన్స్ అంటే చాలా కష్టం "
s : పోయినసారి కంటే డబుల్ కర్చుపెడదాం , ముందు ఊరిలో ఏమనుకుంటున్నారు ఒకసారి కనుక్కోండి .
2. మన కులం నుండి ఇంకొకరు పోటీచేయకుండా ఉంటె 100 శాతం మనదే గెలువు , కానీ .. ...
s . కానీ ఏంటి , ఎదో చెప్పాలనుకుంటున్నావ్ చెప్పు . ఇంకా ఎవరైనా పోటీ చేస్తున్నారా ????
2. అదే పోయిన ఎలక్షన్స్ మనం గొడవ పడ్డాం కదా ఆ రాము y పార్టీ వాళ్లతో మాట్లాడుతున్నాడంటా ,
సోమ : అంటే ఆ రాముగానికీ నామీద గెలిచే అంత సీన్ ఉండటావా ???
2. y పార్టీకి కూడా బలం ఉంది y పోటీ చేస్తే మన కులపు ఓట్లు చీలి మనకు నష్టం జరగొచ్చు .
సోము . అలా జరగకూడదు , ఒకసారి మన mla గారితో వార్నింగ్ ఇప్పిదాం .
2. ఆ అదేమరి చేతులు కాలాక ఎంపట్టుకున్నా లాభం లేదు , నేను అప్పుడే చెప్పాను "బలం ఉన్న వాళ్ళతో గొడవ కంటే స్నేహమే మనకు పనికివస్తుంది" . నిజం చెప్పాలంటే వాళ్లకి ఈ ఎలక్షన్స పదవులు వీటికి దూరంగా ఉంటారు , కానీ ఇప్పుడు మీరు గొడవ పడిన కారణంగా వాళ్ళు గెలవకున్న మిమ్మల్ని గెలవనీయకూడదు అనే పంతంతో ఉన్నాడు .
సోమా : సరే జరిగిపోయినదానిని ఏమి చేయలేము , గెలవడానికి ఎంతకైనా తెగిద్దాం , సర్పంచ్ కావాలనే నా ఆశయాన్ని తప్పకుండా . సాదించాలి .
సీన్-2
రెండో పోటీదారు రాము :
సోము తో పోలిస్తే ఆర్థికంగా రాము కొంచెం తక్కువే అయినా , ఊరిలో మాత్రం అడిగిన వాళ్ళకి మాట సహాయం చేయడంలో ముందుటాడు. 1980 లలోనే డిగ్రీ పూర్తిచేసిన మొదటి వ్యకి , అప్పట్లో తనకి వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా "మనం మాత్రమే తినాలంటే ఉద్యోగం పదిమందికి అన్నం పెట్టాలంటే సేద్యం (వ్యవసాయం )" అని వాళ్ళ నాన్న చెప్పిన మాట నచ్చి ఊరిలో వ్యవసాయం చేస్తూ తన ఇద్దరి పిల్లల్ని బాగా చదివించాడు , ఒకరు గవర్నమెంట్ జాబ్ లో ఇంకొకరు ప్రైవేట్ జాబ్ చేస్తూ,పెళ్లిలు కూడా అయిపోవడంతో సిటీ లోనే ఉంటున్నారు, ఒకనెలలో పిల్ల్లలు పల్లెకు వస్తే ఇంకో నెలలో రాము వాళ్ళ ఆవిడా సిటీకి వెళ్లి రెండురోజులు ఉండి వస్తుంటారు . రాజకీయాలంటే పడని రాము రెండు సంవత్సరాల క్రితం సోముతో జరిగిన గొడవవల్ల , వర్షాలు లేక పెద్దగా పొలం పనులు ఏమీలేవు ఉన్న ఇద్దరు పిల్లలు సిటీలో సెట్టిల్ అయ్యారు , ఊరిలో ఒకరిద్దరి రెచ్చగొట్టే పోటీ చేసేలా ప్రేరేపించడం వలన ,"కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు ఉన్నట్టు " ఊరిలో వాళ్ళుకాని తనుకాని ఎప్పుడూ ఊహించని రాజకీయా రణరంగలోకి దూకాలని మానసికంగా సిద్ధం అయ్యాడు.
place : రాము వాళ్ళ ఇంట్లో ,
time : 11:00 am
రాముని బాగా ఇష్టపడే కొందరు వారికున్న అభిప్రాయాలను ఐడియా లను రాముతో చెప్తున్నారు.
రాము బెస్ట్ ఫ్రెండ్ : రాము , మళ్ళీ ఒకసారి ఆలోచించు నామినేషన్స్ కి ఒక నెల మాత్రమే టైం ఉంది , పిల్లలు ఇద్దరు ఏమన్నారు , మాజీ mla తో మల్లి ఒకసారి మాట్లాడి ఆయన సహాయం ఎంతవరకు ఉంటుంది . ఒకసారి ఎన్నికల కదనరంగంలో దిగాక గెలుపే మన లక్ష్యం కావాలి , అలా కాకుండా పోయి పోయి ఆ సోము గాని చేతిలో ఓడిపోయాం అంటే ఓడిపోయిన నీకంటే కూడా నిన్ను support చేస్తున్న మేమెంత ఊరిలో తలఎత్తి తిరగలేం .
రాము : ఎమ్ పర్వాలేదు , పెద్దోడుకి కూడా రాజకీయాలంటే ఆసక్తి ఉన్నట్టు ఉంది , పోటీ చేస్తున్న సంగతి చెప్పగానే 'సరే నాన్న నీ ఇష్టం నేను కూడా 20 రోజులు సెలవు తీసుకొని వస్తాను నీకు సహాయంగా ఉంటుంది' అని చెప్పాడు . నేను మన వాళ్ళు అంతా ఉన్నారు మరీ అవసరం అయితే పిలుస్తాను అని చెప్పను , ఇక చిన్నోడు మాత్రం మనకు ఈ రాజకీయాలు అవసరమా అని మొదట bet చేసినా తర్వాత " జాగ్రత్త నాన్న, డబ్బులు ఏమయినా అవసరం ఉంటె చెప్పు పంపిస్తాను " అని ఒప్పుకున్నాడు. ఇకపోతే మాజీ mla కూడా మనస్ఫూర్తిగానే నాకు support చేస్తా అన్నాడు , పార్టీ ఫండ్ ని కూడా ఈ వారంలోనే అందేలా ఏర్పాటు చేసాడు .
రాము బెస్ట్ ఫ్రెండ్ : మంచిది .
r 1 : రామన్న ఊరిలో పెద్దలు అందరిని కలిసి ఎన్నికలను ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నిద్దాము , ఆ సోము గాడు ఒట్టి మూర్ఖుడు , మొండోడు . మూర్ఖులతో పోటీ కంటే తెలివిగా పోటీలో లేకుండా చేస్తే మంచిది , తన మన అని ఏమిలేకుండా గెలవడానికి ఏదయినా చేయడానికి రెడీ అనే రకం , వాడితో పోటీ లేకుంటేనే ఊరికి మనకు మంచిది .
లేకుంటే ......
రాము : ఆ లేకుంటే ఏంచేస్తాడు .....
r 1 : ఏమో చేస్తాడని కాదు ఇన్ని సంవత్సరాలో ఏ ఎలక్షన్స్ లో కూడా గొడవలేమి లేకుండానే జరిగాయి ,ఎప్పుడు ప్రశాంతగా ఉండే ఊరిలో , కులం ఏదైనా వరుసపెట్టి పిలవడం మాత్రమే తెలిసిన ఈ ఊరిలో,పార్టీ ఏదైనా మన గ్రామా సర్పంచ్ గా మన పల్లెవాడు అయితే చాలు అని గెలిచినా ఓడినా అని అందరం ఒకే మాటమీద ఉంన్నాం ,ఎప్పుడు లేనిది ఈ సరి కొత్తగా రెండు పార్టీల నాయకులు మన ఊరిలోనే ఇద్దరు పోటీ ఉండేలా చేశారు , నిద్దరలేచిన దగ్గరనుండి నిద్రపోయేవరకు ఒకరిమొఖం ఒకరు చూసుకొనేవాళ్ళం రాజకీయాల కోసం ఊరు రెండుగా చీలిపోతుందనే ఆలోచన కూడా చాల భయంకరంగా ఉంది .
రాము: నువ్వు అనుకుంటున్నట్టు ఊరికి ఏమీకాదు అయితే గియితే నాకేమ్మన్న కావాలి , నా గురించి మీరు ఏం భయపడొద్దు . నేను ఇదే ఊరిలోనే పుట్టాను , ఈ ఊరి నీళ్ళే తాగాను, వాడు గెలవడానికి నన్ను ఏమయినా చేయాలి అనుకుంటే వాడిని గెలుపుని ఆపే శక్తి యుక్తి పంతం పౌరుషం నాకు ఉన్నాయి, మీరు నాతో కలిస్తే నా గెలుపుని ఆపడం వాడి వాళ్ళ కాదు . తొందరగా ప్రచారాన్ని మొదలుపెట్టాలి మళ్ళీ కలుద్దాం అందరం రచ్చబండ దగ్గర .
సీన్-3
మూడోపోటీదారు - చక్రం మామ :
ఈమధ్య బ్యాంకులు మండలం స్థాయిలో అందుబాటులోకి రావడంతో చక్రం ఇల్లు బోసిపోయినట్టు ఉంది కానీ అదే ఒక పది సంవత్సరాల క్రితం పంటలు మొదలుపెట్టే సమయంలో అయితే చుట్టు పక్కల 20 పల్లెల వరకు చక్రం ఇంటి ముందు బార్లు తీరేవాళ్లు , ఆయన ఇచ్చే వడ్డీ డబ్బులే వాళ్ళ పంటలకు అయ్యే ఖర్చులు పెట్టడానికి ఆధారం .
అయితే అలా అప్పుచేసి సాగుచేసే 80 శాతం రైతులు పండించిన పంటలు వాళ్ళు తినడానికి కావల్సిన గింజలు ప్రతి సంక్రాంతికి ఇంటిల్లిపాదికి కావాల్సిన కొత్త బట్టలు పండగ సరుకులు సరిపోగా మిగిలిన పంట మోత్తం చక్రం వడ్డీ ఖాతాలోకి వెళ్ళేది . ఒక్కొసారి పంట ఎండిపోయి పశువులకు గడ్డి మాత్రమే మిగిలేది , అలాంటి వర్షాభావ పరిస్థితిలో భవిషత్ లో ఎడారి కావడానికి సిద్ధంగా ఉన్న ఊరిలో బతుకుదెరువుకి గల్ఫ్ బాట పట్టిన చాలామందికి ఈ చక్రం మామనే అప్పు ఇచ్చి వాళ్ళ జీవితంలో పెద్ద సహాయం చేశారనే గౌరవం ఊరిలో అందరూ ఇస్తారు .
ప్రతి ఒక్కరి జీవితంలో ఒక టైములో మాత్రమే వారి పట్టిందల్లా బంగారం అవుతుందటారు , అలాంటి టైంలోనే చక్రం మామ కూడా బాగానే కూడబెట్టి ఇప్పుడు తన వడ్డీ ఎవరికీ అవసరం లేకపోవడంతో రాజకీయాల్లో పెట్టుబడిగా పెట్టి సర్పంచ్ గ గెలిస్తే మల్లి గోల్డెన్ టైం వస్తుంది అనే ఆలోచలనలో ఉన్నాడు, సరిగ్గా అటువంటి టైంలోనే ఎలక్షన్స్ వచ్చాయ్ .
place :
టైం: 4;00 pm
ముగ్గురు యువకులు అందులో ఒకరు మునగచెట్టు ఎక్కించి వాని పని చేపించుకోవడంలో దిట్ట. ఇప్పుడు వీడి కన్ను చక్రం మీద పడింది. ఏంజరుగుతుందో చుద్దాం.
1,2,3 characters names
1: హాలో మామ చాల బిజీగా ఉన్నట్టు ఉన్నావ్
చక్రం : ఏమిలేదుయ్ బిజీనా పాడు బతకడానికి ఎదోఒకటి చేయాలి కదా , నాలుగు పొట్టేలు పిల్లలు తీసుకున్నా సంక్రాంతికి మంచి రేటు వస్తుంది అని , నువ్వుంటే సంగతి చాలా రోజుల తరువాత కనిపిస్తున్నావ్ . ఎదో డ్యూటీకి పోతున్నావ్ అంట ??
1: అబ్బో అది పెద్ద ఉద్యోగం , చదువులేని వానికి ఏముంటాయ్ ఆ కంకర మెషిన్ దగ్గర jcb ఆపరేట్ చేయడం తప్ప.
చక్రం : ఎదో ఒకటి చేయాలి మన కాళ్ళ మీద మనం నిలబడాలి . ఊర్లో సంగతులు ఏంటి ఈసారి అయినా నా దశ మారుతుందంటావా ......
1: ఇప్పుడున్న పరిస్థితులు చుస్తే ఈసారి నీకే కలిసి వచ్చేలా ఉంది .
చక్రం: అయితే నేను పోటీ చేయచ్చు అంటావా
1. నిన్ను మంగళవారం మామ అని పిలిస్తే బాగుంటుందేమో . ఎందుకంటే ప్రతి ఎలక్షన్స్ ముందు పోటీ చేస్తా అంటావ్ తీరా నామినేషన్స్ టైం వచ్చేసరికి ఏదోఒక కారణంతో వెనకడుగు వేస్తావ్ అందుకే నిన్ను చుస్తే మంగళవారం సామెత గుర్తుకువస్తుంది. నేను చెప్తున్నా నా మాట విను , ఇన్నిరోజులు మన గ్రామంలో పెద్ద కులంగా ఉండి రాజకీయం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది కానీ ఈసారి వాళ్ళ కులపోల్లే ఇద్దరు పోటీ చేస్తున్నారు , వాళ్ళ కులం ఓట్లు చీలడం గ్యారెంటీ మూడో వ్యక్తి పోటీ చేస్తే గెలుపు పక్కా , అయితే కొంచెం ఖర్చు బాగా పెట్టాలి అయినా నీ దగ్గర లేని డబ్బా ఏంటి ?
చక్రం: నువ్వు ఐదో తరగతిలోనే చదువు ఆపేసావంటే ఎవ్వరూ నమ్మరు , ఏమి చెప్పావురా కులరాజకీయం గురించి నీ ముందు వందల కోట్లు తీసుకొనే politicalstratagist లు కూడా పనికిరారు . ఈసారి మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదు ,అయితే ఒకమాట రోయ్ ముందే చెప్తున్నా , నీ ఫుల్ support నాకే ఇవ్వాలి ఊరిజనం మనుసులు తెలిసిన నీలాంటి వాళ్ళు నావెనుక ఉంటె చాలు , అయినా ను మాత్రం నన్ను మోసం చేయకూడదు రోయ్ . వాళ్ళు ఇద్దరు ఒకరు mla ఇంకొకరు మాజీ mla నమ్ముకుంటే నేను మాత్రం నిన్నే నమ్ముకుంటున్నా !!!!
1: సారీ మామ ఈడీకి వచ్చేముందు నా ఆలోచన ఒకటే ఎలక్షన్స్ లో ఎక్కువ మంది పోటీ చేస్తే మా మందు విందుకు కొదవ లేకుండా ఉంటుంది అనుకున్నా , కానీ ను మాత్రం నన్నే నమ్ముతున్నావ్. ఇప్పుడు చెప్తున్నా మామ మందు విందు వాళ్ళదే తీసుకున్నా మనస్ఫూర్తిగా నీకు నా అయినంత సహాయం చేస్తాను. సరే మామ ఇంకేటి సంగతులు .....
చక్రం : ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయావ్ , ఇప్పుడున్న అధికార ప్రతిపక్ష పార్టీ ల నుండి సోము రాము పోటీ చేస్తున్నారు , మరి నేను కొత్తగా పెట్టిన పార్టీ నుండి పోటీ చేస్తే ఎలావుంటుంది . ఆ పార్టీ మీద నీ అభిప్రాయం ఏంటి ?
1: మామ ఎలక్షన్స్ ముందు చాలా పార్టీలు వస్తుంటాయి , ఇప్పుడున్న పార్టీలకు సింద్ధాంతాలు లేవు కనీసం కొత్త నాయకత్వాన్ని అయినా తయారుచేస్తే జనాలకు లాభం ఉంటుంది అంతేకాని పార్టీ కొత్తది అయినా నాయకులు మాత్రం ఆ రెండు పార్టీలలో సీట్లు దొరకని వాళ్ళు కొత్త పార్టీలో పోటీ చేస్తే ఏమిలాభం , అదే నాయకులే మల్లి గెలుస్తారు . పార్టీ ల మీద పెద్దగా ఆశ పెట్టొకోకు ,ఏ పార్టీ అయినా వచ్చి పార్టీ fund ఇస్తాం అంటే ఆ పార్టీలో జాయిన్ అయ్యి మన కష్టాన్నే మనం నమ్మొకోవాలి . ఇప్పటికి వదిలేయ్ ఇంకా టైం ఉంది కదా ఆలోచిద్దాం , నాకి టైం అవుతుంది పోయొస్తా. మల్లి మాట్లాడుదాం.
చక్రం : సరే పోయిరా , ఊరిలో విషయాల మీద ఒక కన్ను ఉంచుండి అందుకైనా మంచిది .
అక్కడినుండి వెళ్తూ
1: మామ 100 కోట్లు రెడీగా పెట్టుకో సరేనా .
చక్రం : దేనికిరా
1: దేనీకేంటి ఇందాక నువ్వే అన్నావ్ కదా 100 కోట్లు ఇచ్చిన స్ట్రాటజిస్టు కూడా నాముందు వేస్ట్ అని.
చక్రం : అబ్బో , అయితే నన్ను cm ని చేయరా .ఇస్తాను .
1: నిన్ను సీఎం చేసేంత బలమే ఉంటె నేనే అవుతాను కానీ నిన్ను ఎందుకు చేస్తానంటా ....
చక్రం : మాటలకేం తక్కువలేదు , పొద్దుకూకుతుంది పోయిరా నేను ఇంటికి వెళ్తున్నా >
సీన్-4
నాలుగో పోటీదారు - వెంకీ (25)
ఊరిలో ఉండే చాలా మంది యువకులలాగే చదువు పూర్తిఅవ్వగానే ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ ఊరిలో జరుగుతున్న రాజకీయాల మీద విరక్తితో రాబోవు ఎలక్షన్స్ లో ఒక నిరుద్యోగ యువకుడుని పోటీ చేపించి తనకు అన్ని విధాలా సహాయం చేయాలనుకున్నాడు. అదే విషయాన్ని తన తోటి యువకులతో చెప్పగా వారి నుండి వచ్చిన మిశ్రమ స్పందన కారణంగా , ఒకవేల ఎవరు ముందుకు రాకుంటే తానే పోటీ చేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలిసిన తన అమ్మానాన్నకు ఇష్టం లేకున్నా వాళ్ళను ఒప్పించి చెప్పాలంటే బలవంతంగానే ఒప్పుకున్నారు.
place : రచ్చబండ
వెంకీ మరియు తన మిత్రులు
వెంకీ : మామ నాలుగేళ్ల కిందట ఇదే place లో ఒక మాట అన్నావ్ గుర్తుందా ??
vf : ఒకమాట ఏమికర్మ నాకు మాటలు వచ్చినప్పటినుండి ఇక్కడే ఆడుకుంటున్నాం చాలా పనికిమాలిన meetingsకి ఇక్కడే అటెండ్ అయ్యాను , నేనే కాదు ఈ ఊరిలో పుట్టిన చాలా మంది ఈ రచ్చబండ దగ్గర గుర్తులేన్నన్ని మాటలు చెప్పిఉంటాం . నువు ఏ విషయం అడుగుతున్నావు ???
వెంకీ : అప్పుడప్పుడు కొన్ని మంచి విషయాలు కూడా మాట్లాడతాం , ఆరోజు ఏమిజరిగింది అనేది గుర్తులేదు కానీ నువ్వు అన్న మాటలు మాత్రం ఇప్పటికి నా చెవిలోని ఉన్నాయ్ .
vf : అబ్బా ఆపురా బాబు , నీ చెవిలో ఉన్నాయో ఇంకా ఏడైనా ఉన్నాయో ఎవడికి కావలి , ఏమి చెప్పానో అది చెప్పు చాలు .
వెంకీ: :"మన ఊరికి వచ్చే గౌరవం మన ఊరి సర్పంచ్ ఎలాంటివాడో అన్నదానిబట్టే ఉంటుంది . మన కర్మ కాకపొతే డిగ్రీ కూడా పాస్ కానీ , సర్పంచ్ విధులంటే ఏంటో కూడా తెలియని ఒక వ్యక్తి మన ఊరికి సర్పంచ్ అయినప్పుడే మన ఊరు గౌవరం పోయింది . సొంత పనులు కోసం కాకుండా ఊరి కోసం రాజకీయాలు చేసేవాడు మన లీడర్ అయితేనే మల్లి మన ఊరు తల ఎత్తుకొని నీలబడుతుంది . వాళ్ళని నమ్మి ఓట్లు వేయడం కంటే మనమే పోటీ చేసి మన ఓట్లు మనమే వేసుకోవడం ఉత్తమం. "
vf : ఇంకా చాలు , నాకు మొతం గుర్తుకువచ్చింది.
వెంకీ: అప్పుడు నువ్వే చెప్పే మాటలు వినే నాకు వచ్చే ఎలక్షన్స్ చదువుకున్న ఒక యువకుడు పోటీ చేయంచాలి అనే ఆలోచన వచ్చింది. ఇప్పుడేమో నువ్వే వెనకడుగు వేస్తున్నావ్.
vf : అప్పుడంటే పెళ్లి కాలేదు , ఉడుకురక్తం అలంటి మాటలు ఎన్నైనా చెప్పొచ్చు , కానీ ఇప్పుడు పెళ్లి అయ్యింది బాధ్యతలు తెలిసివచ్చాయ్ , అప్పుడు ఊరు మొత్తం నామాట వినాలి అనుకున్న ఇప్పుడు నా భార్య మాటలు తప్ప ఎవరిమాటా వినే పరిస్థితుల్లో లేను.
"సామజిక బాధ్యత కన్నా కుటుంబ బాధ్యత ఎక్కువ " అని తెలుసుకున్నా .
వెంకీ: అంటే ఊరి కోసం నీవంతుగా ఎంచేయాలనుకుంటున్నావ్ ??
vf : నేను డైరెక్ట్ గ పోటీలు ఉండలేను కానీ వెనకుండి అన్ని విధాలా సహాయం చేస్తా . నువ్వు పోటీ చేయాలనీ డిసైడ్ అయ్యావు కదా , నీకు పెళ్లి పిల్లలు లాంటి టెన్సన్స్ లేవు కదా , ఇదే మంచి అవకాశం నీకు , నాతో పాటు మన బ్యాచ్ మొత్తం నీకు అండగా ఉంటాం.
వెంకీ : డబ్బులు ఎంత అవుతుంది ఎలేచ్షన్స్ లో ....
vf : మొత్తం 2000 మంది ఓటర్లు అందులో కనీసం 1500 మందికి 200 చొప్పున 300000 , మళ్ళీ రోజువారీ ఖర్చులు 15000 . 20 రోజులకి 300000 . తక్కువలో తక్కువ 500000 . ఈ లెక్కలు పోయిన ఎలక్షన్స్ వి . రాము సోము చక్రం లాంటి పోటీలు ఉన్నారు అంటే ఈ లెక్కలు అన్ని తప్పుతాయి . ఈసారి ఎంతలేదన్నా ఒక్కక్కరికి 1000000 అవుతుంది .
వెంకీ : నేను డబ్బులతో పోటీ పడదాం అనుకోలేదు . మనదంతా ఆమ్ ఆద్మీ పార్టీ టైప్, నిజాయితీగా పోటీ చేస్తాం గెలిస్తే నిస్వార్థంగా కష్టపడి ఊరిని డెవలప్ చేస్తాం. అంతేకాని నేను వాళ్ళలాగా డబ్బు కుల రాజకీయాలు చేయాలంటే అస్సలు పోటీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంక ప్రచార ఖర్చులు కూడా అతి తక్కువ ఖర్చు పెట్టి చాల మందికి ఆదర్శనంగా నిలబడాలి అని నా ఆశ . గెలువు ఓటమి అనేది సెకండరీ థింగ్ . 75 సంవత్సరాలు రాని మార్పుని మనవళ్లే రాత్రికిరాత్రి మార్పు రావాలని కోరుకొను . మార్పుకోసం మొదలుపట్టిన ప్రయత్నం మనది ఈ ఎలక్షన్స్ లో కాకపోయినా నెక్స్ట్ ఎలక్షన్స్ కి అయినా మార్పు తప్పకుండా వస్తుంది.
vf : very good . పోటీ చేస్తున్నావ్ కదా అని ఆకాశంలో ఉంటావ్ నిన్ను నేలమీదకు దించుదాం అనుకున్నా కానీ నువ్వు భూమి మీద ఉండే ఆలోచిస్తున్నావ్ , ఎదోఒకరోజు తప్పకుండా సాధిస్తాం.
ఇంతలో vf ఫోన్ రింగ్ అవుతుంది , ఫోన్ తీస్తూ
vf : మా హోమ్ మినిస్టర్ నుండి ఫోన్ . వెళ్తున్నా sunday అందరితో meeting arrange చేద్దాం . ఓకే బాయ్ .
-------------------------------------------------------------------------------------------------------------------------
పార్ట్-3
నామినేషన్స్ - ప్రచారం
ఊరిలో ఎదో ఒక తెలీని సంబురం వచ్చినిట్టు అనిపిస్తుంది , అది ప్రతి సంక్రాంతి పండుగ ముందు వచ్చే హుషారు అందరి మొఖాల్లో సృష్టంగా కనిపిస్తుంది. పోటీ చేసి అభ్యర్థుల ఇళ్లలో జనాలతో కోలాహలంగా ఉంది.
నామినేషన్స్ కి కూడా మొదలవడంతో సర్పంచ్ తో పాటు మిగిలిన 10 మంది వార్డ్ మెంబర్ల ఒక టీం ను రెడీ చేసుకున్నారు కానీ వెంకీకి మాత్రం తల ప్రాణం తోకకు వచ్చింది , చివరగా ఒక పెద్దాయన వీళ్లకి తన పించను డబ్బులతో పాటు ఒక వార్డ్ మెంబెర్ గా పోటీ చేయడానికి సిద్ధం అవడంతో యువకుల ఉడుకురక్తానికి 60 ఏళ్ల అనుభవం కూడా తోడవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
పోలీసులు ముందుజాగ్రత్తగా నామినేషన్స్ రోజు పికెటింగ్ ఏర్పాటు చేసారు. అందరికంటే సోమా ఎక్కువ మంది జనంతో పాటు mla కూడా రావడంతో చాలా ఆర్బాటంగా నామినేషన్ వేసాడు . ఇక మిగిలిన వారు ఎవరు స్థాయిలో వారు వచ్చి నామినేషన్ వేసి ప్రచారం లో బిజీ అయ్యారు. పగలు ఇంటింటి ప్రచారం రాత్రి అవ్వగానే మందు విందులతో ఊరిలో తాగే వాళ్ళకి తినేవాళ్ళకి వరుసగా పదిరోజులు పండగలా అనిపిస్తుంది.
సీన్-1
ప్రచారం మొదలుపెట్టి అయిదు రోజులు అవ్వడంతో ఇప్పుడిప్పుడే ఎవరు ఎవరికీ మద్దతిస్తున్నారు, ఎవరి బలం ఎంత అనేది ఒక అవగాహనకు వస్తున్నారు అభ్యర్థులు .
వెంకీ తన మిత్రులతో కలిసి ఊరిలోని పెద్ద మనసులను అలాగే యువకులు ఉద్యగస్తులను కలుస్తూ మద్దతు కోరుతున్నాడు . అందరిలా కాకుండా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని తనకు ఊరిపట్ల ఉన్న ఆగాహన ఏవిధంగా అభివృద్ధి చేస్తానో సవివరంగా ప్రచారం చేస్తున్నాడు .
చక్రం మామ కూడా తన మద్దుతుదారులతో తన సామిజిక వర్గం వాళ్లతో మీటింగ్స్ పెట్టి ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి అని కోరుతున్నాడు.
రా ము మాజీ mla మరియు వాళ్ళ పార్టీ సహకారంతో మొదటిసారి ఎన్నికల్లో పోటీచేసిన ఊరిలో తన మీద ఉన్న సదాభిప్రాయం వల్ల ప్రజల నుండి కూడా బాగానే మద్దతు వస్తుంది .
సోమా లో రోజురోజుకి అసహనం పెరిగిపోతుంది, తనకు ఎవరు పోటీ రారు అనుకుండే స్థాయి నుండి ఇప్పుడు నలుగురు పోటీలో ఉండడం తన విజయావకాశాలు దెబ్బతింటాయి అనే ఆందోళనులో ఉన్నాడు. ఏదోఒకటి చేసి పోటీ నుండి ఇద్దర్ని అయినా తప్పిస్తే తప్ప తన గెలుపు సాధ్యం కాదు అని ఆలోచిస్తూ తెలీకుండానే నిద్దరలోకి జారుకున్నాడు,
-----------------------------------------------------------------------------------------------------------------------
సీన్-2
ఆరోజు ఆదివారం ఓటింగ్ కు ఇక రెండు రోజులు మాత్రమే మిగిలిఉంది , పల్లెకు దూరంగా పట్టణాల్లో ఉండేవారు పల్లెకు చేరుకుంటున్నారు , ఆదివారం కావడంతో పల్లె ఇంకా పూర్తిగా నిద్రలేవలేదు , ఎవరిపనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, సమయం ఉదయం 8 గంటలు కావొస్తుంది. ఇంతలో పెద్ద పెద్ద అరుపులతో దూరం నుండి ఒకరు గాయాలతో శక్తికి మించిన పరుగుతో ఊరికి సమీపిస్తున్నాడు అతని వెనకాలే మరో అయిదు ఆరు మంది తరుముటున్నట్టు ఆ గాయాలతో ఉన్నది సోము అని అందరు గుర్తుపట్టారు , ఇంతలోనే సోము కూడా ఊరిలోకి చేరుకున్నాడు , చుస్తుండగానే ఆ ఆరుగుర్ని పల్లెలో ఉండే వాళ్ళు అందరూ చుట్టుముట్టారు , తాగిన మైకంలో ఉన్న వాళ్ళకి అంతమంది మీదపడి నాలుగు తన్నే సరికి ఎంత అనాలోచితంగా ప్రమాదంలో పడ్డం అనుకున్నారు .
సోముకి నీళ్లు తాగించి ఏమిజరిగిందో తెలుసుకోవడానికి అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు . కొంచెంసేపు తరువాత సోము మాట్లాడం మొదలుపెట్టాడు .
" 20 నిమిషాల క్రితం ఒక ఫోన్ వచ్చింది , పక్కగ్రామం ఎంపీటీసీను మాట్లాడుతున్న నువ్వు సోము పోటీచేయడం వల్ల సర్పంచ్ పదవి వేరే కులం వాళ్ళకి పోతుంది చాలా ఏండ్లనుండి మన చేతుల్లో ఉన్న పదవికి మనకు మనకు పోటీ ఎందుకు , కంకర మెషిన్ దగ్గరకురా మాట్లాడి నీకు సోముకి గొడవలు లేకుండా చేస్తాం " అనేది ఆ ఫోన్ సారాంశం .
నేను కంకర మెషిన్ దగ్గరికి వెళ్ళాను , అక్కడ మన ఊరివాళ్ళు ఉంటారు అని ఒక్కడినే కానీ ఈరోజు మెషిన్ సెలవని అక్కడికి వెళ్ళాక గుర్తుకువచ్చింది.
' ఎవరు మీరు ? పక్క ఊర్లో ఎప్పుడు మిమల్ని చూడలేదు ???
అవతలి వాడు ' మేము నీకు తెలికున్నా నువ్వు మాకు బాగా తెలుసు , మా గురించి నీకు చెప్పేంత టైం లేదు , స్ట్రెయిట్ గా పాయింట్ కి వస్తున్నా , నీ కొడుకులిద్దరూ బాగానే సంపాదిస్తన్నారు , నీకు పదవితో ఏమి అవసరం ,ఈసారికి తప్పుకొని సోముకి సపోర్ట్ చెయ్ , నెక్స్ట్ నీకోసం పని చేయడానికి సోము సిద్ధంగా ఉన్నాడు '
" ఎవరు పంపించారు మిమల్ని , నేను తప్పుకోవడానికి పోటీ చేయలేదు సోముని ఓడించాలనే నామినేషన్ వేశా , మీలాంటి ముక్కూమొఖం తెలీని వాళ్ళు వచ్చి బెదిరిస్తే వెనకడుగు వేయడానికి నేనేమి చేతకానివాణ్ణి కాదు "
" మాటాలతో వినే రకం కాదు నువ్వు "
" వెళ్లి ఆ సోము గానికి చెప్పండి mla సపోర్ట్ ఉందని ఊహల్లో ఉన్నాడు , నాకు మాజీ mla తో పాటు mla కూడా సపోర్ట్ చేస్తున్నాడని , మీలాంటి అడ్రస్ లేని వాళ్ళతో బెదిస్తున్నాడని మా ఉర్లో తెలిస్తే వాణ్ణి మిమల్ని తరిమి తరిమి కొడతారు "
" ముందు నువ్వు ఊర్లోకి వెళ్ళాలి కదరా ఈ విషయం తెలియాలంటే " అని తన దగ్గర ఉన్న రాడ్డుతో కొట్టబోయాడు , తప్పించుకున్న రాము ఊరివైపు పరిగెత్తసాగాడు , ఆరుగురు తగిన మైకంలో గుడ్డిగా రాముని వెంటపడుతూ ఉర్లోకి వచ్చి చావుదెబ్బలు తిన్నారు .
ఇన్నిరోజులు ఒరలో చిన్న చిన్న గొడవలు జరిగినా ఊర్లో పెద్దమనుషులే సర్దిచెప్పేవాళ్లు కానీ ఎప్పుడు పోలీస్ స్టేషన్ గడప తొక్కలేదు , వేరే ఊరి వాళ్ళను ఊరి గొడవల్లోకీ రాకుండా ఉండేవాళ్ళు , కానీ మొదటిసారి రాజకీయం కోసం ఒకర్నిచంపిచాలనుకోవడంతో ఊర్లో వాళ్ళ ఆగ్రహం కట్టలు తెంచుకుంది , అంతలోనే సోము కూడా అక్కడికి చేరుకున్నాడు , ఏమిజరిగింది అనేది అతనికి అర్థం అయ్యింది. ఊరిలో నాకు రాముకి ఉన్న గొడవల కారణంగా ఈ పని నేనే చేసాను అందరూ అనుకున్నారు ,కొద్దీ సేపట్లో పోలీసులు వస్తారు , మర్డర్ అట్టెంప్ కింద నన్ను కూడా జైల్లో వేస్తారు , నాకు పదవి మీద ప్రేమతో ఏదైనా చేసి సాదిస్తాను అంటే నా ప్రత్యర్థులకి డబ్బులు ఇచ్చి compromise చేపిద్దాం అనుకున్నా కానీ ఇలా చంపిద్దాం అనే ఆలోచన ఎప్పుడు రాలేదు , ఈ తప్పు నేను చేయలేదు అని చెప్పినా ఎవరు నమ్మే స్థితిలో లేరు , నన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అని బాధపడుతున్నాడు కానీ రాముని ఎవరు చంపాలనుకున్నారో అనే ఆలోచన కూడా రాలేదు . " జీవితం ఎంత చిన్నది , ఒక నెల రోజుల కిందట ఊరికి అనధికార రాజుగా ఉన్న సోము ఇప్పుడు చేయని తప్పుకి కూడా శిక్ష అనుభవించాలి వస్తుంది, "
ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకున్నాడు , జరిగిందంతా ఊర్లో జనాలు చెప్పారు , సోము కి పోలీసులకి ఉన్న సంబంధాల వాళ్ళ సోముని కేసు నుండి తప్పించడం పెద్ద విషయం కాదు ,కానీ ఎక్కడ ఊరి అందరి ముందు red handed దోకరడంతో వాళ్ళు కూడా ఏమి చేయలేకపోయారు . సోము పోలీస్ జీపు ఎక్కబోతుండగా " ఒక్క నిమిషం సార్ "
అందరూ రాము వైపు చూసారు .
" సార్ వీళ్ళకి , సోముకి సంబంధం లేదు అతన్ని వదిలేయండి "
" బాధితుడే సోముకి clean chit ఇవ్వడంతో మిగిలిని ఆరుగురిని ఎక్కించారు " ,
"నీకు ఎవరి మీద అయినా అనుమానం ఉంటె చెప్పండి " అని రాము ని మల్లి ఒకసారి అడిగారు .
" చెప్పిన మీరు చేసిది ఏమి ఉండదు అని మనుషులో అనుకోని , ఎవరి మీద లేదు సార్ వాళ్ళని విచారిస్తే ఎవడు ఉన్నదో తెలుస్తుంది " అని చెప్పటంతో పోలీసులు వెళ్లిపోయారు.
ఊరిలో అందరూ షాక్ అయ్యారు .
నాపని అయ్యిపోయింది అనుకున్న సోముకి రాము వల్ల మల్లి చచ్చి బ్రతికినట్టు అనిపించింది , కన్నిలతో వెళ్లి రాముని గట్టిగా కౌగిలించుకున్నాడు .
నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది , ఏమి జరిగింది అనేది. రాజకీయం జరిగింది అంతే అది తెలీక చాల మంది నాయకుడని ,పార్టీలని జీవితాలని నాశనం చేసుకుంటున్నారు . ఈ ఎలక్షన్స్ తరువాత అందరికి అర్థం అవుతుంది అనుకున్న కానీ ఇలా ముందే అందరికి తెలిసిపోతుంది అనుకోలేదు . మీరందరికి రాజకీయాల్లో ఒకవైపు తెలుసు నాకు తెలిసిన రెండో వైపు చెప్తాను వినండి .
మీరందరు సోము mla సపోర్ట్తో అధికార పార్టీ నుండి నేను మాజీ mla సపోర్ట్ తో ప్రతిపక్ష పార్టీ నుండి పోటీ చేసాను అనుకుంటన్నారు కదా , అది అపద్దం . నాకు ఫండ్ ఇచ్చి సపోర్ట్ చేసింది కూడా mla గారే .
అంతలో మధ్యలో ఒకరు " మరి నువ్వు మాజీ mla ను కలిసావు, ఫోన్ లో కూడా మాట్లాడావ్ కదా "
రాము " కలిసింది మాట్లాడింది నిజం , కానీ అది నామిషన్స్ కి ముందు వరకే ఆ తర్వాతే అసలు రాజకీయం మొదలయ్యింది . నామినేషన్స్ రోజు mla దగ్గర నుండి పోనే వచ్చింది "
రాము : hello ,ఎవరు ?
mla : రాము నేను mla ను మాట్లాడుతున్నా ...
రాము : హా సార్ , చెప్పండి రాంగ్ నెంబర్ కి కాల్ చేసినట్టు ఉన్నారు .
mla : రాజకీయాల్లో అందరూ అవసరమే , ఇప్పుడు నీ అవసరం నాకు వచ్చింది . నువ్వు మా పార్టీలో జాయిన్ అవ్వాలి , ఎలక్షన్ fund నేనే ఇస్తాను మొత్తం.
రాము : లేదు సారు , నేను ముందే ప్రతిపక్ష పార్టీలో చేరాను , ఆ పార్టీ నుండే పోటీ చేస్తాను,గెలిచినా ఓడినా .
mla : నువ్వు అమాయకుడిలా ఉన్నావ్ కదయ్యా . ఈసారి కూడా రాష్ట్రంలో మేమె అధికారంలోకి వస్తాం . ఎలక్షన్స్ తరువాత మీ నాయకుడు కూడా మా పార్టీలోకి వస్తారు ,మాలాంటి పెద్దనాయకులకే పార్టీల మీద లేని ప్రేమ మీకెందుకు .
రాము : మరి మీ పార్టీ నుండి సోము పోటీ చేస్తున్నాడు కదా సార్ .
mla : సోము కి టైం వచ్చినపుడు నేనే చెప్తాను , అంతవరకు ను ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు .
రాము: సరే సార్ , ముందు నేనైతే గెలవాలి కదా , తప్పకుండ మీకే సపోర్ట్ చేస్తాను .
అని చెప్పాను , ఆ తర్వాత మాజీ mla నాకు ఫోన్ చేయలేదు , నేను కూడా సోముని ఓడిస్తే చాలని mla మాటకి ఒప్పుకున్నాను. కంకర మెషిన్ దగ్గర వాళ్లతో మాట్లాడుతుంటే వాళ్లలో ఒకడు ఎవరికో ఫోన్ చేసాడు అప్పుడు ఆ ringtone కొంచెం వినిపించింది , ఆ ringtone mla గారి pa ringtone ఒకేలా ఉంది .
"అంటే ఇదంతా ఆ mla చేపించి ఉంటాడా ?????"
రాము: " నన్ను చంపంచాలి అని అనుకోని ఉండదు , కానీ నా మీద దాడి చేస్తే నేను సోము మీద అనుమానంతో complaint చేస్తే తను పోటీలో లేకుంటే నేను గెలవచ్చు , లేదంటే వాళ్లకు బయపడి నేను పోటీ నుండి తప్పుకుంటే అప్పుడు సోము గెలుస్తాడు , మా ఇద్దరిలో ఎవరో ఒకరు గెలవాలంటే ఒకరే పోటీలో ఉండాలి ,లేకుంటే మేము కాకుండా వెంకీ గెలిస్తే మొదటికే మోసం వస్తుంది . "
సోము: mla ను ఎంతో నమ్మాను ఇప్పుడు నన్నే కేసుల్లో ఇరికించాలని చుసాడు .నేను సర్పంచ్ గా గెలవక పోయినా పర్లేదు , కానీ mla అయితే ఓడించాలి లేకుంటే ఇలాంటి రాజకీయాలు చేసి పచ్చని పల్లెలు నాశనం చేస్తారు .
--------------------------------------------------------------------------------------------------------------------------
పార్ట్-4
వోటింగ్ ముందు రోజు నైట్
ముందు రోజు అంత జరిగాక ఊరిలో అందరికి ఒక క్లారిటీ ఐతే వచ్చింది రాముకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయ్ అని , కొందరు మాత్రం చాలా భాదపడుతున్నారు రాము సోము ఇద్దరు పోటీలో ఉన్నారు ఇద్దరు డబ్బులు పంచితే ఎక్కువ డబ్బులు వస్తాయి అని ఆశపడేవాళ్లు బాధలు వర్ణనానీతం . మామూలు రోజులు అయితే ఈ పాటికే ఊరు సగం నిద్రలో ఉండేది , రేపు ఎలక్షన్స్ ఉన్నాయ్ కాబట్టి సమయం రాత్రి 12 గంటలు అయినా చాలా ఇళ్లలో లైట్స్ వెలుగుతూనే ఉన్నాయి .
ఇదే మంచి టైం అనుకోని నలుగురు డబ్బులున్న బాగ్ పట్టుకొని ఇంటింటికి తిరిగి ఎవరి కంటా పడకుండా పంచేస్తున్నారు, అందరికి తెలిసిన బహిరంగ రహస్యమే అయినా ఓటుకు నోటు అనేది తప్పు అని వాళ్ళు ఫీల్ అవడంబట్టే దొంగచాటుగా పంచుతున్నారు . ఈసారి అందరూ సోము అంత ఇస్తాడు అనే ఆలోచనలో ఉన్నారు కానీ వాళ్ళ ఆశలు అడియాసలు అయ్యాయి , రాము మనుసులు చక్రం మనుసులు ఇచ్చేసి వెళ్లారు , వెంకీ ఆలాగు డబ్బులు ఇవ్వడని అందరికి తెలుసు. చూస్తుండగానే తెల్లారింది . ఎలక్షన్ అధికారాలు పోలీసులు అందరూ వోటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఊరిలో ఎక్కువ శాతం వచ్చి ఓట్లు వేశారు . మధ్యాహ్నం 3 గంటల నుండి కౌంటింగ్ స్టార్ట్ చేసారు . కానీ ఎక్కువ మందిని ఒకటే ఆలోచన తొలిచేస్తోంది " సోము డబ్బులు ఎందుకుఇవ్వలేదు, ఒకవేళ ఇచ్చినా అందరికి ఇచ్చి మాకు మాత్రమే ఇవ్వలేదా , ఎవరు గెలుస్తారు"అని .
రౌండ్-1 :
వెంకీ - 123
సోము - 98
రాము - 112
చక్రం- 178
రౌండ్-2 :
వెంకీ - 280
సోము - 200
రాము - 250
చక్రం- 240
రౌండ్-3
వెంకీ - 350
సోము - 250
రాము - 350
చక్రం- 270
రౌండ్-4
వెంకీ - 516
సోము - 261
రాము - 701
చక్రం- 370
మొత్తం కౌంటింగ్ పూర్తిఅయ్యాక రాము 215 ఓట్ల మెజార్టీతో రెండో స్థానంలో ఉన్న వెంకీ మీద గెలిచాడు .
సోము సపోర్టర్ : అప్పటికి సోము గెలుస్తాడు అని బాణాసంచా ముందే తెచ్చి పెట్టుకున్నాడు .
రాము సపోర్టర్ : ఆలాగు తెచ్చావ్ వేస్ట్ చేయడం ఎందుకు , ఎంత అయినాయో చెప్పు ఆ పటాకులు మాకు ఇచ్చేయ్ .
సోము సపోర్టర్ : 500 తక్కువ ఇచ్చి అయినా తీసుకో .
రాము సపోర్టర్ : లేదు extra 500 ఇస్తాను తీసుకో.
సోము సపోర్టర్ : సోము గెలవక పోయిన 500 లాభం వచ్చింది మనకు.
indirect గా సోము సపోర్ట్ చేయడం వాళ్ళ రాము గెలుపు సాధ్యమయింది . ఈ విషయం రాముకి కూడా అర్థం అయ్యింది. రాముడు సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసాడు . తనకు ఓడిన ముగ్గురి నుండి అభినందలు వచ్చాయి.
ఆరోజు నైట్ :
గ్రామంలోని అందరూ రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టుకున్నారు .
మొదటగా సోము మాట్లాడుతూ " అందరికి నమస్కారం , మీ అందరికి ఒక డౌట్ ఉంటుంది , ఎన్నో సంవత్సరాల నుండి నేను ఎదురు చుసే పదవి కోసం , అది నాకు సొంతం అయ్యే ఒకరోజు ముందు ఎందుకు పోటీ నుండి తప్పుకున్నానో అని , రాము లేకుంటే ఈరోజు ఇక్కడ మాట్లాడ వాడినే కాదు , నేను శత్రువు అనుకునే వ్యక్తి నన్ను కాపాడాడు , అందుకే అతన్ని గెలిపించి ఋణం తీర్చుకున్నాను , ఇక మిగిలింది ఊరి ఋణం , దానికోసం 15 లక్ష్లలు ఇస్తున్నాను, ఇవి మీకు పంచి గెలుద్దాం అనుకున్నా, కానీ గెలవడం కన్నా ఈ డబ్బుతో ఊరికి మంచి జరుగుతుంది అని నమ్మి పోటీ నుండి తప్పుకున్నాను, నేను డబ్బులు ఇవ్వకున్నా నాకు ఓట్లు వేసినవారికి దన్యవాదాలు . ఎన్ని రోజులు నాకున్న పరిచయాలను నాకోసం మాత్రమే వాడుకున్నాను,ఇప్పుడు ఈ ఊరికోసం మీకోసం నా వంతు సాహయం చేస్తాను. "
రాము: మోడోడు, పంతాలకు పోయేవాడు ఈ ఊరికి ఏమి చేస్తాడు అని, ఎప్పుడొ జరిగిన చిన్న గొడవను గుర్తుపెట్టుకొని సోముని ఓడించాలని పోటీ చేసాను ,కానీ ఇప్పుడు సోము నాకంటే బాగా అలోచించి పోటీ నుండి తప్పుకున్నాడు , మీరంతా ఒప్పుకుంటే ఇప్పుడే ఈ పదవికి రాజీనామా చేసి వెంకీ ని సర్పంచ్ చేస్తే , ఊరికి ఏమి చేయాలి ఎలా అభివృద్ధి చేయాలి అనే ప్రణాళికలు ఉన్నాయి కాబట్టి బాగా డెవెలప్ చేస్తాడు అనే నమ్మకం ఉంది , మీ అభిప్రాయాలు చెబితే దానిప్రకారమే నడుచుకుంటాను "
వెంకీ: మీఅందరికి thanks . నేను పదవి ఉంటేనే ఊరి కోసం ఏదోఒకటి చేస్తాను అనుకోవద్దు , పదవిలో ఉండి మీరు సహకరిస్తే ఊరికోసం నెలకు పది రోజులు పని చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే . మీఅందరికి ఒక విషయం చెప్పాలి , రాజకీయాలు ఎంత కఠినంగా ఉంటాయో మన అందరికి ఈ ఎలక్షన్స్ లో తెలుసుకున్నాం. అందుకే ఇకమీదట అయినా సర్పంచ్ ఎలక్షన్స్ లో పార్టీలకు సంబంధం లేని వ్యక్తులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రభుత్వం నుండి ప్రోత్సహకంగా 10 లక్షలు డబ్బులు వస్తాయి , ఊరిలో గొడవలు ఉండవు , అయిదు వందలు మందు కోసం అయిదు సంవత్సరాలను మిమల్ని అమ్మోకోకండి , .
ప్రతియేడు లాగే డబ్బులు ఉన్నాయ్ అని , లేకంటే పక్కన వాళ్ళు రెచ్చగొడితేనో పోటీ చేస్తే ఉన్న డబ్బులు పోతాయ్ , అప్పులు పెరుగుతాయ్ అంతే .
నాయకులని నమ్మి మోసపోయిన ఎన్నో పల్లెల్లా కాకుండా , సర్పంచ్ గ ఎవరు గెలిచినా అధికార పార్టీ లో ఉండి ఊరికి మంచి చేస్తే చాలు.
No comments:
Post a Comment