భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రసిద్ధ సంస్థ... డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ). దీనిలో ఉద్యోగం సాధించాలని చాలామంది ఆశిస్తుంటారు. ఇలాంటివారికి ఇప్పుడో మంచి అవకాశం వచ్చింది. డీఆర్‌డీఓకు సంబంధించిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టమ్) 494 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ‘బి’ పోస్టుల నియామకానికి ప్రకటన విడుదల చేసింది!
ఉత్తేజకరమైన, సవాళ్లతోకూడిన కెరియర్‌ను కావాలనుకునేవారు ఈ పోస్టులకు పోటీపడవచ్చు. ఎంపికైనవారు దేశవ్యాప్తంగా 60 లేబొరేటరీల్లో డిఫెన్స్ సిస్టమ్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సంబంధిత కార్యకలాపాలపై పనిచేయాల్సి ఉంటుంది.
అర్హత: సైన్స్ విభాగంలో డిగ్రీ/ మూడేళ్ల ఇంజినీరింగ్/ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్ డిప్లొమా/ తత్సమాన విద్య పూర్తిచేసినవారు అర్హులు. సంబంధిత కోర్సుల తుది సంవత్సరం చదువుతున్న, పరీక్షలు రాసి ఫలితాల కోసం వేచి చూస్తున్నవారు అనర్హులు. బీఎస్‌సీ అభ్యర్థులు పోస్టుకు సంబంధించి అర్హత సబ్జెక్టును కనీసం రెండేళ్లయినా చదివుండాలి. అర్హత కంటే ఎక్కువ డిగ్రీ కలిగినవారు.. అంటే ఎంఎస్‌సీ, బీటెక్, బీఈ, పీహెచ్‌డీ మొదలైనవి ఉన్నవారిని అనర్హులుగా పరిగణిస్తారు.
వయసు: 18-28 ఏళ్లవారు అర్హులు. ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ, ఈఎస్‌ఎం, పీడబ్ల్యూడీ వారికి సడలింపు ఉంటుంది.
అర్హత: సైన్స్ విభాగంలో డిగ్రీ/ మూడేళ్ల ఇంజినీరింగ్/ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్ డిప్లొమా/ తత్సమాన విద్య పూర్తిచేసినవారు అర్హులు. సంబంధిత కోర్సుల తుది సంవత్సరం చదువుతున్న, పరీక్షలు రాసి ఫలితాల కోసం వేచి చూస్తున్నవారు అనర్హులు. బీఎస్‌సీ అభ్యర్థులు పోస్టుకు సంబంధించి అర్హత సబ్జెక్టును కనీసం రెండేళ్లయినా చదివుండాలి. అర్హత కంటే ఎక్కువ డిగ్రీ కలిగినవారు.. అంటే ఎంఎస్‌సీ, బీటెక్, బీఈ, పీహెచ్‌డీ మొదలైనవి ఉన్నవారిని అనర్హులుగా పరిగణిస్తారు.
వయసు: 18-28 ఏళ్లవారు అర్హులు. ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ, ఈఎస్‌ఎం, పీడబ్ల్యూడీ వారికి సడలింపు ఉంటుంది.
ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు?
అగ్రికల్చర్-4, ఆటోమొబైల్ ఇంజినీరింగ్-6, బోటనీ-3, కెమికల్ ఇంజినీరింగ్-13, కెమిస్ట్రీ-24, సివిల్ ఇంజినీరింగ్-4, కంప్యూటర్ సైన్స్-79, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్-16, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్-35, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్-7, ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్-100, జియాలజీ-3, ఇన్‌స్ట్రుమెంటేషన్-5, లైబ్రరీ సైన్స్-11, మేథమేటిక్స్-8, మెకానికల్ ఇంజినీరింగ్-140, మెటలర్జీ-8, ఫొటోగ్రఫీ-2, ఫిజిక్స్-16, సైకాలజీ-5, జువాలజీ-5.
అవసరాన్నిబట్టి ఖాళీల సంఖ్యలో మార్పులు జరిగే అవకాశముంది. జీతభత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు మెడికల్ ఫెసిలిటీ, లీవ్ ట్రావెల్ కన్సెషన్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ మొదలైన వాటితో కలిపి నెలకు రూ.50,000 చొప్పున చెల్లిస్తారు. |
ఎంపిక విధానం ఎలా?
కంప్యూటర్ ఆధారిత రెండు పరీక్షలు (టయర్-1, టయర్-2), ప్రిలిమినరీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. పరీక్ష హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటుంది.
టయర్-1: ఇది స్క్రీనింగ్ టెస్ట్. దీనిలో క్వాంటిటేటివ్ ఎబిలిటీ/ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ సైన్స్‌పై ప్రశ్నలుంటాయి. మొత్తం ప్రశ్నలు-150. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. 120 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. కనీసం 40% మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 35%. 1:10 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు. దీనిలో అర్హత సాధించినవారిని టయర్-2 పరీక్షకు పిలుస్తారు. టయర్-2: ఇది సెలక్షన్ టెస్ట్. దీనిలో దరఖాస్తు చేసుకున్న పోస్టుకు సంబంధించిన సబ్జెక్టుపై ప్రశ్నలుంటాయి. మొత్తం 100 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. 90 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. కనీస అర్హత మార్కులు 40%. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు 35% శాతం సాధించాల్సి ఉంటుంది. టయర్-1 పరీక్షకు దేశంలోని కేటాయించిన 47 కేంద్రాల్లో మూడింటిని ఎంచుకునే అవకాశం అభ్యర్థికి ఉంటుంది. టయర్-2కు సెప్టమ్ కేటాయించినచోటే పరీక్ష రాయాల్సి ఉంటుంది. అభర్థికి ఎంచుకునే వీలు లేదు. |
దరఖాస్తు ఎలా?
డీఆర్‌డీఓ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా అభ్యర్థి తన ప్రాథమిక వివరాలను అందించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అపుడు ఐడీ, పాస్ట్‌వర్డ్ లభిస్తాయి. వీటి ద్వారా దరఖాస్తు పూర్తిచేయవచ్చు. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.100. ఎస్‌సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించనక్కర్లేదు. దరఖాస్తు పూర్తయ్యాక ప్రింట్‌అవుట్ తీసుకోవాలి.
దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: ఆగస్టు 29, 2018. పరీక్ష తేదీ: ఇంకా ప్రకటించలేదు. వెబ్‌సైట్: www.drdo.gov.in |
No comments:
Post a Comment