Tuesday, July 30, 2019

AP GRAMA SACHIVALAY JOBS : గ్రామ, వార్డు సచివాలయాల్లో80% ఉద్యోగాలు స్థానికులకే...

గ్రామ, వార్డు సచివాలయాల్లో80% ఉద్యోగాలు స్థానికులకే...

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో భర్తీ చేయనున్న 1,26,728 ఉద్యోగాల్లో 80 శాతం పోస్టులను స్థానికులకే కేటాయిస్తారు.
మిగిలిన 20 శాతం పోస్టులను ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. జిల్లాను యూనిట్‌గా తీసుకుని అభ్యర్థుల స్థానికతను గుర్తిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏడేళ్ల కాలంలో నాలుగేళ్లపాటు ఏ జిల్లాలో చదువుకుంటారో సదరు అభ్యర్థిని స్థానిక కేటగిరీగా గుర్తిస్తారు. ఆ జిల్లాకు కేటాయించిన మొత్తం పోస్టుల్లో 80 శాతం వారితోనే భర్తీ చేస్తారు. ఒక జిల్లాలో ఎక్కువ కాలం చదివి.. వేరే జిల్లాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే ఓపెన్ కేటగిరీలో 20 శాతం మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఈ విషయాలను స్పష్టంగా పేర్కొంది.  

 వయో పరిమితి.. జీతం ఇలా... గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితి 18నుంచి 42 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గరిష్ట వయో పరిమితిలో ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్ల సడలింపు అమలు చేస్తారు. సంబంధిత ఉద్యోగంలో ఇప్పటికే ఔట్ సోర్సింగ్‌లో పని చేస్తున్న వారికి వయో పరిమితిలో వారి సర్వీసు కాలానికి సడలింపు ఇస్తారు. గరిష్ట వయో పరిమితిలో అత్యధికంగా ఐదేళ్ల సడలింపు ఇస్తారు. జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో జరిగే రాత పరీక్ష  అనంతరం ఎంపికయ్యే అభ్యర్థికి మొదటి రెండేళ్లు రూ.15 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించి, ఆ తర్వాత పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగి హోదా కల్పిస్తూ బేసిక్ శాలరీ అమలు చేస్తారు. పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులకు రూ.15,030 నుంచి రూ.46,060 మధ్య బేసిక్ శాలరీ నిర్ణయించగా.. మిగిలిన పోస్టులకు రూ.14,600 నుంచి రూ.44,870 మధ్య బేసిక్ శాలరీగా అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు.  
 
 దరఖాస్తు విధానం : 
 గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం మూడు వెబ్ పోర్టల్స్‌ను ఏర్పాటు చేసింది. ఏ వెబ్ పోర్టల్‌ను ఓపెన్ చేసినా.. ఒకే తీరున మొత్తం ఐదు విభాగాలతో కూడిన స్క్రీన్ కనిపిస్తుంది. మొదట నోటిఫికేషన్ అన్న విభాగం ఉంటుంది. దానికి కింద క్లిక్ చేస్తే.. భర్తీ చేసే ఉద్యోగాల వారీగా వివరాలు ఉంటాయి. ఏ ఉద్యోగానికి సంబంధించిన పేరు మీద క్లిక్ చేస్తే.. ఆ ఉద్యోగానికి సంబంధించి జిల్లా వారీగా ఖాళీలు, విద్యార్హత, పరీక్ష విధానం వంటి సమగ్ర వివరాలు ఉంటాయి. వాటి ఆధారంగా అభ్యర్థి తనకు ఆసక్తి ఉన్న ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. స్టెప్-1లో పేర్కొన్న రెండో కాలంలో ఉన్న బటన్ క్లిక్ చేసి అభ్యర్థి పేరు, ఆధార్ వివరాలు లేదా ఇతర గుర్తింపు కార్డు వివరాలతోపాటు మొబైల్ నంబర్, ఫొటోను అప్‌లోడ్ చేస్తే సంబంధిత : 
 అభ్యర్థి ఫోన్ నంబర్‌కు అతని దరఖాస్తుకు సంబంధించి కేటాయించిన ఐడీ వివరాలు మెసేజ్ అందుతుంది. ఆ ఐడీ వివరాల ప్రకారమే అతడు ఆన్‌లైన్‌లో తన దరఖాస్తును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టెప్ -2 విభాగంలోని బటన్‌ను క్లిక్ చేస్తే.. అభ్యర్థి మొబైల్‌కు మెసేజ్ ద్వారా అందిన ఐడీ నంబర్ వివరాలు నమోదుకు బాక్స్‌లు ఉంటాయి. ఐడీ నంబర్ నమోదుతో పాటు తాను ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారనే వివరాలను అక్కడ నమోదు చేస్తే పూర్తి దరఖాస్తు ఫారం నమూనా ఓపెన్ అవుతుంది. తప్పులు లేకుండా దానిని నింపాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారం పూర్తి చేసినట్టు క్లిక్ బటన్ నొక్కే ముందువరకు తప్పులను సరిచేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తులో పేర్కొన్న వివరాలను మార్చడానికి వీలుండదు. నాల్గవ కాలమ్‌గా అభ్యర్థి దరఖాస్తుకు సంబంధించి చెల్లించాల్సిన ఫీజుల వివరాలు ఉంటాయి. అక్కడ బటన్ క్లిక్ చేసి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చివరన గ్రామ సచివాలయాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోల వివరాలు ఉన్నాయి. అభ్యర్థికి ఏమైనా సమాచారం కావాలంటే అక్కడ తెలుసుకోవచ్చు.
 
 పోస్టుల వారీగా పరీక్ష విధానం.. వివరాలు
 

 1. పంచాయతీ కార్యదర్శి :  ఖాళీలు: 7,040
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు) : జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (75)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): చరిత్ర, ఎకనామిక్స్, జాగ్రఫీ, పాలిటిక్స్ (75)  
 
 2. గ్రామ రెవెన్యూ ఆఫీసర్ (గ్రేడ్-2) :  ఖాళీలు: 2,880
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు)
 : జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (50) 
 పేపర్-2 సిలబస్ (మార్కులు): డ్రాయింగ్ అండ్ సర్వే (100) 
 
 3. ఏఎన్‌ఎం : 
 ఖాళీలు:
 13,540
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు)
 : జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (50)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు (100) 
 
 4. పశు సంవర్ధక శాఖ సహాయకుడు :
 ఖాళీలు:
 9,886
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు) : జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (50)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): పశు సంవర్ధక సబ్జెక్ట్‌పై (100) 
 
 5. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ : 
 ఖాళీలు:
 794
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు) : జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (50)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): ఫిషరీస్, ఆక్వాకల్చర్‌పై (100 ) 
 
 6. విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ : 
 ఖాళీలు:
 4,000
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు)
 : జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (50)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): హార్టీకల్చర్‌పై (100) 
 
 7. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ : ఖాళీలు:  6,714
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు) : జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (50)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): అగ్రికల్చర్ మీద (100)
 
 8. విలేజ్ సెరీకల్చర్ అసిస్టెంట్
 ఖాళీలు:
 400
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు
) : జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (50)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): సెరీకల్చర్ (100) 
 
 9. మహిళా పోలీస్ : 
 ఖాళీలు:
 14,944
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు) : జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (75)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): ఎకనమిక్స్, జాగ్రఫీ, చరిత్ర, పాలిటిక్స్, రాష్ట్ర సంబంధిత అంశాలపై (75) 
 
 10.  ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-2) :  ఖాళీలు:11,158
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు)
 : జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (50) 
 పేపర్-2 సిలబస్ (మార్కులు): సివిల్ లేదా మెకానికల్ సబ్జెక్టుపై (100)
 
 11. డిజిటల్ అసిస్టెంట్ : 
 ఖాళీలు:11
,158
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు) : జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ,చరిత్ర, ఎకనమిక్స్ (50)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌పై (100) 
 
 12. విలేజ్ సర్వేయర్: 
 ఖాళీలు :
 11,058
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు) :
  జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ,చరిత్ర, ఎకనమిక్స్ (50)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): సర్వే సబ్జెక్ట్ (100)  
  13. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్: : 
 ఖాళీలు :
 11,058
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు) :  జనరల్ ఇంగ్లిష్, కంప్యూటర్ పరిజ్ఞానం (75)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): చరిత్ర, ఎకనమిక్స్, విభజన తరువాత  రాష్ట్ర పరిస్ధితి, సంక్షేమ పథకాలు (75)
  14. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ :  ఖాళీలు : 3,307
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు) :  జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (75)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): చరిత్ర, ఎకనామిక్స్, జాగ్రఫీ, పాలిటిక్స్ (75)
 
 15. వార్డు ఎనిమిటీస్ సెక్రటరీ :  ఖాళీలు : 3,601
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు) :  జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (50)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): సివిల్ లేదా మెకానికల్ సబ్జెక్ట్‌పై (100) 
  16. వార్డు శానిటేషన్ సెక్రటరీ : 
 ఖాళీలు :
 3,648
 పరీక్ష విధానం :  
 పేపర్-1 సిలబస్ (మార్కులు) :  జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (50)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంట్ సైన్స్పై (100)
 
 17. వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ
 ఖాళీలు
 : 3,786
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు) :  జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ(50)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): విద్య, కంప్యూటర్, కమ్యూనికేషన్ సబ్జెక్ట్‌లు (100) 
  18. వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ : 
 ఖాళీలు :
 3,770
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు) :  జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (50)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): టౌన్‌ప్లానింగ్, మాస్టర్ ప్లాన్, అర్బన్ ఫారెస్ట్, సర్వే అండ్ బిల్డింగ్ ప్లాన్ సబ్జెక్టులపై (100)
 
 19. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ : 
 ఖాళీలు :
 3,786
 పరీక్ష విధానం : 
 పేపర్-1 సిలబస్ (మార్కులు) :  జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ(50)
 పేపర్-2 సిలబస్ (మార్కులు): అంత్రోపాలజీ, సోషల్ వర్క్, ఎకనమిక్ ప్లానింగ్ తదితర సబ్జెక్టులపై (100) 

Saturday, July 27, 2019

WARDSACHIVALAY NOTIFICATION

JOBS WITH DEGREE QUALIFICATION , GRAMA SACHIVALAY JOBS

POSTS :


1.Panchayat Secretary Grade-V - 7040

2. WELFARE AND EDUCATION ASSISTANTS - 11158

3.MAHILA POLICE AND WOMEN & CHILD WELFARE ASSISTANT / WARD WOMEN & WEAKER SECTIONS PROTECTION SECRETARY  -  14944

QUALIFICATION : DEGREE

AGE : 18 - 42 

FEE : 200

EXAM PATTERN  


Written examination (Objective Type)              No,of questions Duration (minutes) Maximum Marks

Part-A: General Studies and mental ability              75                       75                          75
Part–B:History, Economy, Geography, Politics etc., 75                      75                          75

TOTAL                                                                                                                               150

Note:- For each correct answer 1 mark will be awarded and each wrong answer will carry negative mark.

SYLLABUS

PART-A GENERAL STUDIES AND MENTAL ABILITY 

1. General Mental ability and reasoning.
2. Quantitative aptitude including data interpretation.
3. Comprehension – Telugu & English.
4. General English.
5. Basic Computer Knowledge.
6. Current affairs of regional, national and International importance.
7. General Science and its applications to the day to day life, Contemporary development in science and Technology and information Technology.
8. Sustainable Development and Environmental Protection.

PART-B 

1. History & Culture of India with specific focus on AP.
2. Indian polity and governance: constitutional issues, 73/74th Amendments, public policy, reforms ad centre – state relations with specific reference to Andhra Pradesh.
3. Economy and Planning in India with emphasis on Andhra Pradesh.
4. Society, Social justice, rights issues.
5. Physical geography of Indian sub-continent and Andhra Pradesh.
6. Bifurcation of Andhra Pradesh and its Administrative, Economic, Social, Cultural, Political and legal implications / problems.
7. Key welfare & development schemes of Government of Andhra Pradesh.
8. Women empowerment and economic development through self help grounds / community based organizations with focus on weaker sections.


APPLY HERE
http://vsws.ap.gov.in/


OFFICIAL NOTIFICATION , GRAMA SACHIVALAY JOBS

notifiation  LINK

http://gramasachivalayam.ap.gov.in/apgs_notifications.jsp

1Recritment for the Post of Panchayat Secretary (Grade-V)

2Recritment for the Post of Village Revenue Officer (Grade-II)

3Recritment for the Post of ANMs (Grade-III)

4Recritment for the Post of Animal Husbandary Assistant

5Recritment for the Post of Village Fisheries Assistant

6Recritment for the Post of Village Horticulture Assistant

7Recritment for the Post of Village Agriculture Assistant (Grade-II)

8Recritment for the Post of Village Sericulture Assistant

9Recritment for the Post of Mahila Police and Women & Child Welfare Assistant

10Recritment for the Post of Engineering Assistant (Grade-II)

11Recritment for the Post of Panchayat Secretary (Grade-VI) Digital Assistant

12Recritment for the Post of Village Surveyor (Grade-III)

13Recritment for the Post of Welfare and Education Assistant

1,26,728 గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు

1,26,728 గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు

మరో 9,359 లైన్‌మెన్‌ పోస్టులకు వేరుగా నోటిఫికేషన్‌ ఇవ్వనున్న విద్యుత్‌ డిస్కమ్‌లు
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీచేసిన పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు
22 రకాల పోస్టులను భర్తీ చేయనున్న సర్కారు
మొత్తం 1,36,087 ప్రభుత్వోద్యోగాల భర్తీ
ఆన్‌లైన్‌ ద్వారానే దరఖాస్తుల స్వీకరణ
మూడు ప్రత్యేక వెబ్‌సైట్ల ఏర్పాటు
నేటి ఉ.11 గంటల నుంచి అందుబాటులోకి
విద్యార్హత, వయో పరిమితి,ఎంపిక విధానం వంటి వివరాలన్నీ వెబ్‌సైట్‌లో
ఆగస్టు 10 అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ
సెప్టెంబరు 1న రాత పరీక్ష.. 150 మార్కులు,150 ప్రశ్నలు.. నెగిటివ్‌ మార్కులు కూడా 
ఇప్పటికే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌లో పనిచేసే వారికి వెయిటేజీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ కనివినీ ఎరుగని రీతిలో ఒకే విడతలో 1,26,728 ప్రభుత్వోద్యోగ నియామకాలకు సంబంధించిన రెండు నోటిఫికేషన్లు శుక్రవారం రాత్రి విడుదలయ్యాయి. గ్రామ సచివాలయాల్లో 95,088 ఉద్యోగాలకు పంచాయతీరాజ్‌ శాఖ.. పట్టణ వార్డు సచివాలయాల్లో 31,640 ఉద్యోగాలకు పట్టణాభివృద్ది శాఖ నోటిఫికేషన్లను వేర్వేరుగా జారీచేశాయి. శనివారం ఉ.11 గంటల నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఆగస్టు 10వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. సెప్టెంబరు ఒకటవ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తారు. సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన రోజునే గ్రామ, వార్డు స్థాయిలో సచివాలయాల వ్యవస్థను కొత్తగా ఏర్పాటుచేసి, ప్రతి సచివాలయంలో పనిచేసేందుకు 10 నుంచి 12 మంది చొప్పున నియమించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో 11,158 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాలను ఏర్పాటుచేస్తున్నారు. వైద్య ఆరోగ్య, రెవెన్యూ, పోలీస్‌ తదితర 11 ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ మొత్తం 22 రకాల ఉద్యోగాలను సర్కారు భర్తీచేస్తుంది.
మూడు ప్రత్యేక వెబ్‌సైట్ల ద్వారా..
కాగా, ఆయా ఉద్యోగాలకు అర్హులైన నిర్యుదోగ యువత నుంచి అన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించేందుకు  gramasachivalayam. ap. gov. in,   vsws. ap. gov. in,  wardsachivalayam. ap. gov. in అనే మూడు ప్రత్యేక వెబ్‌సైట్లను సిద్ధంచేశారు. శనివారం ఉ.11 గంటల నుంచి ఇవి దరఖాస్తుదారులకు అందుబాటులోకి వస్తాయని పంచాయతీరాజ్, పట్టణాభివృద్ది శాఖ అధికారులు చెబుతున్నారు. నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు ఫారం, 22 రకాల ఉద్యోగాలకు వేర్వేరుగా ఏ ఉద్యోగానికి ఏయే విద్యార్హతలు, వయో పరిమితి, ఎంపిక విధానం, రాత పరీక్షకు సంబంధించిన సిలబస్‌ వంటి వివరాలను ఆయా వెబ్‌సైట్లలోనే అందుబాటులో ఉంచుతారు. 
రెండంచెల పరీక్ష విధానం..
అన్ని రకాల ఉద్యోగాల భర్తీకి రెండంచెల పరీక్ష విధానం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి ఉద్యోగానికి 150 మార్కులకు రెండు పేపర్ల విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానానికి నెగిటివ్‌ మార్కింగ్‌ విధానాన్ని కూడా ప్రవేశపెట్టనున్నారు. గ్రామ సచివాలయాల్లో పనిచేయడం కోసం భర్తీచేసే వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, డిజిటల్‌ అసిస్టెంట్, మహిళా పోలీసు, వేల్పేర్‌ మరియు ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఉదయం 75 మార్కులకు జనరల్‌ నాలెడ్జిలో, సాయంత్రం 75 మార్కులకు రీజనింగ్, మెంటల్‌ ఎబిలిటీ అంశాలపై పరీక్ష నిర్వహిస్తారు. అలాగే, ఏఎన్‌ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, విలేజ్‌ ఫిషరీస్‌ అసిస్టెంట్, విలేజీ అగ్రికల్చర్‌ అసిస్టెంట్, విలేజీ హార్టికల్చర్‌ అసిస్టెంట్, విలేజీ సెరికల్చర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఉదయం 50 మార్కులకు జనరల్‌ నాలెడ్జిపై.. సాయంత్రం వంద మార్కులకు రీజనింగ్, మెంటల్‌ ఎబిలిటీతో పాటు ఆయా ఉద్యోగానికి సంబంధించిన అంశాలపై పరీక్ష ఉంటుంది. 
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వెయిటేజీ
కాగా, ఇప్పటికే ఆయా శాఖల్లో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిన పనిచేస్తూ నోటిఫికేషన్‌లో పేర్కొన్న మేరకు వారికి అర్హత ఉండి రాత పరీక్షకు హాజరైతే.. అలాంటి అభ్యర్థులకు వెయిటేజీ ఇవ్వాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఒక్కో ఉద్యోగానికి ఆ శాఖలో ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఈ వెయిటేజీ వేర్వేరుగా ఉంటుంది.  
9,359 లైన్‌మెన్‌ పోస్టుల భర్తీ కూడా.
ఇదిలా ఉంటే.. 9,359 ఎనర్జీ అసిస్టెంట్‌ (లైన్‌మెన్‌) ఉద్యోగాల భర్తీకి కూడా  వేరుగా నోటిఫికేషన్‌ రానుంది. విద్యుత్‌ డిస్కంలు దీనిని జారీచేస్తాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గ్రామ సచివాలయాల్లో పనిచేసేందుకు 5,573 గ్రామ ఎనర్జీ అసిస్టెంట్‌ పోస్టులను, వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు 3,786 వార్డు ఎనర్జీ సెక్రటరీ పోస్టులను డిస్కంలు వేరుగా భర్తీచేస్తాయి. ప్రభుత్వ ఉద్యోగ నియామక నిబంధనలకు, డిస్కం ద్వారా చేపట్టే ఉద్యోగ నియామకాల తీరు వేర్వేరు కావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఈ నోటిఫికేషన్‌ కూడా ఒకట్రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 
గ్రామ సచివాలయాల సంఖ్య పెంపునకు ప్రతిపాదన
మొదట 11,114 గ్రామ సచివాలయాలను ఏర్పాటుచేయాలని సర్కారు నిర్ణయించగా.. తాజాగా ఆ సంఖ్యను 11,158కు పెంచాలని కోరుతూ పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ శుక్రవారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ కడప, కర్నూలు జిల్లాలో మొదట ప్రతిపాదించిన వాటి కన్నా కొన్ని అదనంగా గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. 

Monday, July 22, 2019

Numbers
In Decimal number system, there are ten symbols namely 0,1,2,3,4,5,6,7,8 and 9 called digits. A number is denoted by group of these digits called as numerals.
Face Value
Face value of a digit in a numeral is value of the digit itself. For example in 321, face value of 1 is 1, face value of 2 is 2 and face value of 3 is 3.
Place Value
Place value of a digit in a numeral is value of the digit multiplied by 10n where n starts from 0. For example in 321:

Place value of 1 = 1 x 100 = 1 x 1 = 1
Place value of 2 = 2 x 101 = 2 x 10 = 20
Place value of 3 = 3 x 102 = 3 x 100 = 300
0th position digit is called unit digit and is the most commonly used topic in aptitude tests.
Types of Numbers
Natural Numbers - n > 0 where n is counting number; [1,2,3...]
Whole Numbers - n ≥ 0 where n is counting number; [0,1,2,3...].
0 is the only whole number which is not a natural number.
Every natural number is a whole number.
Integers - n ≥ 0 or n ≤ 0 where n is counting number;...,-3,-2,-1,0,1,2,3... are integers.
Positive Integers - n > 0; [1,2,3...]
Negative Integers - n < 0; [-1,-2,-3...]
Non-Positive Integers - n ≤ 0; [0,-1,-2,-3...]
Non-Negative Integers - n ≥ 0; [0,1,2,3...]
  1. 0 is neither positive nor negative integer.

Even Numbers - n / 2 = 0 where n is counting number; [0,2,4,...]
Odd Numbers - n / 2 ≠ 0 where n is counting number; [1,3,5,...]

Prime Numbers - Numbers which is divisible by themselves only apart from 1.
1 is not a prime number.
To test a number p to be prime, find a whole number k such that k > √p. Get all prime numbers less than or equal to k and divide p with each of these prime numbers. If no number divides p exactly then p is a prime number otherwise it is not a prime number.

Composite Numbers - Non-prime numbers > 1. For example, 4,6,8,9 etc.
      1 is neither a prime number nor a composite number.
      2 is the only even prime number. 


Co-Primes Numbers - Two natural numbers are co-primes if their H.C.F. is 1. For example, (2,3), (4,5) are co-primes.

Some Basic Formulae:
  1. (a + b)(a - b) = (a2 - b2)
  2. (a + b)2 = (a2 + b2 + 2ab)
  3. (a - b)2 = (a2 + b2 - 2ab)
  4. (a + b + c)2 = a2 + b2 + c2 + 2(ab + bc + ca)
  5. (a3 + b3) = (a + b)(a2 - ab + b2)
  6. (a3 - b3) = (a - b)(a2 + ab + b2)
  7. (a3 + b3 + c3 - 3abc) = (a + b + c)(a2 + b2 + c2 - ab - bc - ac)
  8. When a + b + c = 0, then a3 + b3 + c3 = 3abc.




Saturday, July 20, 2019

Department wise vacancies, GRAMA SACHIVALAY JOBS

శాఖల వారీగా రిక్రూట్మెంట్ వివరాలు:


పంచాయతీ సెక్రటరీలు:  ఖాళీ పోస్టుల భర్తీ 5417
వీఆర్వో:           ఖాళీ పోస్టుల భర్తీ 1790, కొత్త పోస్టులు 898
సర్వే అసిస్టెంట్లు:      కొత్త పోస్టులు 11, 114
ఏఎన్ఎంలు:            ఖాళీ పోస్టుల భర్తీ 2200
పశుసంవర్ధక సహయకులు:      కొత్త పోస్టులు 9800
మహిళ పోలీస్:         కొత్త పోస్టులు 11,114
గ్రామ ఇంజనీర్:         కొత్త పోస్టులు 11,114
లైన్ మెన్లు:          ఖాళీ పోస్టుల భర్తీ 4691, కొత్త పోస్టులు 838
ఎంపీఈవోలు:            కొత్త పోస్టులు 9948
డిజిటల్ అసిస్టెంట్:     కొత్త పోస్టులు 11,114
సంక్షేమ, విద్యా సహయకుడు:       కొత్త పోస్టులు 11,114