Tuesday, May 31, 2016

పురాణాలలో గోవు యొక్క విశిష్టత


ప్రపంచం లో ఆక్సిజన్ పీల్చుకొని, ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి మన గోవు. గోవు అడుగులయందు అష్టైశ్వర్యములుండును. గిట్టల మధ్యన గంధర్వులుందురు. పాదాలయందు చతుర్వేదములుండు
పిక్కలయండు గుడి గంటలుండు గిట్టల చివర పన్నగులుందురు గిట్టల ప్రక్కలో అప్సరసలుందురు
తొడలయందు సర్వలోక తీర్ధములుండు పొదుగున పుండరీకాక్షుడు ఉండును చనులయందు సాలగ్రామాలుండును పితుకుల యందు సప్త సముద్రములుండు నాభియందున శ్రీకమలముండు కడుపున భూదేవి స్థిరముగానుండు తోకను సోముడు నివసించుచుండునుతోకయందలి రోమాల సూర్యరశ్మి యుండు ఉర మధ్యమున ఋషులు నివసింతురు. చర్మమున సకల శుభములు వర్ధిల్లు శరీరములోని రోమాల సకల దేవతలు ఉండు మాంసమున మాధవుడు నిలయమై ఉండు ఎముకల యందు బ్రహ్మ నివసించు పృష్ట భాగమున ఏకాదశ రుద్రులు ఉండెదరు హృదయమున సాధ్వులు వసించుచుందురు మూపురమున చుక్కలు మెరయుచునుందురు మెడను ఇంద్రుడు నివసించుచుండు పెదవులు వైకుంట ద్వారములగును నాలుకయండు నారాయణుడుండు దవడలయందు ధర్మదేవత యుండు నోరున లోకేశము నిలయమై యుండు హుంకారమున సరస్వతీ దేవి నివసించు ముక్కున శీతాచల పుత్రి యుండు ముక్కు కాడన కుమార స్వామి వర్ధిల్లు గడ్డము కైలాస శిఖరమై యుండు నుదురున పరమేశ్వరుడు నివసించును నేత్రముల సూర్య చంద్రులు మెరయు కర్ణముల అశ్వనీ దేవతలు వెలయు కొమ్ములు గోవర్ధన పర్వతములగును కొమ్ముల కొసలు సర్వ తీర్ధములగును గోవు పాలయందు సరస్వతీ నదియు, పంచితమున గంగానదియు, గోమయమున శ్రీమహాలక్ష్మియును ఆజ్యమున అగ్నిదేవుడును నివసించును
మనం తల్లి గా భావించే ఈ గోవు తో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం, వాటితో పాటు కొంత సమయం గడపటం వల్ల, మన శరీరం లో వున్న అనారోగ్యాన్ని , ఆ గోవు ముక్కు లో వున్న ఒక గ్రంధి ద్వారా గ్రహిస్తుంది, తరువాత మేత కు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డి ని తిని, అందుకు తగిన విధం గా పాలు ఇస్తుంది, ఆ పాలు తాగడం వల్ల మన వ్యాధి నయం అవుతుంది. ఇది మహా అద్భుతం. అందుకే ప్రతి ఒక ఇంట్లో ఒక గోవు వుంటే దైవం మన వెంటే వున్నట్లు మన పురాణాల లో చెప్పారు.మన భారత దేశం లో జాతి ఆవులు 36 రకాలు, ప్రపంచం లో వింత వ్యాది సోకడం తో ఎన్నో జాతులు నశించిపోయాయి. కాని మన జాతి గోవు జాతు ల పై ఆ ప్రభావం పడలేదు. ఎండకు, వానకు, చలి కి అన్నిటికి తట్టుకొని జీవించింది. ఏ శాత్రవేత్తలకు అర్థం కానిది మన గోవు, వారు ఎన్ని జన్యు మార్పిడి లు చేసిన జాతి అయిన ఆన్ని వాతావరణాల కు తట్టుకోలేక పోతున్నాయి ఆ కృతిమ జాతులు. అందుకే ప్రపంచం లో ఎన్నో దేశాలు మన గోవు ను ఎగుమతి చేసుకొని వృద్ధి చేసుకొంటున్నారు. ఇక గోమూత్రం లో 47 రకాల మూల పదార్థాలు వున్నాయి. మన పురాణాల లో చెప్పిన పంచాకవ్యం లో ని 64 సూత్రాల పైన జరిగిన పరిశోధన తో గోమూత్రం మరియు గోవు పేడ తో 300 రకాల మానవుల ఆరోగ్యానికి సంబంధించిన అవుషదాలు కనుగోన్నారు. అలానే వ్యవసాయానికి సంబంధించిన 25 రకాల అవుషదాలు కూడా కనుగొన్నారు. ఈ అవుషదాలు ప్రకృతి సహజమైనవి, ఎంటువంటి రసాయనాలు అవసరం లేకుండా తయారు చేసుకోవచ్చు. అందుకే మాన భారతీయ సంస్కృతి ని గోసంస్కృతి అని కూడా అంటారు, గోవు యొక్క విశిష్టత ఎంతో అందుకే మన పూర్వికులు మన పురాణాల లో ఎప్పుడో చెప్పారు. అందుకే మన గోవు ని మనం రక్షించుకొందాం, మన సంస్కృతి ని మనం రక్షించుకొందాం. ఆరోగ్యం మరియు ఆనందం మన సొంతం.

No comments:

Post a Comment