Saturday, June 4, 2016

Short story2: మాయమైపోతున్నాడు మనిషిన్నవాడు !

Inspiration by song https://youtu.be/6_46UREtR5A

Present days schooling and parents attitude

మాయమైపోతున్నాడు మనిషిన్నవాడు !

పుట్టుకతోనే ఎవరు చెడ్డవారిగా పుట్టరు వారు పెరిగే వయసులో వారు చూసిన మనుషులనుండే వారు నేర్చుకుంటారు.కొందరు తప్పును చూసి అది చేయకూడదు అని తెలుసుకుంటే, మరి కొందరు ఆ తప్పులనే నేర్చుకుంటారు, వారికి ఎదితప్పో ఎదిమంచో చెప్పాల్సిన బాధ్యత తల్లితంద్రులమీదనే ఎక్కువ వుంటుంది. చిన్నచిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు(ముక్యంగా ర్యాంకులు రావటం లేదని) ఈ రోజుల్లో ఎటువంటి కష్టాన్ని అయినా దైర్యంగా ఎదుర్కునే మనో ధైర్యాని ఇవ్వాల్సిన భాద్యత తల్లితండ్రుల మీద ఉంది గుర్తుచేస్తూ  మీకోసం.... 

దేవత  : ఏమిటి స్వామీ మీరు మారార ఇంక ఎప్పుడు పరధ్యానంలో  ఉంటారా !
దేవుడు : ఏమి లేదు .
దేవత  :: మరి ఎందుకు స్వామీ అలా ఆలోచిస్తున్నా ఏమి కష్టం వచ్చిందని ?
దేవుడు : నీకు తెలుసుకదా నా ఆవేదనంత ఈ మనుషులగురుంచే రోజురోజుకి ఈ లోకంలో మనిషి అన్న వాడు మాయమైపొతున్నా రు . భవిష్యత్తులో మనుషులే ఉండరేమో?
దేవత  : అలా అంటారేంటి స్వామి భూలోకంలో త్వరలో జనాభా 1000 కోట్లకు చెరుకుంటుందట  కదా  స్వామి ?
దేవుడు :. జనాభా పెరుతున్నది కాని అందులో మానవత్వం ఉన్న మనుషులు రోజురోజుకి అంతరించిపొతున్నారు.
ఈ భూమి మీద  మానవుడు అవతరించిన తర్వాత మొదట్లో తన ఆహారం ,ఆత్మరక్షణ కోసం మాత్రమే వేరే ప్రాణులను చంపేవాళ్ళు . కాని ఇప్పుడు తన అవసరానికి మించి స్వార్థంతో తన తోటి జీవరాశులు అంతరించిపోవడానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో  కారణం అయ్యాడు. ఈ మనుషులు వాళ్ళ గురుంచి వాళ్ళు కలలుకనడం మానేసి ఎప్పుడు తన వాళ్ళ (పిల్లలు,కుటుంబం )  గురించి ఆలోచిస్తూ ఎప్పుడూ సంపాదన మీద దృష్టి పెట్టి తన పిల్లలను కూడా డబ్బులు సంపాదించే యంత్రాల లాగ తయారుచేస్తున్నారు కాని వారిని మనుషులాగా పెంచటంలేదు.
దేవత  : అంటే ప్రస్తుతం జరిగే అన్ని అనర్థాలకు తల్లితండ్రులదేనా బాద్యత.
దేవుడు : వంద శాతం అందులో ఎ సందేహం లేదు , ఈ సమస్త జీవకోటిలో ఎ జీవికి లేని తెలివితేటలు వున్న మనిషి తనే సృష్టించిన డబ్బులుకోసం ఎంతకైనా దిగాజారడానికి సిద్దంగా వున్నాడు మానవత్వాన్ని కూడా మరిచిపొయి ప్రవర్తిస్తుంటారు అప్పుడప్పుడు . అయిన ఈ తల్లితండ్రులు ,ఈ లోకం ఈ సమాజానికి గొప్పగొప్ప ఇంజనీర్లను,డాక్టర్లను,ఆదికారులను అందిస్తున్నారు కాని ఒక మంచి మనిషిని  మాత్రం తాయారు చేయలేక పోతున్నారు.
దేవత  : తల్లితండ్రులు ఏమి చేసినా తన పిల్లలు బాగా ఉండాలనే ప్రేమతోనే కదా చేసేది .
దేవుడు : హా నిజమే కాని వారి దృష్టిలో ప్రేమంటే వారిని పెద్దపెద్ద schools లో చదివించడం ,బాగా ఆస్తులు సపాదించిపెట్టడం ఇది  వారి దృష్టిలో తల్లితండ్రుల బాద్యత అంటే ,  పిల్లలు ఏమి కోరుకుంటున్నారో వారికి అవసరం లేదు. చదువు,ఉద్యగం అవి రెండే వుంటే చాలు అనుకుంటారు . అవి తప్ప ఈలోకంలో వారికి వేరే జీవితాలే కనిపించవు.
అయిన పిల్లల వయసుకి , వారు కట్టే పీజులకు ఏమాత్రం సంబందం వుండదు. అన్ని పీజులు కట్టి చదివిస్తున్నా వారికి బ్రతకడం ఎలాగో కూడా నెర్పించరు , ర్యాంకులు రాలేదనో,పాస్ అవ్వడం లేదనో ప్రతి చిన్న విషయాల్ని కుడా దైర్యంగా ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారికి తెలీనీ విషయం ఏమిటంటే ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాళ్ళు ఎవరు లక్షలు పీజులు కట్టి చదవలేదు మరియు పెద్దపెద్ద డిగ్రీలు చేయలేదు ( eg; most of the cricketers ,cinestars sports stars, political leaders). అంత ఎందుకు ఒకప్పుడు వాళ్ళు మాత్రం ఎన్ని ఫీజులు కట్టి చదివారు,వారు ఉన్నత మైన స్థితిలో లేరా ఆనందంగా లేరా మరి వాళ్ళు చదివిన వీది బడులు మంచివి కావ ? ఒకసారైన ఆలోచించారా వారి బాల్యం ఎంత ఆనందగా గడిపారో ఎన్ని ఆటలు ఆడారో మరి అదే ఆనందాన్ని తమ పిల్లలకు దక్కకుండా 24 గంటలు చదువులంటూ వారిని కనీసం ఆటలు ఆడేందుకు వీలు లేకుండా వారికి వీడియో గేములు అలవాటు చేసి నిజమైన జీవితాన్ని ,ఆనందాన్ని వారికి లేకుండా చేస్తున్నారు.ఇప్పుడు వారికోసం పుట్టినపుడు నుండే playschools మొదలైయాయ్. ఈ పోటీ ప్రంపంచంలో తల్లితండ్రులు ఇద్దరు ఉద్యోగాలతో busy గా వుండడం వాళ్ళ ఇటువంటి స్కూల్స్ లో చేర్పిస్తున్నారు, వీరికి పిల్లలకంటే డబ్బులు ఎక్కువైతే ,డబ్బులు కోసమే పెట్టిన స్కూల్స్ కి మాత్రం డబ్బులు ముక్యమా పిల్లలా అనేది వారు ఎందుకు ఆలోచించరు. 
                  అయిన ఒకప్పుడు తల్లితండ్రులు బిజీగా వున్నా ఇంట్లో వున్న అవ్వాతాతలు వారికి ఎన్నో మంచి మాటలు,కథలు చెప్పి ఆడిపించుకోనేవారు. వారికి మనుషుల విలువలు,మనవ సంబందాలు గురించి కొంచెమైన తెలిసేది.కాని ఇప్పటి తరానికి అవసరానికి మాత్రమె వచ్చేవాళ్ళు బందువులు అని స్థాయికి వచ్చింది.ఒకప్పుడు ఇంటినిండా జనాలు వుండేవారు, మనకు ఏదైనా అవసరమైన ,ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్న direct గా అమ్మానాన్నలతో చెప్పలేని విషయాలను ఇంట్లో వున్నా అక్కో,అన్నో,పిన్నో, బాబాయో ఇలా ఎవరోఒకరు మనకు సమర్థించె వాళ్ళు వుంటారు , ఒకవేళ చిన్న చిన్న తప్పులు చేసినా దైర్యంగా తప్పు సరిద్దిద్దుకోవడానికి ,ఎటువంటి పరిస్తితులోనైన మనము ఒంటరి కాదు అనే దైర్యం వుంటుంది. ఎప్పుడు ఉమ్మడి కుటుంబాలు తగ్గి పోవడం వాల్ల పిల్లలతో time spend చేసే వారు లేక, వారి సంతోషాలని కానీ కష్టాలని కానీ పంచుకొనేవారు లేకపోవడడం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, తల్లితండ్రుల బిజీ లైఫ్ లో పిల్లలు చేడుదరుల్లో వెళ్తున్న గమనించలేక జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత బాదపదేకంటే ముందే మేల్కొని వారికి చదువు ఒకటే కాదు మన్వత్వవిలువలు కూడా నేర్పించాలి .  ఈ లోకంలో అన్నిటికి కన్నా దరిద్రం ఏదైనా వుంది అది ఒంటరితనం మాత్రమే.కాని డబ్బులు వుంటే చాలు మనం సంతోషంగా ఉండొచ్చు,అనుభందాలు కుడా డబ్బుతోనే వస్తాయ్ , డబ్బు ఉంటేనే అన్ని ఉంటాయ్ అనుకుంటారు, డబ్బు వుంటే ఆనందంగా ఉండొచ్చు అనేది ఎంత నిజమో డబ్బులు వున్న వాళ్ళందరూ సంతోషంగా లేరనేది కుడా అంతే నిజం.ఈ లోకంలో కొటిశ్వర్లు చాలా తకువమంది ఉన్నారు , కాని వాళ్ళు మాత్రమె సంతోషంగా వున్నారనేది అబద్దం , అంత డబ్బులు లేనివారు కూడా చాలా సంతోషంగా వున్నరు. డబ్బుతో ముడిపడిన సంతోషం చాలా తక్కువ,డబ్బుతో కొనలేని సంతోషాలు చాలానే ఉన్నయ్  ఈ లోకంలో, డబ్బులు లేనివాళ్ళు ఆత్మాహత్యాలు చేసుకుంటున్నారు వారి కష్టాల వల్ల , అలాగే డబ్బులు వున్నవాల్లుకూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆర్ధిక లావాదేవిల వల్ల, ఒంటరితనం వాళ్ళ కొందరు (ex : సిని ఆర్టిస్ట్  రఘునాధ్ గారు ,తనకి కావలిసి డబ్బులు ఉన్నాయ్ ,ఆస్తులు ఉన్నాయ్, తన పిల్లలు well settled అయిన ఆయన ఆత్మాహత్య చేసుకున్నారు కారణం ఒంటరితనం, ఒంటరిగా వున్నపుడు నాలుగు మాటలు మాట్లాడే వారు లేకపోవడం చాలా విచారించదగ్గ విషయం). ఇప్పుడు జరిగే అనర్థాలకు డబ్బు కుడా ఒక ముక్యమైన కారణం , అలాగే డబ్బుకోసం ఈ మానవులు మానవత్వాన్ని మరిచిపొతున్నరు. తనలోని మనిషి చంపేసి ఒకా యాంత్రిక జీవేతంలో గడుపుతున్నారు. 
దేవత  :  కాని స్వామీ ఈ రోజులలో డబ్బులు లేకుండా ఒక చిన్న పని కూడా జరగడ స్వామీ ?
దేవుడు : నిజమే తన అవసరాల మేరకు కష్టపడాలి, అంతే కాని జీవతంలో ఎక్కువ సమయాన్ని డబ్బులు కోసమే పనిచేస్తుంటే ,ఎవరికోసమైతే(తన కుటుంబం ) అంత కష్టపడుతున్నారో వల్లే తనని శత్రువుగా చూసే ప్రమాదం వుంది. ( తన బర్త/భార్య/తల్లి/తండ్రి  family తో ఎక్కువ time spend చేయలేదని  మనస్పర్థలు  వస్తున్నయ్ ) , మనిషి అన్నవాడికి ఎంత సంపాదించినా ఇంకా ఇంకా అనే అశ చావదు,కాబట్టి వీరు ఎన్ని ఆస్తులు కూడబెట్టిన వారి పిల్లులు సంతృప్తి చెందుతారని నమ్మకం లేదు మరి అలాంటపుడు వాళ్ళు మనసు చంపుకొనే తప్పులు చేసి , జీవితాంతం కష్టపడేకంటే , వున్నదానిలోనే తక్కువ కష్టపడుతూ ఎక్కువ సమయాన్ని కుటుంబానికి కేటాయించి ఒక మంచి తండ్రిలా ,తల్లిలా ఒక మనిషిలా బ్రతికి ,తన పిల్లల్ని కూడా మనుషులాగే పెంచితే ఈ లోకంలో అందరు బాగుంటారు. అయిన ఇంత చేసిన తల్లితండులకు ఈరోజులలో గుర్తింపు ఏమిటంటే వారిని తీసుకెళ్ళి వృద్దాశ్రమంలో  చేర్పించెంత సంస్కారాన్ని వాళ్ళే నెర్పిచామ్ అనే విసయాన్ని మరిచిపోయి వారిని తిట్టుకుంటూ ఉంటారు పాపం ఈ మనిషి కాని మనుషులు. 
దేవత  :  అయ్యిందా స్వామీ నీ lecturer (ఉచిత సలహాలు). 
దేవుడు : ఈరోజుకి completed but సెప్పల్సినవి చాలా ఉన్నయ్. 
దేవత  : deeeeeeeeeevudaaaaaa....... 


                " LESS WORK,ENOUGH MONEY AND MORE FAMILY TIME "

Co writer :  JP



No comments:

Post a Comment